మాధవరావు సింధియా

మాధవరావు సింధియా ( 1945 మార్చి 10 - 2001 సెప్టెంబరు 30) ఒక భారతీయ రాజకీయ నాయకుడు . కేంద్ర మత్రిగా పనిచేశాడు. మాధవరావు సింధియా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.

మాధవరావు సింధియా
గల్వార్ మహారాజు
గల్వార్ మహారాజు
పరిపాలన16 జులై 1961 – 2001
Coronation1961
పూర్వాధికారిజీవరాజ్ సింధియా
ఉత్తరాధికారిజ్యోతి ఆదిత్య సింధియా

మాధవరావు సింధియా బ్రిటీష్ రాజ్ కాలంలో గ్వాలియర్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలక మహారాజు అయిన జివాజీరావు సింధియా కుమారుడు.

బాల్యం

మార్చు

మాధవరావు సింధియా ఒక మరాఠా కుటుంబంలో గ్వాలియర్ చివరి మహారాజు జీవాజీరావ్ సింధియాకు జన్మించాడు. మాధవరావు సింధియాకు ఇద్దరు కుమారులు చిత్రాంగద సింగ్ (జననం 1967) జ్యోతిరాదిత్య సింధియా (జననం 1971)

మాధవరావుసింధియా గ్వాలియర్‌లోని సింధియా స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు ఆ తర్వాత వించెస్టర్ కాలేజీలో ఆక్స్‌ఫర్డ్‌లోని న్యూ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు.[1]

మాధవరావు సింధియా 1971లో భారతీయ జనసంఘ్ పార్టీ తరపున గుణ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1]

రాజకీయ జీవితం

మార్చు

మాధవరావు సింధియా తొమ్మిది పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచాడు., మాధవరావు సింధియా 1971 నుండి ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోలేదు. మాధవరావు సింధియా 26 సంవత్సరాల వయస్సులో గుణ నియోజకవర్గం నుండి మొదటిసారి ఎంపీగా గెలిచాడు. మాధవరావు సింధియా భారతీయ జనసంఘ్ పార్టీ తరఫునఎన్నికల్లో పోటీ చేశాడు. ఎమర్జెన్సీ సమయంలో, మాధవరావు సింధియా భారతదేశం నుంచి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయాడు.

మాధవరావు ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, భారతీయ జనసంఘ్‌ పార్టీకిరాజీనామా చేశాడు. గుణ నియోజక వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జనతాపార్టీకి అనుకూలమైన ప్రభావం ఉన్నప్పటికీ ఆ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు .[2]

1980 ఎన్నికలలో, మాధవరావు సింధియా భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. ఆ ఎన్నికల్లో గుణ నియోజకవర్గం నుండి మూడవసారి గెలుపొందాడు. 1984లో, భారతీయ జనతా పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి.ఓడించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మాధవరావుసింధియా గ్వాలియర్ గుణ నుంచి పోటీ చేసి ఒక్కో సారి గెలిచారు.

1984 ఎన్నికలలో మాధవరావు సింధియా ఎంపీగా గెలిచి పివి నరసింహారావు మంత్రి వర్గంలో తొలిసారి పనిచేశాడు. రాజీవ్ గాంధీ మంత్రి వర్గంలో రైల్వే మంత్రిగా ( 1986 అక్టోబరు 22 - 1989 డిసెంబరు 1) [3] రైల్వే శాఖామంత్రిగా అద్భుతమైన పనితీరును కనబరిచాడు.

పివి నరసింహారావు మంత్రివర్గంలో మాధవరావు సింధియా పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశాడు.

2001 సెప్టెంబరు30న ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా శివార్లలోని మొట్టా గ్రామంలో జరిగిన విమాన ప్రమాదంలో మాధవరావు సింధియా 56 సంవత్సరాల వయస్సులో మరణించారు. విమానంలో మంటలు చెలరేగాయి దీంతో మాధవరావు సింధియా మరణించాడు.[4] 1999 లోక్‌సభ ఎన్నికలకు ముందు సోనియాగాంధీ తరుపున ఎన్నికలలో ప్రచారం చేయడానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.[5]

ఈ ప్రమాదంలో మాధవరావు సింధియాతో పాటు విమానంలో ఉన్న ఎనిమిది మంది వ్యక్తులు ప్రమాదంలో మరణించారు. మరణించిన వారిలో మాధవరావు సింధియా వ్యక్తిగత కార్యదర్శి రూపిందర్ సింగ్, జర్నలిస్టులు సంజీవ్ సిన్హా ( ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ), అంజు శర్మ ( ది హిందూస్తాన్ టైమ్స్ ), గోపాల్ బిష్త్, రంజన్ ఝా ( ఆజ్ తక్ ), పైలట్ రే గౌతమ్ కో-పైలట్ రీతూ మాలిక్ ఉన్నారు. మరణించిన అందరి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి రోడ్డు మార్గంలో ఆగ్రాకు మృతదేహాలను తరలించారు., అక్కడి నుండి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పంపిన ప్రత్యేక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో న్యూఢిల్లీకి తరలించారు. మాధవరావు సింధియా మృతదేహాన్ని అతని కుటుంబం గుర్తించింది, అతను ఎప్పుడూ ధరించే దుర్గా దేవత లాకెట్ ఉండడంతో గుర్తుపట్టారు.[6]

మాధవరావు సింధియా కుమారుడు జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా తరువాత రాజకీయాలలో రాణించాడు.[7]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Madhavrao Scindia". Encyclopedia Britannica. Retrieved 4 October 2020.
  2. Yadav, Shyamlal (2020-03-13). "The Gwalior dynasty: A short history of the Scindias in Indian politics". The Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2023-04-03.
  3. Railway Ministers. Irfca. Retrieved on 14 November 2018.
  4. Bhainsrauli village
  5. Madhavrao Scindia Dies In Plane Crash
  6. Goddess Durga Locket
  7. "The Scindia Dynasty. Genealogy". Royal Ark. Archived from the original on 10 March 2007.{{cite web}}: CS1 maint: unfit URL (link)