మాన్వితా కామత్
మాన్వితా కామత్, కన్నడ సినిమా నటి.[1] రేడియో మిర్చిలో రేడియో జాకీగా పనిచేసిన మాన్వితా 2015లో దునియా సూరి దర్శకత్వం వహించిన కెండసంపిగే అనే కన్నడ సినిమా ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది.
మాన్వితా కామత్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
తొలి జీవితం
మార్చుమాన్వితా 1992, ఏప్రిల్ 13న హరీష్ కామత్ - సుజాత కామత్ దంపతులకు కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. చిక్కమగళూరులోని కలసాలో ప్రాథమిక విద్య, తరువాత శారద పియు కళాశాలలో డిగ్రీ విద్యను పూర్తిచేసింది. మంగళూరులోని సెయింట్ అలోసియస్ కళాశాల నుండి జర్నలిజం, యానిమేషన్, ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రురాలైంది. మంగళూరులోని రేడియో మిర్చి ఒక సంవత్సరానికి పైగా పనిచేసింది, ఖిలాడీ 983 అనే పేరుతో ఒక షోను నిర్వహించింది.[2]
వృత్తిరంగం
మార్చుమాన్విత చిన్నప్పుడే భాస్కర్ నెల్లితీర్థ జానపద నాటక బృందంలో చేరి అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నది. కళాశాలలో కన్నడ సంఘానికి కార్యదర్శిగా కూడా పనిచేసింది.[3][4] దునియా సూరి దర్శకత్వం వహించిన కెండసంపిగే సినిమాకు ఆడిషన్స్ ద్వారా ప్రధాన పాత్రకు ఎంపికయింది.[5] విక్కీ వరుణ్ సరసన గౌరీ శెట్టిగా నటించిన ఈ సినిమావాణిజ్యపరంగా విజయవంతమైంది.[6] హ్యాట్రిక్ హీరో కలిసి టగరు సినిమాలో నటించింది.[7]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
2015 | కెండసంపిగే | గౌరీ శెట్టి | తొలి సినిమా | |
2017 | చౌకా | రమ్య | అతిధి పాత్ర | |
2018 | కనక | కనసు | ||
టగరు | పునర్వసు | |||
తారకాసురుడు | ముత్తమ్మ | |||
2019 | రిలాక్స్ సత్యా | మాయ | [8] | |
2020 | ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ | మేదిని | [9] | |
2021 | శివ 143 | మధు | [10] | |
రాజస్థాన్ డైరీస్ | సిరి | కన్నడ మరాఠీ ద్విభాషా | [11] | |
రెయిన్ బో | [12] | |||
హ్యాపీలీ మ్యారీడ్ | [13] |
అవార్డులు, సన్మానాలు
మార్చుసినిమా | అవార్డులు | వర్గం | ఫలితం | Ref. |
---|---|---|---|---|
కెండసంపిగే | 5వ సైమా అవార్డులు | ఉత్తమ నూతన నటి - కన్నడ | గెలుపు | [14][15] |
తాగారు | 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ నటి - కన్నడ | గెలుపు | [16] |
టిఎస్ఆర్ టివి9 ఫిల్మ్ అవార్డు | ఉత్తమ నటిగా ప్రత్యేక జ్యూరీ అవార్డు – కన్నడ | గెలుపు | ||
8వ సైమా అవార్డులు | ఉత్తమ నటి - కన్నడ | ప్రతిపాదించబడింది | [17] | |
విమర్శకుల ఉత్తమ నటి | గెలుపు | |||
ఫిల్మీబీట్ అవార్డు | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది | ||
సిటీ సినీ అవార్డు | ఉత్తమ నటి | ప్రతిపాదించబడింది |
మూలాలు
మార్చు- ↑ "EXCLUSIVE INTERVIEW: Mangalore girl Manvita Harish talks about her first movie". Udayavani. Archived from the original on 2017-01-26. Retrieved 2022-02-08.
- ↑ "Mirchi girl of Mangalore". Daijiworld Media. Archived from the original on 2016-08-20. Retrieved 2022-02-08.
- ↑ "Kendasampige Is Manvita's Break". The New Indian Express. Archived from the original on 2015-11-17. Retrieved 2022-02-08.
- ↑ "Manvita names her house Kendasampige". The Times of India.
- ↑ "RJ-turned-actress keen on Kollywood career". Sify. Archived from the original on 2016-05-23. Retrieved 2022-02-08.
- ↑ "The girlfriend everyone wants". The Hindu.
- ↑ "Shivarajkumar is now Tagaru". The Times of India.
- ↑ "ರಿಲ್ಯಾಕ್ಸ್ ಸತ್ಯದಲ್ಲಿ ಮಾನ್ವಿತಾಗೆ ಪ್ರಭು ಜೋಡಿ". Vijaya Karnataka. 2019-06-07. Retrieved 2022-02-08.
- ↑ "'India vs England': Manvitha has this to say about her experience of working with senior actor Ananth Nag – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ "Dheeren Ramkumar's debut film titled as Shiva 143 – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ "Manvitha Harish joins 'Rajasthan Diaries', shooting starts from April 6th – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ "Rainbow brings together Ajay Rao and Manvitha Kamath". The New Indian Express. Retrieved 2022-02-08.
- ↑ "Pruthvi Ambaar and Manvita Kamath team up for a thriller - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ "Kannada cinema's big winners at SIIMA 2016". The Times of India.
- ↑ "Archived copy". Archived from the original on 14 July 2016. Retrieved 2022-02-08.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "66th Filmfare Award Winners South". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-08.
- ↑ "SIIMA Awards 2019 full winners list". Times Now. 17 August 2019. Retrieved 2022-02-08.
బయటి లింకులు
మార్చు- మాన్వితా వెబ్సైట్ Archived 2017-12-07 at the Wayback Machine
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మాన్వితా కామత్ పేజీ