మాణిక్యం ఠాగూర్

మాణిక్యం ఠాగూర్‌ తమిళనాడు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని విరుధానగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. మాణిక్యం ఠాగూర్‌ 2020 సెప్టెంబర్ 11న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితుడయ్యాడు.[2]

మాణిక్యం ఠాగూర్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
18 జూన్ 2019 – ప్రస్తుతం
ముందు టి. రాధాకృష్ణన్
నియోజకవర్గం విరుధానగర్ పార్లమెంట్ నియోజకవర్గం
పదవీ కాలం
1 జూన్ 2009 – 18 మే 2014
తరువాత ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు
నియోజకవర్గం విరుధానగర్ పార్లమెంట్ నియోజకవర్గం

చైర్‌పర్సన్‌ – మదురై ఎయిర్పోర్ట్ అడ్వైసరి కమిటీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
18 జూన్ 2019
ముందు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు
పదవీ కాలం
1 జూన్ 2009 – 18 మే 2014
ముందు ఎన్. ఎస్. వి. చిత్తన్
తరువాత టి. రాధాకృష్ణన్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2020

ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల, ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు
పదవీ కాలం
2016 – 2017

పశ్చిమ బెంగాల్, బీహార్ & అసోం రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు
పదవీ కాలం
2014 – 2016

వ్యక్తిగత వివరాలు

జననం (1975-06-01) 1975 జూన్ 1 (వయసు 49)[1]
శివగంగ, తమిళనాడు, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి
సుభాషిణి మాణిక్యం
(m. 2004)
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన ఎన్‌.ఎస్‌.యు.ఐ (NSUI)లో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అనంతరం జాతీయ ఎన్ఎస్‌యూఐ ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా, జాతీయ యూత్ కాంగ్రెస్ ఎన్నికల కమిషనర్‌‌గా, కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని విరుధానగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]మాణిక్యం ఠాగూర్‌ 2020 సెప్టెంబర్ 11న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితుడై[4], 2023 జనవరి 4 వరకు పని చేసిన ఆయనను 2023 జనవరి 4న గోవా[5], ఆ తరువాత 2023 డిసెంబర్ 23న ఆంధ్రప్రదేశ్ ఏఐసీసీ ఇంచార్జిగా కాంగ్రెస్ హై కమాండ్ నియమించింది.[6]

మూలాలు

మార్చు
  1. Manickam Tagore B. (2021). "Members : Lok Sabha". loksabhaph.nic.in. Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  2. Eenadu (12 September 2020). "తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త‌ ఇన్‌ఛార్జ్‌". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  3. The New Indian Express (25 May 2019). "Manickam Tagore to represent Virudhunagar for a second time". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
  4. News18 Telugu (11 September 2020). "హస్తం పార్టీలో ప్రక్షాళన, తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (4 January 2023). "తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. Andhrajyothy (24 December 2023). "టీకాంగ్రెస్‌ బాధ్యత దీపాదాస్‌ మున్షీకి". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.