మిథుబెన్ పేటీట్

భారతీయ జాతీయవాద ఉద్యమవాది

మిథుబెన్ పేటీట్ (ఏప్రిల్ 11, 1892 - జూన్ 16, 1973) భారతదేశ స్వాతంత్ర్య సమరయోధురాలు. గాంధీజీ సాగించిన ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది.

మిథుబెన్ పేటీట్
మిథుబెన్ పేటీట్
జననం(1892-04-11)1892 ఏప్రిల్ 11
మరణం1973 జూన్ 16(1973-06-16) (వయసు 81)
జాతీయతభారతీయురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధురాలు

మిథుబెన్ 1892, ఏప్రిల్ 11న బొంబాయిలోని ఒక ధనిక పార్సీ కుటుంబంలో జన్మించింది. ఈవిడ తండ్రి డిన్షా మానేక్జీ పేటీట్ బొంబాయిలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త.[1][2]

 
1930 ఏప్రిల్ 5న ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో గాంధీజీ వెనుక
 
1930లో మహాత్మా గాంధీ, సరోజిని నాయుడుతో

ఉద్యమంలో

మార్చు

రాష్ట్రీయ స్త్రీ సభ కార్యదర్శి, గాంధీజీ అనుచరురాలైన తన మేనత్త ప్రభావంతో మిథుబెన్ పేటీట్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది.[3] ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా కస్తూరిబా గాంధీ సబర్మతిలో, సరోజినీ నాయుడు దండి (గ్రామం)లో 1930, ఏప్రిల్ 6న మొదటిసారిగా ఉప్పు తీసినప్పుడు, మహాత్మా గాంధీ 1930, ఏప్రిల్ 9న భీమ్రాడ్ వద్ద ఉప్పు తీసినప్పుడు వారి వెనుకాల ఉండి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది.[4]

1928లో సర్దార్ పటేల్ యొక్క మార్గదర్శకత్వంలో బర్డిలీ సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటీష్ రాజ్కు వ్యతిరేకంగా ప్రచారం చేసింది.[5] మహాత్మా గాంధీతో కలిసి మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లోని ప్రజలకు మద్యం వల్ల వచ్చే సమస్యలను వివరించి అనేకమందిని చైతన్యవంతం చేసింది.[6]

సామాజిక సేవ

మార్చు

గుజరాత్ రాష్ట్రంలోని మరోలిలో కస్తూర్బా వానత్ శాల పేరుతో ఒక ఆశ్రమాన్ని స్థాపించి, ఆదివాసుల పిల్లలకు వివిధ చేతి వృత్తులపై శిక్షణ ఇప్పించింది.[7] అంతేకాకుండా మానసిక రోగులకు చికిత్స కోసం అదే పేరుతో ఒక ఆసుపత్రిని కూడా స్థాపించింది.[8]

పురస్కారాలు

మార్చు
  1. 1961 - పద్మశ్రీ పురస్కారం - సామాజికరంగం[9][10]

ఈవిడ 1973, జూన్ 16న మరణించింది.[2]

మూలాలు

మార్చు
  1. Marzban J. Giara (2000). Parsi statues. Marzban J. Giara.
  2. 2.0 2.1 Gawalkar, Rohini (2013-09-28). "पद्मश्री 'दीनभगिनी'". Loksatta (in మరాఠీ). Archived from the original on 28 July 2017. Retrieved 20 August 2018.
  3. Suruchi Thapar-Björkert (2006). Women in the Indian national movement : unseen faces and unheard voices, 1930-42. SAGE Publications India Pvt Ltd. ISBN 9789351502869.
  4. "The Great Dandi March – eighty years after". thehindu.com. Retrieved 20 August 2018.
  5. "Encyclopaedia of Indian Women Through the Ages: Period of freedom struggle".[full citation needed]
  6. "anti-liquor movement". mkgandhi.org. Retrieved 20 August 2018.
  7. "Trustees". Kasturbasevashram.org. Archived from the original on 3 జనవరి 2018. Retrieved 20 August 2018.
  8. "Kasturba Sevashram". kasturbasevashram.org. Archived from the original on 12 జూన్ 2018. Retrieved 20 August 2018.
  9. "Padma Shri in 1965 for social work". padmaawards.gov.in. Archived from the original on 28 జూలై 2017. Retrieved 20 ఆగస్టు 2018.
  10. "Mithuben Petit Padma Shri" (PDF). pib.nic.in/archive/docs. Archived from the original (PDF) on 28 జూలై 2017. Retrieved 20 ఆగస్టు 2018.