మీరా చోప్రా దక్షిణ భారత చలనచిత్ర నటి, ప్రచారకర్త.[1] 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీరా చోప్రా హిందీ, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది.[2]

మీరా చోప్రా
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లునిల
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2005-ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం మార్చు

1983, జూలై 8న సుదేశ్ చోప్రా, నీలం చోప్రా దంపతులకు జన్మించింది. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, మన్నారా చోప్రా లు మీరా చోప్రా బంధువులు.

సినీరంగ ప్రస్థానం మార్చు

నటుడు సూర్య ద్వారా సినీరంగం లోకి ప్రవేశించింది. 2005లో ఎస్.జె. సూర్య నటించిన అబ్నే ఆరుయిరే అనే తమిళ చిత్రం మీరా చోప్రా తొలిచిత్రం. 2006లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలో దాదాపు 30 సినిమాలు నటించింది.

నటించిన చిత్రాల జాబితా మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2005 అంబే ఆరూయిరే మధు తమిళం
2006 బంగారం సంధ్యారెడ్డి తెలుగు
2008 జాంబవన్ ఎళిల్ తమిళం
2008 లీ చెల్లమ్మల్ తమిళం
2008 మరుధమలై మీరా తమిళం
2008 కాలై తమిళం గుంత లక్కిడి పాటలో
2008 వాన నందిని చౌదరి తెలుగు
2009 అర్జున్ అర్జున్ గర్ల్ ఫ్రెండ్ కన్నడ
2009 జగన్మోహిని ఆళగు నచియార్ తమిళం
2011 మారో ప్రియా తెలుగు
2013 గ్రీకు వీరుడు మాయ తెలుగు
2014 గ్యాంగ్ ఆఫ్ ఘోస్ట్ టినా చోప్రా హిందీ
2015 ఇసై మధు తమిళం అతిథి పాత్ర
2015 కిలాడీ అంజలి తమిళం
2015 మొగలిపువ్వు తెలుగు
హిందీ
2016 1920 లండన్ శివంగీ హిందీ
2018 నాస్తిక్ హిందీ

మూలాలు మార్చు

  1. టాలీవుడ్ టైమ్స్. "మీరా చోప్రా". www.tollywoodtimes.com. Retrieved 28 May 2017.[permanent dead link]
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్. "మీరా చోప్ర , Meera Chopra". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 28 May 2017.