మీర్జా గాలిబ్ (సినిమా)

సోహ్రాబ్ మోడీ దర్శకత్వంలో 1954లో విడుదలైన హిందీ, ఉర్దూ సినిమా

మీర్జా గాలిబ్ 1954, డిసెంబరు 10న విడుదలైన హిందీ, ఉర్దూ సినిమా. కవి మీర్జా గాలిబ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు సోహ్రాబ్ మోడీ దర్శకత్వం వహించారు. భరత్ భూషణ్ గాలిబ్ గా, సురయ్యా అతని ప్రియురాలిగా నటించిన ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రశంసలు అందుకుంది. 1954లో జరిగిన రెండవ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లోటస్ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి భవన్‌లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆ కార్యక్రమంలో సురయ్యా మీర్జా గాలిబ్ గజల్స్ పాడగా, ఆమె నటనను అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రత్యేకంగా ప్రశంసించాడు.[1][2]

మీర్జా గాలిబ్
దర్శకత్వంసోహ్రాబ్ మోడీ
రచనరాజీందర్ సింగ్ బేడి
స్క్రీన్ ప్లేజెకె నంద
కథసాదత్ హసన్ మాంటో
నిర్మాతసోహ్రాబ్ మోడీ
తారాగణంభరత్ భూషణ్
సురయ్యా
దుర్గా ఖోటే
ఉల్హాస్
నిగార్ సుల్తానా
ఛాయాగ్రహణంవి. అవధూత్
కూర్పుడి. శిర్ధంకర్
పి. బాలచంద్రన్
సంగీతంగులాం మహ్మద్
నిర్మాణ
సంస్థ
మినర్వా మోవిటోన్
పంపిణీదార్లుమినర్వా మోవిటోన్
విడుదల తేదీ
10 డిసెంబరు 1954
సినిమా నిడివి
145 నిముషాలు
దేశంభారతదేశం
భాషలుహిందీ
ఉర్దూ

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు గులాం మహ్మద్ సంగీతం అందించాడు. సురయ్యా, ముహమ్మద్ రఫీ, తలాత్ మహమూద్ పాటలను, గజల్స్‌ను రాశారు.

  • "దిల్ - ఇ - నాదన్ తుజే" సురయ్యా, తలాత్ మహమూద్
  • "ఫిర్ ముజే డీదా-ఇ-తార్" తలాత్ మహమూద్
  • "ఆహ్ కో చాహియే ఏక్ ఉమర్" సురయ్యా
  • "హై బాస్ కే హర్ ఏక్ ఉంకే" ముహమ్మద్ రఫీ
  • "నుక్త చీన్ హై" సురయ్యా
  • "వహ్షాత్ హాయ్ సాహి" తలాత్ మహమూద్
  • "జహాన్ కోయి నా హో" సురయ్యా
  • "యే నా హమారీ కిస్మత్" సురయ్యా

అవార్డులు మార్చు

బాక్సాఫీస్ మార్చు

1954లో విడుదలైన సినిమాలలో మీర్జా గాలిబ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ళు చేసిన నాల్గవ సినిమాగా నిలిచింది.[4]

మూలాలు మార్చు

  1. Pran Kapila (20 July 2011). "Suraiya, the singing star (Mirza Ghalib film)". The Hindu (newspaper). Retrieved 11 June 2021.
  2. Ajab Daastaan (Tribute to actress Suraiya on Outlook magazine) Published 31 January 2004, Retrieved 11 June 2021
  3. "2nd National Film Awards" (PDF). Directorate of Film Festivals.
  4. Mirza Ghalib (1954 film) among the Top Ten Earners at the Box Office in 1954 BOX OFFICE INDIA website, Retrieved 11 June 2021

బయటి లింకులు మార్చు