మిన్నీ మాథన్

భారతీయ శాస్త్రవేత్త

మిన్నీ మరియమ్ మథాన్ (ఆంగ్లం: Minnie M. Mathan) భారతీయ మహిళా వైద్యులు, శాస్త్రవేత్త.[1] ఈమెకి పాథాలజీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, జీర్ణశయాంతర పాథాలజీలో స్పెషలైజేషన్ ఉంది.

మిన్నీ మారియమ్ మథాన్
మిన్నీ మథాన్
జననం1937
జాతీయతభారతీయులు
రంగములుపాథాలజీ, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ
ముఖ్యమైన పురస్కారాలుNSA Senior Scientist,2005-32/08/2013

విద్యాబ్యాసం

మార్చు

బోర్డింగ్ స్కూలులో చదువుకున్న మథాన్ యావద్భారతదేశంలోనే ఒకానొక ఉన్నత వైద్యకేంద్రమైన క్రిష్టియన్ వైద్య కళాశాల, వెల్లూరులో పోటీపరీక్షలలో నెగ్గి చేరారు. విద్యార్థిగా ఉన్నప్పుడే శస్త్రచికిత్స (Surgery) లో కృషిచేయాలని ఆమెకి ఆకాంక్ష ఉండేది. పట్టభద్రురాలైన తర్వాత తోటి విద్యార్థిని వివాహం చేసుకొని, శస్త్రచికిత్సలో ఉన్నత చదువుకోసం దరఖాస్తు చేసుకోగా, ఆ విభాగం స్త్రీలకు అంతగా బాగుండదని నిరుత్సాపరచడం వలన పేథాలజీ (Pathology) విభాగంలో చేరింది. చేరిన అనంతరం ఆమెకు ప్రయోగశాలలో ఉన్న ఎన్నో సవాళ్లు తెలిసాయి వాటిని పరిశోధించి సమాధానాలు కనుగొనాలని కుతూహలం పెరిగి ఆ విభాగంలో కొనసాగించడానికి నిర్ణయించుకున్నారు. ఈమె నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఫెల్లోగా కూడా ఉన్నారు.

ఆమె వెల్లూరులోని క్రిస్టియన్ వైద్య కళాశాలలో పనిచేస్తునపుడు పాథాలజీ విభాగంలో ప్రత్యేకత సంతరించుకొని ఎం.డి, పి.హె.డి డిగ్రీలను మద్రాసు విశ్వవిద్యాలయం నుండి పొందారు. ఈమె 1970-71 లలో బోస్టన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ జెర్రీ ట్రైయర్ ద్వారా ఆల్ట్రాస్ట్రక్చురల్ పాథాలజీలో శిక్షణ పొందారు. ఆమె ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఉపయోగించుటలో నైపుణ్యంపొంది గ్యాస్ట్రో ఇంటర్నల్ ట్రాక్ట్ లో సంబంధాలను అధ్యయనం చేశారు[2].

1967 ప్రాంతంలో అల్ట్రాసూక్ష్మ పేథాలజీ (Ultrastructural Pathology) భారతదేశంలో ప్రారంభదశలో ఉన్నరోజులవి. పేథాలజీలో శిక్షణ పూర్తయిన ఆమెను కొత్తగా స్థాపించిన ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని పరికరాన్ని అభివృద్ధి చేయడానికి నియమించింది. వివిధరకాల వ్యాధులలో సుమారు 1000 రెట్ల మాగ్నిఫికేషన్ లో మన శరీరంలో జరిగే మార్పులు తెలిసిన ఆమెకు 2,00,000 రెట్ల మాగ్నిఫికేషన్ లో వాటిని పరీక్షించి వ్యాధులలో శరీర నిర్మాణము-పనులకు సంబంధించిన సంబంధాన్ని ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని భావించారు.

కెరీర్ , పరిశోధన

మార్చు

1970 లో ఆమెకు బోస్టన్ విశ్వవిద్యాలయం లోని డా. జెర్రీ ట్రెయర్ క్రింద పనిచేయడానికి ఫెలోషిప్ లభించింది. అతడు ప్రేగుల సూక్ష్మనిర్మాణంలో ప్రాముఖ్యత కలిగిన పరిశోధకుడు. అతని శిక్షణలో 18 నెలల కాలంలో క్రమశిక్షణ, కష్టపడడం, నిర్ధిష్టమైన ఆలోచనతో ముందుకుసాగడం నేర్చుకున్నారు. 1971 లో అమెరికన్ గాస్ట్రోఎంటిరాలజీ సంఘం వారి సమావేశంలో తన పరిశోధన ఫలితాల్ని పంచుకున్నారు. ఆ సమావేశంలో పాల్గొన్న ఏకైక మహిళ ఆవిడే. మథాన్ జరిపిన "ప్రేగులలోని ఉపకళాకణజాలము , సంధాయక కణాజలముల మధ్య సంబంధము" గురించిన పరిశోధన విషయాలు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి.

భారతదేశానికి తిరిగివచ్చి వెల్లూరులోని వ్యాధినిర్ధాయక పెథాలజీలో చేరారు. ఆ కాలంలోనే గాస్ట్రోఇంటస్టైనల్ సైన్సెస్ కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ప్రారంభించారు. ఆ శాఖను అనుసంధానిస్తూ పేథాలజీలో పనిచేస్తూ తన పరిశోధనలను కొనసాగించారు. తాను పరిశోధన చేసి ట్రాపికల్ స్ప్రూ (Tropical Sprue) గురించిన సూక్ష్మమైన మార్పులను గాస్ట్రోఎంటిరాలజీ (Gastroenterology) పత్రికలో ప్రచురించారు. ఇది ఆకాలంలో భారతదేశం నుండి ప్రచురించబడిన అత్యుత్తమ పరిశోధనా వ్యాసంగా గుర్తింపు పొందింది.

1973 లో రోటా వైరస్ పిల్లలలో అతిసారవ్యాధికి ఒక ముఖ్యమైన కారణంగా డా. ఇయాన్ హోమ్స్, డా. టామ్‌ ఫ్లెవెట్ కనుగొన్నారు. వారి సహాయంతో ఈ రోటా వైరస్ మన దేశంలోని చిన్నపిల్లలలో కనిపించే అతిసారవ్యాధిలో కూడా ప్రధాన పాత్ర పోషించిందని అతిసూక్ష్మ పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈమె సాధించిన విజయాల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి వైరల్ అతిసారవ్యాధి (Viral diarrhoeas) లకు చెందిన స్టీయరింగ్ గ్రూప్ లో పాల్గొనమని ఆహ్వానించింది.

1993-97 లలో వెల్లూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి లోని గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైన్సెస్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆమె వృద్దాప్యం వరకు (1997) అక్కడే పనిచేశారు. ఆమె ఆ సంస్థలో మొదటి రీసెర్చ్ ఛైర్ గా అవార్డు పొందారు.[2].

అవార్డులు - గౌరవాలు

మార్చు

మిన్నీ మథాన్‌ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అవార్డు సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ప్రముఖ భారతీయ మహిళ శాస్త్రవేత్తల కోసం ఇవ్వబడే బసంతి దేవి ఆమీర్‌చంద్ అవార్డు,, రాన్బాక్సీ క్లినికల్ రీసెర్చ్ కోసం సైన్స్ ఫౌండేషన్ అవార్డు పొందారు.[2][3].

  • 1997 : హోచ్ట్ ఓం ప్రకాష్ అవార్డు (Hoechst Om Prakash Award)
  • 1988 : బూస్ట్స్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అవార్డు.
  • 1995 : ICMR ద్వారా క్షణిక ఓరేషన్ అవార్డు.
  • 1996 : అమృత మోడీ ఊనిచెం ప్రైజ్.
  • 1996 : పార్కే డేవిస్ ఓరాషన్ అవార్డు (ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ద్వారా)
  • 1997 : బసంతి దేవీ అమీర్ చంద్ అవార్డు
  • 1997 : రాన్‌బాక్సీ సైన్స్ ఫౌండేషన్ అవార్డు
  • 1993 : నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫెలో
  • 1993 : ఇండియన్ కాలేజి ఆఫ్ పాథాలజీలో వ్యవస్థాపక ఫెలో
  • 1996 : యు.కె.లో రాయల్ కాలేజి ఆఫ్ పాథాలజీలో ఫెలోషిప్

మూలాలు

మార్చు
  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా వ్రాయవచ్చు.
  1. An unusual route to science - Minnie M Mathan.
  2. 2.0 2.1 2.2 "ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ". Archived from the original on 2014-03-16. Retrieved 2013-08-31.
  3. Alpaca named after Minne Mathan[permanent dead link]

వెలుపలి లింకులు

మార్చు