మా ఇంటి ప్రేమాయణం
అల్లురి రవి దర్శకత్వం వహించిన 1983 నాటి తెలుగు చిత్రం మా ఇంటి ప్రేమాయణం. యర్రంశెట్టి శాయి వ్రాసిన "ప్రేమకు ఫుల్‌స్టాప్ ఉందా?" నవల ఆధారంగా ఈ సినిమా తీసారు. ఈ చిత్రంలో చంద్ర మోహన్, ప్రసాద్ బాబు, రమాప్రభ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. చిరంజీవి చిత్రం చివరలో అతిథి పాత్రలో కనిపిస్తాడు.
మా ఇంటి ప్రేమాయణం (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అల్లూరి రవి |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , సులక్షణ |
సంగీతం | జె.వి.రాఘవులు |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్ కృష్ణారావు |
నిర్మాణ సంస్థ | చంద్రమణి ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథ
మార్చుఆనంద్ ( చంద్ర మోహన్ ) తన అత్త ( రమాప్రభ ) ఇంట్లో నివసిస్తున్నాడు. ఆమె వద్దనే పనిచేస్తాడు. పని వెతుక్కుంటూ ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన అఖిల (సులక్షణ) తో ప్రేమలో పడతాడు. అఖిల అదే కార్యాలయంలో పనిచేస్తుంది. ఆమె సోదరి కళ్ళకు చికిత్స చేయించడమే ఆమె కున్న ఏకైక లక్ష్యం. ఆమెకు అప్పు ఇచ్చిన బంధువొకతను తనను పెళ్ళి చేసుకొమ్మని ఆమెను వేధిస్తూంటాడు. రమాప్రభ స్నేహితురాలు తన కుమార్తె సోనీ (జ్యోతి) కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని రమాప్రభ మేనల్లుడు ( శరత్ బాబు ) తో పెళ్ళి సంబంధం మాట్లాడడానికి ఆమె వద్దకు వస్తుంది. చంద్రమోహన్ స్నేహితుడైన ప్రసాద్ బాబు ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ సోనీతో ప్రేమలో పడతాడు. అమెరికా నుండి వచ్చిన రణధీర్ గా వారి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు, కాని ప్రసాద్ బాబు అసలు రూపం వెల్లడవడంతో అతన్ని అరెస్టు చేస్తారు. నూతన్ ప్రసాద్ కూడా, రమాప్రభ పట్ల ఒక ప్రేమ పెంచుకుంటాడు. కాని అతను ఆమె ఇంటిలో వంటవాడిగా పనిచేస్తున్నందున, దానిని ఆమె ముందు వ్యక్తపరచటానికి ధైర్యం చేయడు. రణధీర్ ( శరత్ బాబు ) అమెరికా నుండి తిరిగి వచ్చి తనకు ఇప్పటికే పెళ్ళైందని చెబుతాడు. ఇదంతా గందరగోళానికి దారితీస్తుంది. క్లైమాక్స్‌లో చిరంజీవి ప్రవేశించి ఒక పాట ఒక పోరాటంతో ముగిస్తాడు.