మిలన్ (కళా దర్శకుడు)
మిలన్ ఫెర్నాండెజ్ (1969 - 2023 అక్టోబరు 15) భారతీయ చలనచిత్ర కళా దర్శకుడు. ఆయన బిల్లా (2007), వేలాయుదం (2011), వేదాళం (2015) వంటి చిత్రాలకు తమిళ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందాడు.[1][2]
మిలన్ ఫెర్నాండెజ్ | |
---|---|
జననం | 1969 |
మరణం | (aged 54) |
వృత్తి | ఆర్ట్ డైరెక్టర్ |
క్రియాశీల సంవత్సరాలు | 2005–2023 |
తమిళ చిత్రాలతో పాటు మలయాళంలోనూ పని చేసే ఆయన తెలుగులో ఆక్సిజన్ (2017)చిత్రానికి కళా దర్శకుడుగా ఉన్నాడు.
కెరీర్
మార్చుమిలన్ 1999లో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌కి అసిస్టెంట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. సిటిజన్ (2001), తమిజన్ (2002), రెడ్ (2002), విలన్ (2002), అన్నియన్ (2005) వంటి చిత్రాలలో పనిచేశాడు. అన్నియన్ చిత్రం తెలుగులో అపరిచితుడుగా విడుదలైంది.[3][4][5]
30కి పైగా సినిమాలు, శక్తి మసాలా, ఆచీ మసాలా, ఆర్ ఎం కె వి, శరవణ స్టోర్స్, పోతీస్ వంటి 120 వాణిజ్య ప్రకటనలకు ఆయన కళా దర్శకుడుగా వ్యవహరించాడు.[6][7][8]
మరణం
మార్చు54 సంవత్సరాల వయస్సులో ఆయన 2023 అక్టోబరు 15న గుండెపోటుతో మరణించాడు.[9] అజిత్ కథానాయకుడుగా విడా ముయూర్చి సినిమా షూటింగ్ అజర్‌బైజాన్లో జరుగుతోంది. ఈ షూటింగ్ లో ఉన్న మిలన్ ఫెర్నాండెజ్ అస్వస్వత్థకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.
మూలాలు
మార్చు- ↑ "Art director Milan says Tamil cinema will be proud of Ajith Kumar's Vivegam". Indiatvnews.com. Retrieved 29 November 2017.
- ↑ "Art director Milan speaks about Vivegam". Entertainment.chennaipatrika.com. Retrieved 29 November 2017.
- ↑ "Tamil cinema will be proud of 'Vivegam': Art director Milan". The Times of India. Retrieved 29 November 2017.
- ↑ "Tamil cinema will be proud of Vivegam: Art director Milan". Indianexpress.com. 23 August 2017. Retrieved 29 November 2017.
- ↑ "Tamil cinema will be proud of 'Vivegam': Art director Milan - News Karnataka". M.dailyHunt.in. Retrieved 29 November 2017.
- ↑ Maria Mila (24 December 2015). "Art Director Milan Interview". YouTube. Retrieved 29 November 2017.
- ↑ "Art director Milan talks about Vivegam". Behindwoods.com. 22 August 2017. Retrieved 29 November 2017.
- ↑ "Vivegam Making : Art Director Milan Interview - Official Trailer and Teaser". YouTube. 16 August 2017. Retrieved 29 November 2017.
- ↑ "స్టార్ హీరో షూటింగ్‌లో ప్రమాదం". Archived from the original on 2023-10-16. Retrieved 2023-10-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)