మాయాపేటిక
మాయాపేటిక 2023లో విడుదలైన తెలుగు సినిమా. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు.[1] పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సునీల్, పృధ్వీ, హిమజ, శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 30న విడుదలైంది.[2][3]
మాయాపేటిక | |
---|---|
దర్శకత్వం | రమేష్ రాపర్తి |
రచన | రమేష్ రాపర్తి |
పాటలు | శ్రీమణి |
నిర్మాత | మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సురేష్ రఘుతు |
సంగీతం | గుణ బాలసుబ్రమణియన్ |
నిర్మాణ సంస్థ | జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 30 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మాయా పేటిక 2024 సెప్టెంబరు 15న ఆహా ఓటీటీలో[4], 2024 మే 16 నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[5]
కథ
మార్చుపాయల్ (పాయల్ రాజపుత్) సినిమా హీరోయిన్ ఆమెకు ప్రొడ్యూసర్ గిఫ్టుగా ఒక ఫోన్ కొనిస్తాడు. ఆ ఫోన్ కొన్నప్పటి నుంచి పాయల్ కు ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రణయ్ (రజత్ రాఘవ్)కు మధ్య విభేదాలు ప్రారంభమవుతాయి. పాయల్ ఆ ఫోన్ ని ఆమె అసిస్టెంట్ నూక రాజుకు ఇస్తుంది. తర్వాత ఆ ఫోన్ ఆరుగురి మధ్య చేతులు ఎలా మారుతుంది? ఆ తర్వాత ఏ ఏ పరిణామాలు జరిగాయి, ఫోన్ వల్ల కార్పొరేటర్ కన్నె కామేశ్వరరావు (పృథ్వీరాజ్) అలీ (విరాజ్ అశ్విన్), ఆస్రా (సిమ్రత్ కౌర్), వాచ్‌మెన్, అతని భార్య సోషల్ మీడియాలో 'నక్కిలీసు గొలుసు' నారాయణ రావు (సునీల్) ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
మార్చు- పాయల్ రాజ్‌పుత్
- విరాజ్ అశ్విన్
- సునీల్
- పృధ్వీ
- హిమజ
- శ్రీనివాసరెడ్డి
- సిమ్రాత్ కౌర్
- రజత్ రాఘవ్
- శ్యామల
- మిర్చి కిరణ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ రాపర్తి
- సంగీతం: గుణ బాలసుబ్రమణియన్
- సినిమాటోగ్రఫీ: సురేష్ రఘుతు
పాటలు
మార్చుఈ సినిమాకు గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించాడు[6]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "షన్నా షన్నా" | శ్రీమణి | యశస్వి కొండేపూడి, ప్రజ్ఞా నాయిని | 4:08 |
2. | "సయోనారా" | శ్రీమణి | హారిక నారాయణ్ | 2:42 |
3. | "ఓ మనిషి" | లక్ష్మీ ప్రియాంక | కాల భైరవ | 4:28 |
4. | "మాయపేటిక థీమ్" | శ్రీమణి | ఎం.ఎం.మానసి | 4:29 |
5. | "జ్యోతి రాప్" | లిల్గుండ, శుభోద్ | లిల్గుండ, శుభోద్ | 1:50 |
6. | "షన్నా షన్నా రిప్రైజ్" | శ్రీమణి | గుణ బాలసుబ్రహ్మణ్యం | 3:39 |
మొత్తం నిడివి: | 21:16 |
మూలాలు
మార్చు- ↑ 123తెలుగు (30 జూన్ 2023). "`ఆకట్టుకోని బోరింగ్ డ్రామా". 123తెలుగు. Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ V6 Velugu (10 June 2023). "మాయాపేటికలో..మంచి విజువల్స్, ఆకట్టుకునే పాటలు". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (10 June 2023). "మాయా పేటిక రిలీజ్ డేట్ ప్రకటించిన కీర్తి సురేశ్". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
- ↑ TV9 Telugu (6 September 2023). "ఓటీటీలోకి 'మాయాపేటిక'.. విరాజ్ , పాయల్‌ల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Hindustantimes Telugu (15 May 2024). "మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ". Archived from the original on 15 May 2024. Retrieved 15 May 2024.
- ↑ "Mayapetika - All Songs - Download or Listen Free - JioSaavn". JioSaavn. 7 July 2023. Archived from the original on 4 February 2024. Retrieved 10 January 2024.