యద్దనపూడి సులోచనారాణి నవలలో ఎక్కువ ముద్రణలు పొందిన నవల, సినిమాగా కూడా నిర్మించబడి విజయం సాధించిన నవల మీనా. ఇది రెండు భాగాలుగా రాయబడింది. మీనా నవల యువ మాసపత్రికలో ధారావాహికంగ వచ్చింది. ఈ నవల మొదలు పెట్టినప్పుడు పేరులేకుండానే ప్రశ్నార్ధకంతో ప్రచురించారు. ఈ నవలకు పేరు పెట్టతానికి పాథకులకు పోటీ పెట్టినప్పుడు "మీనా" అన్న పేరు బహుమతి పొంది, ఒక ప్రముఖ నవలకు పేరుగా మారింది. ఈ నవలను విజయనిర్మల స్వీయ దర్శకత్వంలో తనే మీనాగా నటించి సినిమాగా తీసింది.

మీనా
మీనా రెండవభాగ నవలా ముఖచిత్రం
కృతికర్త: యద్దనపూడి సులోచనారాణి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీది, విజయవాడ
విడుదల:
పేజీలు: మొదటి భాగము300+రెండవభాగము300
"https://te.wikipedia.org/w/index.php?title=మీనా_(నవల)&oldid=2883220" నుండి వెలికితీశారు