గ్రీకు వీరుడు (సినిమా)

గ్రీకు వీరుడు 2013 మే 3 న కొండపల్లి దశరథ్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో నాగార్జున, నయనతార ప్రధాన పాత్రలు పోషించారు.

గ్రీకు వీరుడు
దర్శకత్వంకొండపల్లి దశరథ్
రచనగోపీమోహన్
నిర్మాతడి. శివప్రసాద్ రెడ్డి
తారాగణంనాగార్జున
నయనతార
మీరా చోప్రా
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
2013 మార్చి (2013-03)
దేశంభారత్
భాషతెలుగు

కథ మార్చు

చందు (నాగార్జున) అవివాహితుడు. అమెరికాలో నివసిస్తుంటాడు. అతని కుటుంబం భారతదేశంలో నివసిస్తుంటుంది. కుటుంబ సంబంధాలకు అసలు విలువివ్వని మనస్తత్వం అతనిది. ఒక కేసులో చిక్కుకున్న అతనికి పాతిక కోట్లు అవసరమౌతాయి. అవి తెచ్చుకోవడానికి భారత్ వస్తాడు. ఇక్కడ అనుకోకుండా ఒక సమస్యలో చిక్కుకుంటాడు. ఆ సమస్య నుండి బయటపడటానికి సంధ్య (నయనతార) ని తన భార్యగా అందరికీ పరిచయం చేసుకుంటాడు. బాంధవ్యాలకి విలువివ్వని చందుకి ఎలాంటి పరిస్థుతులు ఎదురయ్యాయి? చివరికి అతనిలో మార్పు వచ్చిందా? అన్నది మిగతా కథ.

నటులు మార్చు

పాటల జాబితా మార్చు

ఐ హేట్ లవ్ స్టోరీస్ , రచన: కృష్ణచైతన్య , గానం.రంజిత్, నవీన్ మాధవ్

నీ విన్నది నిజమేనా , రచన: బాలాజీ , గానం.రంజిత్

ఓనాడు వాషింగ్టన్ లో, రచన: సాహితీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

ఈ పరీక్షలో, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.హరిచరన్ , వందన

ఎవరూ లేరని, రచన: వనమాలి, గానం.మల్లిఖార్జున్

ఓసీనా బంగారం, రచన: అనంత శ్రీరామ్.హేమచంద్ర, ఎం ఎం మానసి

మరో జన్మ, రచన: బాలాజీ , గానం.రాహూల్ నంబియార్.

మూలాలు మార్చు

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.