అమరన్
అమరన్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కాశ్మీర్ నేపథ్యంలో శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత సంఘటనలతో రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ : ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ’ పుస్తకం ఆధారంగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించాడు. శివ కార్తీకేయన్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 15న, ట్రైలర్‌ను న విడుదల చేసి, అక్టోబర్ 31న సినిమాను విడుదల చేశారు.[1]
తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.[2]
నటీనటులు
మార్చు- శివ కార్తీకేయన్ - మేజర్ ముకుంద్ వరదరాజన్ "మ్యాడీ"[3]
- సాయిపల్లవి - ఇందు రెబెక్కా వర్గీస్[4][5]
- భువన్ అరోరా - సిపాయి విక్రమ్ సింగ్
- రాహుల్ బోస్ - కల్నల్ అమిత్ సింగ్ దాబాస్, ముకుంద్ కమాండింగ్ ఆఫీసర్
- లల్లూ - రవిశంకర్
- శ్రీకుమార్ - మైఖేల్
- శ్యామ్ మోహన్ - ఇందు సోదరుడిగా
- అజయ్ నాగ రామన్
- మీర్ సల్మాన్
- గౌరవ్ వెంకటేష్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్
- నిర్మాత: ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి
- సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
- సినిమాటోగ్రఫీ: సి.హెచ్. సాయి
- ఎడిటర్:ఆర్. కలైవానన్
- ఫైట్స్: అన్బరివ్ మాస్టర్స్, స్టీఫన్ రిక్టర్
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "హే రంగులే[6]" | రామజోగయ్య శాస్త్రి | అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా | 4:01 |
మూలాలు
మార్చు- ↑ Chitrajyothy (18 September 2024). "శివకార్తికేయన్ 'అమరన్' రెడీ". Retrieved 12 October 2024.
- ↑ Chitrajyothy (24 October 2024). "వరదరాజన్ జీవిత నేపథ్యం".
- ↑ EENADU (17 September 2024). "మన ఆర్మీ కష్టం ముందు నా శ్రమ చాలా తక్కువ: శివ కార్తికేయన్". Retrieved 12 October 2024.
- ↑ ETV Bharat News (28 September 2024). "ఆ పాత్ర కోసం ఆయన భార్యను కలిశాను : 'అమరన్' సాయి పల్లవి". Retrieved 12 October 2024.
- ↑ "అమర జవాన్ భార్యగా సాయి పల్లవి - ఆకట్టుకుంటున్న 'అమరన్' బ్యూటీఫుల్ ఇంట్రో!". 27 September 2024. Retrieved 12 October 2024.
- ↑ NT News (7 October 2024). "అమరన్ నుంచి శివకార్తికేయన్-సాయిపల్లవి హే రంగులే లిరికల్ సాంగ్". Retrieved 12 October 2024.