మారియా గాబ్రియెలా ఇస్లర్
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మారియా గాబ్రియెలా ఇస్లర్ వెనుజులా దేశానికి చెందిన ఒక టీవీ ప్రయోక్త, రూపదర్శి. ఈమె 2013 విశ్వసుందరిగా ఎంపికై వార్తలలో నిలిచింది.
అందాల పోటీల విజేత | |
జననము | María Gabriela de Jesús Isler Morales 1988 మార్చి 21 వెలెన్సియా. కరబోబో, వెనెజులా |
---|---|
ఎత్తు | 1.78 మీ. (5 అ. 10 అం.) |
కొలతలు | వక్షోజములు: 90 cమీ. (35.4 అం.) నడుము: 60 cమీ. (23.6 అం.) పిరుదులు: 90 cమీ. (35.4 అం.) |
బిరుదు (లు) | మిస్ గువారికో 2012 మిస్ వెనెజులా 2012[1] విశ్వ సుందరి 2013 |
నేపధ్యము
మార్చుటీవీ ప్రయోక్త (యాంకర్) గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట.
2013 విశ్వసుందరి పోటీలు
మార్చు2013 నవంబరు 9 శనివారం రష్యా రాజధాని మాస్కోలో జరిగిన మిస్ యూనివర్స్-2013 తుది పోటీలు జరిగాయి. ఇందులో మిస్ వెనెజువెలా గాబ్రియెలా ఇస్లర్ విజేతగా నిలిచింది.మిస్ స్పెయిన్ పాట్రికియా యురెనా రోడ్రిగ్జ్ రెండో స్థానంలో నిలవగా, మిస్ ఈక్వెడార్ కాన్‌స్టాంజా బెజ్ మూడు స్థానంలో నిలిచింది. మిస్ ఇండియా మానసి మోఘే టాప్ టెన్‌లో మాత్రమే స్థానం దక్కించుకుంది. మిస్ యూనివర్స్‌గా ప్రకటించగానే గాబ్రియెలా ఉద్వేగానికి గురై తన శిరసుపై అలంకరించిన విశ్వసుందరి కిరీటం జారిపోతున్న విషయాన్ని కూడా గ్రహించలేకపోయారు. చివరి నిమిషంలో గమనించిన గాబ్రియెలా కిరీటం కింద పడిపోకుండా పట్టుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ "María Gabriela Isler es la Miss Venezuela 2012". 2001.com.ve. Retrieved 2012-08-30.[permanent dead link]
బయటి లంకెలు
మార్చుAwards and achievements | ||
---|---|---|
అంతకు ముందువారు ఇరెన్ ఎస్సెర్ |
మిస్ వెనెజులా 2012 |
తరువాత వారు Migbelis Castellanos |
అంతకు ముందువారు Blanca Aljibes |
Miss Guárico 2012 |
తరువాత వారు Michelle Bertolini |
అంతకు ముందువారు Olivia Culpo |
విశ్వ సుందరి 2013 |
తరువాత వారు — |