మాల్వాల ప్యాలెస్
మాల్వాల ప్యాలెస్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ నుండి తూర్పువైపు వెళ్ళే రహదారి పక్కన ఉన్న రాజభవనం.[1] 1845లో మొఘల్, రాజస్థానీ శైలిలో ఈ ప్యాలెస్ నిర్మించబడింది. దీనిలోని చెక్కతో చెక్కిన మంటపం ప్రసిద్ధి చెందింది. రాజా భగవన్‌దాస్ బాగ్ ప్యాలెస్ కాకుండా, మాల్వాలా ప్యాలెస్ మాత్రమే హైదరాబాద్‌లో చెక్క మంటపం ఉన్న ఏకైక ప్యాలెస్.[2] గ్రాండ్ గేట్‌వే మినహా ప్యాలెస్ కాంప్లెక్స్ మొత్తం 2000 ఆగస్టులో కూల్చివేయబడి, దాని స్థానంలో షాపింగ్ మాల్ నిర్మించబడింది.[3] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
మాల్వాల ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
నిర్మాణ శైలి | మొఘల్, రాజస్థానీ శైలి |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
పూర్తి చేయబడినది | 1845 |
చరిత్ర
మార్చునిజాం నవాబులకు చెందిన రెవెన్యూ రికార్డులకు మాల్వాల వారు బాధ్యత వహించేవారు. హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన రెవెన్యూ రికార్డ్స్ (దఫ్తార్ -ఐ -మాల్) సంరక్షకుల కుటుంబంలోని దివాన్ చందూలాల్ కు చెందినదే ఈ ప్యాలెస్. 1724లో మొట్టమొదటి నిజాం పాలనలో 18వ శతాబ్దం ప్రారంభంలో నోబుల్ సాగర్ మాల్ ద్వారా ఇది నిర్మించబడింది.[4] మొఘల్, రాజస్థానీ శిల్ప శైలిలో నిర్మించిన హైదరాబాదులోని అతికొద్ది రాజభవనాలలో ఇదీ ఒకటి. సాగర్ మాల్ హైద్రాబాద్ రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల (మాల్) సంరక్షకుడిగా ఉన్నందున ఇది మాల్వాల అనే పేరుతో పిలువబడింది. ఆ సమయంలో మాథుర్ కాయస్థ కుటుంబం (మాల్వాల కుటుంబం) ఆదాయ శాఖను చూసుకునేవారు. 1940వ దశకంలో కుటుంబ వారసులలో ఒకరైన రాజ ధరమ్ కరణ్ సమయంలో, రాజభవన గొప్పతనాన్ని అద్భుతంగా చూపించారు.
నిర్మాణ శైలి
మార్చుక్షీరవర్ధిని చెక్క, కూరగాయల రంగులు, పొడవు 80 మీటర్ల రెండు గ్యాలరీలు రంగూన్ టేకుతో దివాన్ ఖానాలో భారీ తోరణాలను నిర్మించారు. గ్యాలరీలలో పురాతన భారతీయ అమూల్యమైన కళాఖండాలు ఉన్నాయి. ఇందులోని గ్రంథాలయంలో 10వ శతాబ్దం నుండి అరుదైన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌ల సేకరణ ఉన్నాయి. ఈ ప్యాలస్ లోపల ప్రాంగణాలతో కూడిన రెండు అంతస్థుల భవనం, అలంకార తోరణ ప్రవేశద్వారం, ఫౌంటెన్ ఉన్నాయి. రెండు వైపులా చెక్క మంటపాలు, రాజస్థానీ, మొఘల్ నిర్మాణ శైలిలో క్లిష్టమైన నమూనాలతో చెక్క బాల్కనీలు నిర్మించబడ్డాయి.[5] రాజభవనానికి రెండు రెక్కలు ఉన్నాయి. తూర్పుభాగపు రెక్క అధికారిక వ్యాపారం, వేడుకలు, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించగా పశ్చిమభాగపు రెక్క నివాస ప్రయోజనం కోసం ఉపయోగించబడింది. తూర్పు భాగం 2460 చదరపు మీటర్ల వరకు విస్తరించి ఉంది. విశాలమైన ప్రాంగణం మధ్యలో ఒక అందమైన తొట్టి ఉంది. రెండు అంతస్తులలోని వరుస గ్యాలరీలు, ఒక చెక్క పెవిలియన్ ఉన్నాయి. లక్క చెక్క, గోడలను అలంకరించడానికి కూరగాయల రంగులు ఉపయోగించబడ్డాయి.
కూల్చివేత
మార్చుభవనపు వారసత్వ హోదాను కాపాడటం కోసం కొంతమంది ప్రయత్నించారు. అనేక వివాదాల కారణంగా 2002 ఆగస్టులో ఈ భవనం కూల్చివేయబడింది.[6]
మూలాలు
మార్చు- ↑ Mar 15, Laxmi P. / TNN /; 2002; Ist, 02:04. "Malwala Palace left to the ravages of time | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Memories of a garden palace". The Hindu. 12 Nov 2003. Archived from the original on 13 April 2004. Retrieved 19 September 2021.
- ↑ "Archived copy". Archived from the original on 29 September 2011. Retrieved 19 September 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ ETV Bharat News, Hyderabad (21 January 2021). "అరుదైన కట్టడాలు.. కాపాడుకుంటేనే పది కాలాలు..." Archived from the original on 20 September 2021. Retrieved 19 September 2021.
- ↑ "Malwala Palace Hyderabad, History, Timings & Entry Fee". Gosahin - Explore Unexplored Destinations (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
- ↑ ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (18 April 2018). "హైదరాబాద్ ఘన చరిత్రకు 12 కిటికీల ఈ కోట కూడా భాగమే." andhrajyothy. Archived from the original on 20 September 2021. Retrieved 19 September 2021.