వై. విజయ

సినీ నటి
(వై.విజయ నుండి దారిమార్పు చెందింది)

ఎనిగండ్ల విజయ అలియాస్ వై.విజయ తెలుగు సినిమా నటి, నృత్య కళాకారిణి. ఈమె మొదటి చిత్రం 1970లో విడుదలైన తల్లితండ్రులు. ఎన్టీఆర్ సరసన శ్రీకృష్ణ సత్య అనే సినిమాలో కథానాయికగా నటించింది. శోభన్‌బాబు సరసన కూడా కథానాయికగా నటించింది. ఇప్పటి వరకు 1000 కి పైగా చిత్రాలలో నటించింది.

వై. విజయ
జననం
ఎనిగండ్ల విజయ

(1957-11-07) 1957 నవంబరు 7 (వయసు 67)
వృత్తినటి, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు1970—ప్రస్తుతం
ఎత్తు5'5
జీవిత భాగస్వామిఅమలనాథన్

బాల్యం

మార్చు

ఈమె తండ్రి ఎనిగండ్ల జ్ఞానయ్య, తల్లి బాలమ్మ. ఈమె తండ్రి సహకార శాఖలో పనిచేస్తుండటంతో వీరి కుటుంబం ఒకచోట స్థిరంగా ఉండేదికాదు. ఆయన కర్నూలు లో పనిచేస్తున్నపుడు వై. విజయ అక్కడే జన్మించింది. తర్వాత ఆయనకు కడప కు బదిలీ కావడంతో విజయ బాల్యమంతా కడప లోనే గడిచింది. వీరు మొత్తం 10 మంది సంతానం. నలుగురు మగపిల్లలు, ఆరుగురు ఆడపిల్లలు. వీరిలో విజయ ఐదవది. ఈమె ఎనిమిదవ తరగతి వరకు కడప ప్రభుత్వ పాఠశాలలో చదివింది. తరువాత రెండు సంవత్సరాలు మద్రాసు లో వెంపటి చిన సత్యం గారి వద్ద నాట్యం నేర్చుకొంది. మిగిలిన పాఠశాలవిద్యని మద్రాసులోని కేసరి పాఠశాలలో పూర్తి చేసింది. మొట్టమొదటి నాట్య ప్రదర్శనను కడపలో ఇచ్చినా తరువాత ఎక్కువభాగం తమిళనాడులోనే ఇచ్చింది.

సినిమా జీవితం

మార్చు

వెంపటి చినసత్యం దగ్గర నాట్యం నేర్చుకుంటూ ఉండగానే సినిమాలో అవకాశం వచ్చింది. అప్పటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాలు. ఆ సినిమా రామవిజేత ఫిలిమ్స్ వారి తల్లిదండ్రులు. ఇందులో హీరో గా శోభన్ బాబు నటించాడు. మహానటి సావిత్రి అమ్మమ్మగా, జగ్గయ్య తాతయ్యగా నటించారు. విజయ దాదాపు 280 తమిళ సినిమాల్లో నటించింది. కొన్ని కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఈమెది ప్రేమ వివాహం. జనవరి 27వ తేదీ 1985 లో ఈవిడ తమ కుటుంబ మిత్రుడిని వివాహం చేసుకుంది. ఆయన పేరు అమలనాథన్. ఈయన కడపలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల ప్రిన్సిపల్‌, కరస్పాండెంట్‌గా వ్యవహరించాడు. పదవీ విరమణ తర్వాత వ్యాపార రంగంలో కొనసాగుతున్నాడు. వారికి ఒక కుమార్తె అనుష్య. ఇంజనీరింగ్ చదివింది. ఈవిడ తన కుటుంబంతో కలిసి చెన్నై నగరంలో స్థిరపడింది. కొన్ని టీవీ ధారావాహికలో కూడా నటిస్తోంది.

కడపలో నిర్వహించిన కడప ద్విశాతాబ్ది ఉత్సవాల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా మా కడప ముద్దుబిడ్డని సన్మానించారు. సినిమారంగంలోకి ప్రవేశించినప్పుడు విజయ అనే పేరుతో చాలామంది నటులు వుండడంతో తన ఇంటిపేరైన ‘వై’ని జోడించి వై. విజయగా అందరూ పిలిచేవారు.[1]

పేరు తెచ్చిన పాత్రలు

మార్చు

మా పల్లెలో గోపాలుడు చిత్రంలోని వేశ్య పాత్ర ఈమెకు పేరు తెచ్చింది. కథా నాయికగా చిత్రరంగంలోకి ప్రవేశించినా చివరికి సహాయ నటిగా స్థిర పడింది. ఎక్కువగా శృంగార రస పాత్రలను చేసింది. కొన్ని హాస్య ప్రధాన పాత్రలను కూడా పోషించింది.

చిత్ర సమాహారం

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వై._విజయ&oldid=4347985" నుండి వెలికితీశారు