మాగుంట పార్వతమ్మ
మాగుంట పార్వతమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
మాగుంట పార్వతమ్మ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2004 - 2009 | |||
ముందు | వంటేరు వేణుగోపాల్ రెడ్డి | ||
---|---|---|---|
తరువాత | బీద మస్తాన్ రావు | ||
నియోజకవర్గం | కావాలి | ||
లోక్‌సభ సభ్యురాలు
| |||
పదవీ కాలం 1996 - 1998 | |||
ముందు | మాగుంట సుబ్బరామిరెడ్డి | ||
తరువాత | మాగుంట శ్రీనివాసులురెడ్డి | ||
నియోజకవర్గం | ఒంగోలు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | మాగుంట సుబ్బరామిరెడ్డి |
జననం, విద్యాభాస్యం
మార్చుమాగుంట పార్వతమ్మ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో బెజవాడ రామారెడ్డి దంపతులకు 1947 జూలై 27న జన్మించింది. ఆమె కస్తూరి దేవి బాలికల పాఠశాల నుండి పాఠశాల విద్యను అభ్యసించింది.
రాజకీయ జీవితం
మార్చుమాగుంట పార్వతమ్మ 19 ఫిబ్రవరి 1967న మాగుంట సుబ్బరామ రెడ్డిని వివాహం చేసుకుంది. ఆయనను 1995 లో పీపుల్స్ వార్ గ్రూప్ సభ్యుల చేతిలో హతమవ్వగా[2], 1996లో ఆమె 1996 భారత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డిపై 50060 ఓట్ల మెజారిటీతో గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికైంది.[3][4] మాగుంట పార్వతమ్మ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5] ఆమె 2012లో జరిగిన ఒంగోలు శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయింది.[6]
మూలాలు
మార్చు- ↑ "Magunta Parvathamma" (PDF). 2012. Archived from the original (PDF) on 16 March 2024. Retrieved 16 March 2024.
- ↑ "Lifer for two for Magunta's murder". The Hindu. 5 August 2000. Retrieved 27 November 2017.[dead link]
- ↑ Sakshi (5 April 2019). "ఒంగోలు పార్లమెంటులో వార్ వన్‌సైడ్". Archived from the original on 17 March 2024. Retrieved 17 March 2024.
- ↑ "Statistical Report on General Elections, 1996 to the Eleventh Lok Sabha" (PDF). Election Commission of India. p. 26. Retrieved 27 November 2017.
- ↑ "State Elections 2004 - Partywise Comparison for 125-Kavali Constituency of Andhra Pradesh". Election Commission of India. Retrieved 27 November 2017.
- ↑ "Magunta Parvathamma hits the campaign trail". The Hindu. 6 May 2012. Retrieved 27 November 2017.