మా నీళ్ల ట్యాంక్

మా నీళ్ల ట్యాంక్‌ 2022లో విడుదలైన వెబ్‌ సిరీస్‌. జీ5 ఒరిజినల్ సమర్పణలో ప్రవీణ్ కొల్ల నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌ కు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. సుశాంత్, ప్రియ ఆనంద్, సుదర్శన్, ప్రేమ్ సాగర్, నిరోషా , రామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ జులై 15న జీ5 ఓటీటీలో విడుదలైంది.[1]

మా నీళ్ల ట్యాంక్
దర్శకత్వంలక్ష్మీ సౌజన్య
రచన
మాటలుకిట్టు విస్సాప్రగడ
నిర్మాతకొల్లా ప్రవీణ్
తారాగణం
ఛాయాగ్రహణంఅరవింద్ విశ్వనాథ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంనరేష్ ఆర్కే సిద్ధార్థ్
నిర్మాణ
సంస్థ
జీ5 ఒరిజినల్
విడుదల తేదీ
2023 జూలై 15 (2023-07-15)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

  • సుశాంత్ - ఎస్‌ఐ వంశీ
  • ప్రియ ఆనంద్ - సురేఖ
  • సుదర్శన్ - గోపాల్‌
  • ప్రేమ్ సాగర్ - సర్పంచ్ కోదండం, గోపాల్ తండ్రి
  • నిరోషా - కోదండం భార్య చాముండి, గోపాల్ తల్లి
  • రామరాజు - నరసింహం
  • దివి - రమ్య, సురేఖ సోదరి
  • వాసు ఇంటూరి - మూర్తి
  • దర్భ అప్పాజీ అంబరీష - రమణ, సురేఖ తండ్రి
  • అన్నపూర్ణ -బూనెమ్మ
  • బిందు చంద్రమౌళి - భార్గవి, సురేఖ తల్లి
  • సందీప్ వారణాసి - సుబ్బు
  • లావణ్య రెడ్డి - రేవతి
  • సారా - సరిత
  • సుబ్బారావు - పురోహితుడి
  • మిత్ర - శివుడి
  • అప్పు - రంగడు
  • నరేష్ - శీను

కథ మార్చు

బుచ్చివోలు గ్రామ సర్పంచ్ కోదండం(ప్రేమ్ సాగర్), చాముండి (నిరోషా) దంపతుల కుమారుడు గోపాల్ ( సుదర్శన్) ఆ ఊళ్లోని నీళ్ల ట్యాంక్ పైకి ఎక్కుతాడు. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న సురేఖ (ప్రియా ఆనంద్) కనిపించడం లేదని తీసుకొచ్చేవరకూ దిగేది లేదని చెబుతాడు. తాను ప్రేమించిన అమ్మాయి మిస్సింగ్‌కు కారణం తన తండ్రి కోదండం అని ఊరు అందరి ముందు ట్యాంక్ పైనుంచి ఆరోపిస్తడు. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ పై అధికారులు సబ్ ఇన్‌స్పెక్టర్ వంశీ (సుశాంత్)ని నియమిస్తారు. సురేఖ ఊర్లో నుంచి ఎందుకు పారిపోయింది? వంశీ సురేఖను తీసుకొస్తాడా? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

మూలాలు మార్చు

  1. Eenadu (15 July 2022). "రివ్యూ: మా నీళ్ల ట్యాంక్‌". Archived from the original on 21 July 2022. Retrieved 21 July 2022.
  2. A. B. P. Desam (15 July 2022). "'మా నీళ్ల ట్యాంక్' రివ్యూ: సుశాంత్, ప్రియా ఆనంద్ నటించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?". Archived from the original on 8 August 2023. Retrieved 8 August 2023.