అనుమోలు సుశాంత్
అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. ఆయన ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు. అక్కినేని నాగార్జునకు మేనల్లుడు. ఆయన ప్రముఖ తెలుగు సినిమా నటులైన యార్లగడ్డ సుమంత్ కుమార్, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ యొక్క బంధువు. ఆయన తండ్రితరపున తాతయ్య అయిన ఎ.వి.సుబ్బారావు కూడా చిత్రపరిశ్రమకు చెందినవాడు. ఎ.వి.సుబ్బారావు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై సుమారు 25 చిత్రాలకు 1970 నుండి 1980 వరకు నిర్మాతగా ఉన్నారు.
సుశాంత్ | |
---|---|
జననం | అనుమోలు సుశాఅంత్ 1986 మార్చి 18[1] భారతదేశం |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | అనుమోలు సత్యభూషణరావు అక్కినేని నాగసుశీల |
బంధువులు | అక్కినేని నాగేశ్వరరావు (తల్లిపరపున తాత) అక్కినేని నాగార్జున (లల్లి తరపున మామయ్య) యార్లగడ్డ సుమంత్ కుమార్ అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ అక్కినేని అమల |
ప్రారంభ జీవితం
మార్చుసుశాంత్ హైదరాబాదుకు తీసుకొని రాబడినాడు. ఆయన అనుమోలు సత్య భూషణరావు, అక్కినేని నాగసుశీలలకు జన్మించాడు. హైదరాబాదులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూలులో విద్యాభ్యాసం చేసాడు. ఇంటర్మీడియట్ విద్యను గౌతమి జూనియర్ కళాశాలలో పూర్తిచేసాడు. ఆయన ఉర్బానా-చాంపైన్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగులో బి.ఎస్. పూర్తిచేసాడు. ఆయన యునైటెడ్ టెక్నాలజీస్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా నటునిగా ప్రవేశించక ముందు ఉద్యోగం చేసాడు. ఆయన తన కజిన్ అయిన నాగచైతన్యతో పాటుగా ముంబై లోని క్రియేటింగ్ కారెక్టర్స్ ట్రైనింగ్ స్కూలులో నటనపై శిక్షణ పొందాడు.[2]
నటించిన చిత్రాలు
మార్చుసుశాంత్ 2008 లో కాళిదాసు చిత్రం ద్వారా చిత్రరంగంలోకి అడుగు పెట్టాడు. ఈ చిత్రం శ్రీనివాస్ చింతలపూడి, నాగసుశీల చే శ్రీనాగ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించబడింది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టుడియోస్ సమర్పించింది. ఈ చిత్రంలో సుశాంత్ తమన్నాతో జంటగా నటించాడు. ఈ చిత్రానికి జి.రవిచరణ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు.
తరువాతి చిత్రం పేమకథతో కూడిన కరెంట్ 2009 లో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఈ చిత్రాన్ని సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తే స్నేహా ఉల్లాల్ కథానాయకిగా నటించారు. ఈ రెండు చిత్రాలలో సుశాంత్ నాట్య, ఫైటింగ్ నైపుణ్యాలలో అభినందించబడ్డాడు.
సుశాంత్ మూడవ సినిమా అడ్డా వినోదాత్మక చిత్రం. ఈ చిత్రాన్ని జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తే అనోప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఆయనకు సహ నటిగా లవ్‌లీ చిత్రంతో రంగప్రవేశం చేసిన నటి శాన్వీ శ్రీవాస్తవ నటించింది. ఈ చిత్రాన్ని మొట్టమొదటిసారిగా నాగార్జున 2013 మార్చి 18న విడుదల చేసాడు.[3] ఈ చిత్రం యొక్క టైటిల్ సాంగ్ ను 2013 ఏప్రిల్ 7 న హైదరాబాదులో ఐ.పి.ఎల్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో చిత్రీకరించారు.[4] ప్రచార వీడియోలను తరువాత ప్రారంభించారు. అత్యధిక అంచనాలతో అడ్డా విడుదలైనా అనుకున్న స్థాయిలో ప్రజాదరణ పొందలేకపోయింది. కాని సుశాంత్ నటనా నైపుణ్యానికి అభినందించబడ్డాడు.
సినిమాల జాబితా
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2008 | కాళిదాసు | కాళిదాసు | [5] | |
2009 | ప్రస్తుత | సుశాంత్ | [6] | |
2013 | అడ్డా | అభి | ||
2015 | దొంగాట | అతనే | "బ్రేక్ అప్ అంటూ" పాటలో | |
2016 | ఆటాడుకుందాం రా | కార్తీక్ | ||
2018 | చి ల సౌ | అర్జున్ | [7] | |
2020 | అలా వైకుంఠపురములో | రాజ్ మనోహర్ | ||
2021 | ఇచట వాహనములు నిలుపరాదు | అరుణ్ | [8] | |
2023 | రావణాసుర | రామ్ | [9] | |
భోలా శంకర్ | చిత్రీకరణ | [10] |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
2022 | మా నీళ్ల ట్యాంక్ | వంశి | [11] |
మూలాలు
మార్చు- ↑ "Allu Arjun wishes Sushanth on the latter's birthday with an adorable picture; see post". Times of India. Retrieved 18 March 2021.
- ↑ http://www.idlebrain.com/celeb/interview/sushanth.html
- ↑ http://www.idlebrain.com/news/functions1/birthday2013-sushanth.html
- ↑ http://www.idlebrain.com/news/functions1/titlesong-adda.html
- ↑ "Kalidasu. Kalidasu Movie Cast & Crew". Bharatmovies.com. 2008-04-11. Archived from the original on 16 August 2016. Retrieved 2012-09-30.
- ↑ "Star studded audio launch of Sushanth starrer 'Current'". The Times of India. Retrieved 12 September 2010.
- ↑ "Chi La Sow stars Sushanth, Ruhani Sharma open up about their upcoming new-age romance drama". Firstpost (in ఇంగ్లీష్). 2 August 2018. Retrieved 19 August 2019.
- ↑ "Sushanth A and Meenakshi Chaudhary to shoot soon for Ichata Vahanamulu Niluparadu - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-07-25.
- ↑ Andhrajyothy (12 January 2022). "'రావణాసుర': ఆకట్టుకుంటున్న సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ Andhra Jyothy (19 March 2023). "చిరంజీవి చిత్రంలో సుశాంత్". Archived from the original on 19 March 2023. Retrieved 19 March 2023.
- ↑ "Maa Neella Tank : పూజా హెగ్డే చేతులు మీదుగా సుశాంత్ 'మా నీళ్ల ట్యాంక్' ట్రైలర్ విడుదల.. జూలై 15 నుంచి స్ట్రీమింగ్." News18 Telugu. Retrieved 2022-07-13.