మీనా సింగ్
మీనా సింగ్ (జననం 1 జనవరి 1962, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. మీనా సింగ్2008లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 14వ లోక్‌సభలో బిక్రమ్‌గంజ్ (లోక్‌సభ నియోజకవర్గం) నుండి గెలుపొందారు 15వ లోక్‌సభలో అర్రా (లోక్‌సభ నియోజకవర్గం) నుండి జనతాదళ్ పార్టీ నుండి విజయం సాధించారు.[1][2]
మీనా సింగ్ | |
---|---|
పార్లమెంట్ సభ్యురాలు | |
In office 2008–2009 | |
అంతకు ముందు వారు | అజిత్ కుమార్ సింగ్ |
లోక్సభ సభ్యురాలు | |
In office 2009–2014 | |
అంతకు ముందు వారు | కాంతి సింగ్ |
తరువాత వారు | ఆర్.కే. సింగ్ |
నియోజకవర్గం | ఆరా లోక్ సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1962 జనవరి 1 వారణాసి, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
రాజకీయ పార్టీ | జనతాదళ్ |
జీవిత భాగస్వామి | అజిత్ సింగ్ |
సంతానం | 1 |
నివాసం | , పాట్నా, బీహార్ భారతదేశం |
కళాశాల | బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం |
బాల్యం
మార్చుమీనా సింగ్ నైనా దేవి రామేశ్వర్ సింగ్ దంపతులకు జన్మించింది. మీనా సింగ్ 1982లో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్‌లో పట్టా పొందారు. భారత రాజకీయాల్లోకి రాకముందు, మీనా సింగ్ తన భర్త కు సేవ చేసేవారు .
వ్యక్తిగత జీవితం
మార్చుమీనా సింగ్ రాజకీయ నాయకుడు అయిన అజిత్ కుమార్ సింగ్‌ను వివాహం చేసుకుంది. మీనా సింగ్ దంపతులకు ఒక కుమారుడు, విశాల్ సింగ్ ఉన్నాడు, అతను అమిటీ బిజినెస్ స్కూల్ నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌ను కలిగి ఉన్నాడు. అజిత్ సింగ్ 2007లో మరణించాడు.[3]
రాజకీయ జీవితం
మార్చుమీనా సింగ్ తన భర్త మరణం తర్వాత బిక్రమ్‌గంజ్ నుండి జనవరి 2008 ఉప ఎన్నికలో మొదటిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు, అయితే మీనా సింగ్ 6 నెలల తర్వాత ఎంపీ పదవీకి రాజీనామా చేశారు.[4] మీనా సింగ్ 2009లో జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి అర్రా (లోక్‌సభ నియోజకవర్గం)కు ఎన్నికయ్యారు. మీనా సింగ్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయింది [5]
మూలాలు
మార్చు- ↑ Mishra, Ashok K (3 January 2008). "Bikramganj bolsters Nitish, shocks Lalu". The Economic Times. Retrieved 14 March 2019.
- ↑ "General (15th Lok Sabha) Election Results India". Elections.in.
- ↑ Chatterjee, Aloke (2 August 2007). "JD (U) MP dies in road accident". Hindustan Times. Retrieved 14 March 2019.
- ↑ Swaroop, Vijay (6 November 2008). "Rahul Raj's killing triggers large scale resignations". Hindustan Times. Retrieved 14 March 2019.
- ↑ "Arrah Lok Sabha Elections and Results 2014". Elections.in.