మాచిరెడ్డిపల్లె (వల్లూరు)
మాచిరెడ్డిపల్లె, వైఎస్ఆర్ జిల్లా వల్లూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
మాచిరెడ్డిపల్లె | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 14°33′13″N 78°39′09″E / 14.553741°N 78.652638°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
మండలం | వల్లూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఈ గ్రామంలో నెలకొనియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో, ఫాల్గుణశుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమినాడు, 3 రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. పౌర్ణమిరోజున ఉదయం, మూలవిరాట్టుకి అభిషేకాలు నిర్వహించెదరు. స్వామివారికి చందన అలంకారం చేస్తారు. వివిధహోమాలు, పూర్ణాహుతి నిర్వహించెదరు. ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం నిర్వహించెదరు. ఈ కళ్యాణోత్సవం తిలకించేటందుకు పరిసర గ్రామాలనుండి భక్తులు విశేషంగా వచ్చెదరు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కళ్యాణం అనంతరం భక్తులకు పెళ్ళిభోజనం వడ్డిస్తారు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్లబండ్ల లాగుడు పోటీలు నిర్వహించి, గెలిచినవాటికి బహుమతులందజేస్తారు.