మాగుంట సుబ్బరామిరెడ్డి

భారత పార్లమెంటు సభ్యుడు

మాగుంట సుబ్బరామిరెడ్డి (నవంబర్ 26, 1947 - డిసెంబర్ 1, 1995) బాలాజీ గ్రూప్ స్థాపకుడు. మద్యం డిస్ట్రిబ్యూటర్. మాగుంట సుబ్బరామిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా పనిచేశాడు.

మాగుంట సుబ్బరామిరెడ్డి

10వ లోకసభ సభ్యుడు
పదవీ కాలం
1991-1996

వ్యక్తిగత వివరాలు

జననం (1947-11-26) 1947 నవంబరు 26 (వయసు 75)
మరణం 1995 డిసెంబరు 1(1995-12-01) (వయసు 48)
ఒంగోలు
రాజకీయ పార్టీ కాంగ్రేస్ పార్టీ
జీవిత భాగస్వామి మాగుంట పార్వతి
సంతానం 1 కుమారుడు, 1 కుమార్తె
మతం హిందూ


మాగుంట సుబ్బరామిరెడ్డి

1986 -88 లో సారా సిండికేట్ మాగుంట సుబ్బరామిరెడ్డి ఆధీనంలో ఉండేవి. మాగుంట సుబ్బరామిరెడ్డి సారా సిండికేట్ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతుండేవాడు[1].


జీవిత విశేషాలుసవరించు

మాగుంట సుబ్బరామిరెడ్డి 1947 నవంబర్ 26న నెల్లూరు జిల్లాలో జన్మించాడు. ఇతని తండ్రి మాగుంట రాఘవరెడ్డి. ఇతడు కర్ణాటక రాష్ట్రం తుమకూరులో చదివి ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో మానివేశాడు. 1967 ఫిబ్రవరిలో ఇతనికి పార్వతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (మాగుంట విజయ్‌రెడ్డి), 1 కుమార్తె ఉన్నారు[2].

ప్రజా జీవితంసవరించు

ఇతడు కాంగ్రెస్ (ఐ) తరఫున ఒంగోలు లోకసభ నియోజకవర్గం నుండి 1991 సాధారణ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందాడు. 1991 నుండి 1996 వరకు లోకసభ సభ్యుడిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించాడు. ఇతడు నెల్లూరులోని రంగనాథస్వామి ఆలయానికి ట్రస్టీగా ఉన్నాడు. మద్రాసులోని కళాసాగర్ సంస్థకు ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయనిర్మాణాలు, బలహీన వర్గాలకు కమ్యూనిటీ హాళ్లు, కళ్యాణమందిరాల నిర్మాణాలు వంటి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ఉదయం దినపత్రికను కొన్నాళ్ళు నడిపాడు[2].[3]

మూలాలుసవరించు

  1. పి.వి.ఆర్.కె.ప్రసాద్ (2010). అసలేం జరిగిందంటే (1 ed.). విజయవాడ: ఎమెస్కో బుక్స్. pp. 176, 180–181. ISBN 978-93-80409-13-9.
  2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "Tenth Lok Sabha Members Bioprofile REDDY, SHRI MAGUNTA SUBBARAMA". Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE. Lok Sabha Secretariat. Retrieved 13 May 2020.
  3. Sakshi (20 March 2019). "ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.

బాహ్య లంకెలుసవరించు