ముకుంద్ వరదరాజన్
మేజర్ ముకుంద్ వరదరాజన్ అశోక చక్ర పురస్కారం | |
---|---|
జననం | 12 ఏప్రిల్ 1983 తాంబరం, తమిళనాడు, భారతదేశం[1] |
మరణం | 2014 ఏప్రిల్ 25 షోపియాన్ జిల్లా, జమ్మూ కాశ్మీర్, భారతదేశం | (వయసు 31)
ఖనన స్థలం | బెసెంట్ నగర్, చెన్నై[2] |
రాజభక్తి | భారతదేశం |
సేవలు/శాఖ | భారతసైన్యం |
సేవా కాలం | 2006 - 2014 |
ర్యాంకు | మేజర్ |
యూనిట్ | 22 రాజ్‌పుత్ రెజిమెంట్ 44 రాష్ట్రీయ రైఫిల్స్ (రాజ్‌పుత్) బెటాలియన్ (డిప్యూటేషన్) |
పోరాటాలు / యుద్ధాలు |
|
పురస్కారాలు | అశోక చక్ర |
జీవిత భాగస్వామి (లు) | ఇందు రెబెక్కా వర్గీస్[3] |
మేజర్ ముకుంద్ వరదరాజన్ (1983 ఏప్రిల్ 12-2014 ఏప్రిల్ 25) భారతీయ సైనిక అధికారి, అశోక చక్ర పురస్కార గ్రహీత. భారత సైన్య రాజ్పుత్ రెజిమెంట్ కమిషన్డ్ ఆఫీసర్ అయిన ముకుంద్, జమ్మూ కాశ్మీర్ 44వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్కు డిప్యుటేషన్లో ఉన్నప్పుడు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన చర్యలకు గాను మరణానంతరం అతనికి అశోక్ చక్రను ప్రదానం చేశారు. తమిళంలో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అమరన్ సినిమాను తీశారు.
వ్యక్తిగత జీవితం
మార్చుమేజర్ ముకుంద్ వరదరాజన్ 1983 ఏప్రిల్ 12న తమిళనాడు లోని తాంబరంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తల్లితండ్రులు ఆర్. వరదరాజన్, గీత. ఆయనకు శ్వేత, నిత్య అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ముకుంద్ తన స్నేహితురాలు, మలయాళీ సిరియన్ క్రిస్టియన్ అయిన ఇందు రెబెక్కా వర్గీస్ ను 28 ఆగస్టు 2009న వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 17 మార్చి 2011న అర్షియా ముకుంద్ అనే కుమార్తె జన్మించింది.[4][5]
అతను ఎనాథూర్ లోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ విద్యాలయ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, తాంబరంలోని మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుండి జర్నలిజంలో డిప్లొమా పొందాడు. అతని తాత, ఇద్దరు పినతండ్రులు కూడా సైన్యంలో పనిచేశారు.
సైనిక వృత్తి
మార్చుముకుంద్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పూర్వ విద్యార్థి, గ్రాడ్యుయేషన్ తరువాత, అతను 18 మార్చి 2006 న రాజ్పుత్ రెజిమెంట్ (22 రాజ్పుత్) లో లెఫ్టినెంట్ గా షార్ట్ సర్వీస్ కమిషన్ అందుకున్నాడు.[6] 2006 మార్చి 18న, అతనికి లెఫ్టినెంట్ హోదాతో ఒక నియమిత కమిషన్ మంజూరు చేయబడింది, 18 అక్టోబర్ 2008 లో కెప్టెన్ పదోన్నతి పొందాడు.[7][8] ఆయన మధ్యప్రదేశ్ మహోలోని పదాతిదళ పాఠశాలలో పనిచేశాడు, లెబనాన్ ఐక్యరాజ్యసమితి మిషన్ భాగంగా ఉన్నాడు.[9] 2012 అక్టోబరు 18న మేజర్ గా పదోన్నతి పొంది, ఆ సంవత్సరం డిసెంబరులో జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా రాష్ట్రీయ రైఫిల్స్ 44వ బెటాలియన్ కు నియమించబడ్డాడు.[10][11]
కాజీపథ్రి ఆపరేషన్
మార్చు2014 ఏప్రిల్ 25న, ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దక్షిణ కాశ్మీర్లోని ఒక గ్రామంలో ముకుంద్ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్కు నాయకత్వం వహించాడు. ఆపరేషన్ సమయంలో, అతని బృందం భారీ కాల్పులకు గురైంది. ఈ ప్రక్రియలో అవుట్ హౌస్ నుండి బయటకు రాగానే మొదట్లో గాయపడనట్టు కనిపించాడు. అతని చుట్టుపక్కల ఉన్న అధికారులు, అతను బాగానే ఉన్నాడని భావించారు. కానీ కొద్దిసేపటి తర్వాత, మూడు తుపాకీ గాయాలతో ముకుంద్ కుప్పకూలిపోయాడు. [12][13][14] ఆపరేషన్ సమయంలో ఆయన చేసిన సాహసోపేతమైన చర్యలకు గాను, విధి నిర్వహణకు మించిన శౌర్యం ప్రదర్శించినందుకు 2014లో భారతదేశపు శాంతికాలపు అత్యున్నత శౌర్య పురస్కారం అయిన అశోక్ చక్ర ఆయన మరణానంతరం ప్రదానం చేశారు.[15]
అశోక్ చక్ర ప్రకటన సమయంలో భారత ప్రభుత్వం చేసిన ఉల్లేఖనం.
ఆపరేషన్ సమయంలో, బలిదానం పొందడానికి ముందు, మేజర్ ముకుంద్ ఆదర్శప్రాయమైన నాయకత్వ నైపుణ్యాలు, ధైర్యం, ప్రణాళిక, వేగవంతమైన చర్యలను ప్రదర్శించాడు, ఇది ముగ్గురు అగ్రశ్రేణి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను నిర్మూలించడంలో ముగిసింది.
విగ్రహం
మార్చుతమిళనాడు రాష్ట్రం నుండి అశోక చక్రం పొందిన నాలుగో వ్యక్తి ముకుంద్. 2015 జూన్ 1న, మేజర్ ముకుంద్ వరదరాజన్ దేశభక్తి, త్యాగానికి గౌరవసూచకంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఉంది.[16] మేజర్ ముకుంద్ విగ్రహాన్ని అతని భార్య ఇందు వర్గీస్ ఆవిష్కరించారు.[17] ముకుంద్ కుటుంబం చెన్నై ఆఫీసర్స్ ట్రానింగ్ అకాడమీలో అతని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించింది.[18]
ర్యాంకు
మార్చుచిహ్నం | ర్యాంక్ | సర్వీస్ | ర్యాంక్ తేదీలు |
---|---|---|---|
లెఫ్టినెంట్ | భారత సైన్యం | 18 మార్చి 2006 | |
కెప్టెన్ | భారత సైన్యం | 18 అక్టోబర్ 2008 | |
మేజర్ | భారత సైన్యం | 18 అక్టోబర్ 2012 |
సినిమా
మార్చు2024లో అమరన్ అనే తమిళ బయోపిక్ ప్రకటించబడింది. వరదరాజన్ వీరోచిత త్యాగం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 44 రాష్ట్రీయ రైఫిల్స్ చేసిన పోరాటం ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించగా, అతని భార్య ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించింది.[19][20][21][22][23]
మూలాలు
మార్చు- ↑ S. Sujatha (15 August 2014). "మేజర్ ముకుంద్ వరదరాజన్". Deccan Chronicle. Retrieved 16 August 2014.
- ↑ "Major Mukund spouse:Indhu Rebecca Varadharajan's final journey". The Hindu. 28 April 2014. Retrieved 16 August 2014.
- ↑ "'Love my son… I am proud of him… I miss him'". 28 April 2014.
- ↑ "'India Should See The Man Mukund Was, Not My Sorrow': Martyr's Wife to NDTV". NDTV. Retrieved 31 January 2015.
- ↑ "Major Mukund Varadarajan cremated with full military honours in Chennai". The Times of India. 29 April 2014. Retrieved 16 August 2014.
- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 21 April 2007. p. 625.
- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 11 June 2011. p. 1101.
- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 3 September 2011. p. 1622.
- ↑ "Tambaram mourns a braveheart". The Hindu. 27 April 2014. Retrieved 16 August 2014.
- ↑ "Part I-Section 4: Ministry of Defence (Army Branch)" (PDF). The Gazette of India. 13 July 2013. p. 1058.
- ↑ "Major Worked at BPO Before Realising Childhood Dream". The New Indian Express. 27 April 2014. Archived from the original on 28 April 2014. Retrieved 16 August 2014.
- ↑ "For Gallantry". 14 August 2014. Retrieved 16 August 2014.
- ↑ "Major Mukund Varadarajan Awarded Ashok Chakra, the Highest Gallantry Award". NDTV. 14 August 2014. Retrieved 16 August 2014.
- ↑ "Independence Day Gallantry Awards and Other Decorations". PIB. 14 August 2014. Retrieved 16 August 2014.
- ↑ "For Gallantry". 14 August 2014. Retrieved 16 August 2014.
- ↑ Desk, OneIndia Defence (2015-06-01). "Bust in memory of Major Mukund; Capt Kalia a forgotten hero". Oneindia. Retrieved 2020-02-17.
- ↑ "जम्मू के शोपियन जिले में आतंकियों से मोर्चा लेते हुए शहीद हुए आरआरसी के मेजर मुकुंद वरदराजन की प्रतिमा का अनावरण शनिवार को राजपूत रेजीमेंट में उनकी पत्नी इंदू वरदराजन ने किया।". Amar Ujala.
- ↑ "Major Mukund Varadarajan's bust unveiled at Officers Training Academy". Mathrubhumi.
- ↑ Bureau, The Hindu (2024-02-16). "'Amaran' teaser: Sivakarthikeyan as Major Mukund Varadarajan prepares his men for battle". The Hindu. ISSN 0971-751X. Retrieved 2024-02-17.
- ↑ "Amaran: Sivakarthikeyan's title teaser & all about Major Mukund Varadarajan". www.moviecrow.com. Retrieved 2024-02-17.
- ↑ "Kamal Haasan unveils Sivakarthikeyan's 'Amaran' teaser ahead of his birthday". India Today. Retrieved 2024-02-17.
- ↑ "Sivakarthikeyan Plays Real Life Hero Major Mukund Varadarajan In His Next Film Amaran". TimesNow. 2024-02-16. Retrieved 2024-02-17.
- ↑ "SK21 titled Amaran: Sivakarthikeyan says 'honored to have portrayed Major Mukund Varadarajan' as he unveils first teaser". PINKVILLA. 2024-02-16. Archived from the original on 2024-02-20. Retrieved 2024-02-17.