మీనాక్షి అనూప్
అనునయ అనూప్ (జననం 2005 అక్టోబరు 12), ఆమె రంగస్థల పేరు మీనాక్షి అనూప్‌తో సుపరిచితురాలు, ఆమె ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న భారతీయ నటి.[2][3] 2015 హాస్య చిత్రం అమర్ అక్బర్ ఆంథోనీలో ఫాతిమా (పాతు/పాతుమ్మ), 2016 క్రైమ్ థ్రిల్లర్ ఒప్పంలో నందినికుట్టి (నందిని) పాత్రకు ఆమె బాగా పేరు తెచ్చుకుంది.[4]
మీనాక్షి అనూప్ | |
---|---|
జననం | అనునయ అనూప్ 2005 అక్టోబరు 12[1] |
జాతీయత | భారతీయురాలు |
ఇతర పేర్లు | బేబీ మీనాక్షి |
విద్యాసంస్థ | ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్, కిడంగూర్ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2014 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఅనూప్ ఆర్., రమ్య దంపతులకు ఆమె జన్మించింది. ఆమె కిడంగూర్‌లోని ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి హైస్కూల్ విద్యను పూర్తి చేసింది. లక్కత్తూరులోని ఎంజిఎం ఎన్ఎస్ఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్లో హయ్యర్ సెకండరీ చదివింది.[5]
కెరీర్
మార్చుమీనాక్షి అనూప్ జన్మనామం అనునయ అనూప్, కాగా ఆమెను బేబీ మీనాక్షి, మీనుట్టి అని కూడా పిలుస్తారు. ఆమె టెలివిజన్ యాంకర్, మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తరువాత మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టింది. అక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన బాలనటిలలో ఆమె ఒకరు. అఖిల్ ఎస్. కిరణ్ దర్శకత్వం వహించిన మధుర నోంబరం అనే లఘు చిత్రంతో మీనాక్షి తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.[6] ఆమె అరుణ్ కుమార్ అరవింద్ రూపొందించిన వన్ బై టూ (2014)లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది, అయినప్పటికీ చిత్రంలో ఆమె సన్నివేశాలు చేర్చబడలేదు. ఆమె తర్వాత 1000: ఒరు నోట్ పరాంజ కథ, జమ్నా ప్యారీ, ఆనా మయిల్ ఒట్టకంలో నటించింది, ఇవన్నీ 2015లో విడుదలయ్యాయి. అమర్ అక్బర్ ఆంథోనీ (2015)లో ఫాతిమా (పాతు/పాతుమ్మ) పాత్రలో ఆమె తన పురోగతిని సాధించింది. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ ఆమె నటన గురించి 'చైల్డ్ ఆర్టిస్ట్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన ప్రతిస్పందనలను అందుకుంది, నిస్సందేహంగా ఆమె అమాయకమైన, సహజమైన నటనతో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.' అని పేర్కొన్నది. ఆమె నటనకు గానూ ఉత్తమ బాలనటిగా ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్ అందుకుంది.[7]
ఆమె ప్రియదర్శన్ చిత్రం ఒప్పమ్ (2016)లో నందిని కుట్టిగా నటించింది. జకారియా పోతేన్ జీవిచిరిప్పుండు (2017), తమిళ చిత్రం కాన్బతు పోయి వంటి చిత్రాలలోనూ నటించింది. మలయాళం కాకుండా ఇతర భాషలలో ఆమె తొలి చిత్రం, కన్నడలో కవచ (2019), హిందీలో ది బాడీ (2019), తమిళంలో కన్బతు పోయి వంటి చిత్రాలు ఉన్నాయి.[8]
ఫిల్మోగ్రఫీ
మార్చుసినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2014 | వన్ బై టూ | మలయాళం | |
2015 | 1000 – ఓరు నోట్ పరంజ కథ | మలయాళం | |
2015 | ఆన మయిల్ ఒట్టకం | అంతగా గుర్తింపు లేని పాత్ర | మలయాళం |
2015 | అమర్ అక్బర్ ఆంటోనీ | ఫాతిమా | మలయాళం |
2015 | జమ్నా ప్యారీ | స్కూల్ అమ్మాయి | మలయాళం |
2016 | ఒప్పం | నందిని | మలయాళం |
2016 | ఓరు ముత్తస్సి గాధ | వీధి గాయని | అతిధి పాత్ర,
మలయాళం |
2016 | మరుపడి | అతిధి పాత్ర,
మలయాళం | |
2016 | పాలేట్టంటే వీడు | మలయాళం | |
2016 | కొలుమిట్టాయి | రియా | మలయాళం |
2017 | అలమర | మలయాళం | |
2017 | సదృశ్యవాక్యం 24:29 | మలయాళం | |
2017 | జకరియా పోతెన్ జీవిచిరిప్పుండు | మలయాళం | |
2018 | పూజాయమ్మ | మజా | మలయాళం |
2018 | మోహన్ లాల్ | మీనాక్షి | మలయాళం |
2018 | క్వీన్ | వధువు సోదరి | మలయాళం |
2019 | విశుద్ధ పుస్తకం | మలయాళం | |
2019 | కవచ | నందిని | కన్నడ |
2019 | ది బాడీ | ఇషా | హిందీ |
2021 | మీజాన్ | పొన్నస్ | మలయాళం |
2021 | ది క్రియేటర్ | - | మలయాళం |
2021 | అమీరా | అమీరా | మలయాళం |
2021 | కక్కప్పొన్ను | మలయాళం | |
2023 | క్లాస్ బై ఎ సోల్జర్ | మలయాళం |
టెలివిజన్
మార్చుసంవత్సరం | కార్యక్రమం / ధారావాహిక | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2018 – 2020 | టాప్ సింగర్ | హోస్ట్ | ఎస్తేర్ అనిల్ స్థానంలోకి వచ్చింది |
2020 –2022 | టాప్ సింగర్ సీజన్ 2 | హోస్ట్ | శ్రేయ జయదీప్ స్థానంలోకి వచ్చింది |
2020 –2021 | టాప్ సింగర్ మ్యూజిక్ నైట్ | హోస్ట్ | |
2021 | ఎంగలుడే గంధర్వుడు | హోస్ట్ | |
2022–2023 | టాప్ సింగర్ సీజన్ 3 | హోస్ట్ | |
2023- | టాప్ సింగర్ 4 | హోస్ట్ | |
2023 | సమ్త్వన సంగీతం | హోస్ట్ |
మూలాలు
మార్చు- ↑ "Meenakshi gifted iPhone 14 pro on her 17th birthday". ONmanorama. 19 October 2022.
- ↑ "Meenakshi gifted iPhone 14 pro on her 17th birthday". ONmanorama. 19 October 2022.
- ↑ "'Amar Akbar Anthony' fame 'Pathu' rules school youth festival". Manorama Online. 8 December 2015.
- ↑ "Watch baby singer Shreya's 'Amar Akbar Anthony' song 'Yenno Njanente' featuring baby Meenakshi". International Business Times. 23 October 2015.
- ↑ "SMART KUTTEES". Mangalam (in Malayalam). 28 January 2016.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "അമര് അക്ബര് അന്തോണീസിന്റെ പുന്നാരപാത്തു". Manorama Online (in Malayalam). 26 October 2015.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "18th Asianet Film Awards: Vikram, Trisha, Prithviraj, Mohanlal, Nivin Pauly bag awards". International Business Times. 8 February 2016.
- ↑ "Meenakshi in Priyan's Oppam". Deccan Chronicle. 17 February 2016.