మా పల్లెలో గోపాలుడు

ఇది 1985లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. మా పల్లెలో గోపాలుడు చిత్రాన్ని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు ఈ విజయవంతమైన చిత్రంలో అర్జున్, పూర్ణిమ, గొల్లపూడి మారుతీరావు,రాజా, వై. విజయ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ అందించారు.ఈ చిత్రానికి దర్శకత్వం కోడి రామకృష్ణ వహించారు.

మా పల్లెలో గోపాలుడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం అర్జున్,
గొల్లపూడి,
పూర్ణిమ ,
రాజా,
వై. విజయ
సంగీతం మహదేవన్
నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

చిత్రకథ మార్చు

హిందీలో శశికపూర్ కథానాయకుడిగా నటించి, సంగీతపరంగా విజయవంతమైన చిత్రం 'జబ్ జబ్ ఫూల్ ఖిలే'.ఈ చిత్రంలో కథానాయకుడు కాశ్మీర్ లో దాల్ సరస్సులో పడవ నడుపుతూ సందర్శకుల్ని అలరిస్తూ ఉంటాడు. విహారయాత్రకు వచ్చిన హీరోయిన్, హీరో ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులౌతారు. వారి ప్రేమకు అడ్డంకులు, అవి తొలగి వారు ఒకటి కావడం ఆ చిత్రకథ. మాపల్లెలో గోపాలుడు చిత్రకథ దాదాపు అదే. ఇక్కడ కథానాయకుడు గోదావరి లంకలో పడవ నడుపుతుంటాడు. పూర్ణిమ స్నేహితు రాళ్లతో కలిసి విహారయాత్రకు వస్తుంది. వారి మధ్య ఇష్టం ఏర్పడుతుంది కాని ప్రేమవరకూ రాదు. కొంతకాలం తరువాత పూర్ణిమ భర్తతో తిరిగి వస్తుంది. భర్త అక్కడ వై.విజయ సోదరి పట్ల వ్యామోహంతో ఉండి వారిని పట్నానికి తీసుకెళ్తాడు. పని వాడుగా అర్జున్ కూడా పట్నం వస్తాడు. పూర్ణిమ కష్టాలు చూసి చలిస్తూ ఉంటాడు. చివరలో పూర్ణిమ భర్తకు బుద్ధి చెప్పి ఆమెను తనతో తెచ్చేసుకుంటాడు.చిత్రకథ ముగింపు అప్పటికి గొప్ప విప్లవాత్మకమైందిగా మన్నన పొందింది.

మిగతాభాషల్లో మార్చు

హిందీ చిత్రానికి కొంత పోలిక ఉన్న ఈ చిత్రం తిరిగి హిందీలో నిర్మించబడింది. కొద్దికాలం తరువాత జబ్ జబ్ ఫూల్ ఖిలే ఆధారం మరో చిత్రం 'రాజా హిందూస్తానీ' నిర్మించబడింది.

పాటలు మార్చు

  1. నేను ఈల వేస్తె గోలకొండ అదిరిపడతది, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  2. రాణీ రాణమ్మా ఆనాటి నవ్వులు ఏవమ్మా,, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల
  3. కొకొ కొకొ కొకొ కొకొ కోతి కొమ్మచ్చి తీపి అప్పచ్చి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. సరిగ సరిగ సరిగ చీర నలగనీకు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. ఘుం ఘుం ఘుం ఘుం గుమ్మెత్తింది గోదారిసీమ, గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం