మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుండి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) | |||
శాసనమండలి సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 మార్చి 2017 - 29 మార్చి 2023 | |||
నియోజకవర్గం | కడప జిల్లా స్థానిక సంస్థల కోటా | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1969 జూన్ 1 కసనూరు, సింహాద్రిపురం మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | మారెడ్డి కృష్ణా రెడ్డి, సరస్వతమ్మ | ||
జీవిత భాగస్వామి | లతా రెడ్డి |
జననం, విద్యాభాస్యం
మార్చుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి 1970 ఫిబ్రవరి 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, సింహాద్రిపురం మండలం, కసనూరు గ్రామంలో మారెడ్డి కృష్ణా రెడ్డి, సరస్వతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1992లో కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ యూనివర్సిటీ నుండి బీటెక్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2017లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుండి ఎమ్మెల్సీగా దివంగత ముఖ్యమంత్రి ys రాజశేఖరరెడ్డి గారి సోదరుడు మాజీమంత్రి ys వివేకానంద రెడ్డి గారి మీద ఎమ్మెల్సీగా గెలుపొందాడు. మొట్టమొదటి సారిగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఓటమి ఎరుగని వైస్సార్ కుటుంబం మీదే ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్ర స్థాయిలో చరిత్ర సృష్టించడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో అందుకు నిరసనగా తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[1] ఆయన 2020 నవంబరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు.[2]
మూలాలు
మార్చు- ↑ HMTV (31 July 2020). "టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి రాజీనామా". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
- ↑ "రాష్ట్ర కమిటీలో పదవులు వీరికే... టీడీపీ లిస్టు ఇదే..." 2020. Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.