ముకుంద రామారావు ప్రముఖ కవి, అనువాదకుడు.

యల్లపు ముకుంద రామారావు
Mukunda ramarao.jpg
జననంయల్లపు ముకుంద రామారావు
1946, నవంబరు 9
పశ్చిమ బెంగాల్ ఖరగ్‌పూర్
ఉద్యోగంరైల్వేశాఖ
ప్రసిద్ధికవి, అనువాదకుడు
మతంహిందూ
భార్య / భర్తసుభాషిణి
పిల్లలులావణ్య, చైతన్య, కళ్యాణచక్రవర్తి
తండ్రియెల్లయ్య
తల్లిఎరుకలమ్మ

జీవిత విశేషాలుసవరించు

ముకుంద రామారావు 1946 నవంబర్ 9 వ తేదీ ఎరుకలమ్మ,యెల్లయ్య దంపతులకు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్‌పూర్లో జన్మించాడు. ఇతని చదువు అంతా ఖరగ్‌పూర్ లోనే నడిచింది. ఎమ్మెస్సీ (మ్యాథ్స్),పి.జి.డి.సి.ఎస్. చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేశాడు. కాస్త ఆలస్యంగా మొదలైన ఇతని రచనా ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభమైనా కవిగా స్థిరపడ్డాడు. అనువాదకుడిగా రాణించాడు.

రచనలుసవరించు

స్వంత రచనలుసవరించు

 1. వలసబోయిన మందహాసం
 2. మరో మజిలీకి ముందు
 3. ఎవరున్నా లేకున్నా
 4. నాకు తెలియని నేనెవరో
 5. నిశ్శబ్దం నీడల్లో

అనువాదాలుసవరించు

 1. అదే ఆకాశం
 2. శతాబ్దాల సూఫీ కవిత్వం
 3. నోబెల్ కవిత్వం

రచనల నుండి ఉదాహరణలుసవరించు

ఆకుపచ్చ ఆలోచనలు
చెవుల్లో గుసగుసలాడుతున్నట్టు
పాదాల కింద గడ్డి
* * *
చీకట్లో
వాటి అందాల్ని పరిమళాన్ని
పట్టించుకోలేదని
పూలు ఏడ్చాయేమో రాత్రంతా
వేకువసరికల్లా తడిసిముద్దయి
తలలు వేలాడదీసాయి
* * *
అందమైన పూలు
గాలితో కూడి ఎన్ని హొయలో
చూడకపోతే చిన్నబుచ్చుకుంటాయి
చూస్తే భయం
ఎవరి కంఠం తెగుతుందోనని

పురస్కారాలు, సత్కారాలుసవరించు

 1. 2015 బ్రౌన్ పురస్కారం

ప్రముఖుల ప్రశంసలుసవరించు

 • ఆధునిక కవిత్వానికి మీరు చేసిన దోహదం ఏమిటని వాల్లస్ స్టెవన్స్ ని ఎవరో అడిగితే - కాగితంలో ఎక్కువ తెలుపుదనం, తక్కువ అక్షరాలూ నేర్పానని. ముకుందరామరావూ, ఇస్మాయిల్ గారూ అటువంటి పనే చేస్తున్నారు. కొంచెం మౌనంతోనూ, కొంచేం ధ్యానంతోనూ ... - వేగుంట మోహన ప్రసాద్
 • ఉత్తమ వస్తువు, ఉత్తమ రూపం కలసినపుడు అయిన ఉత్తమ కవిత ఉత్తమ భావాన్ని ప్రత్యక్ష పరుస్తుంది. వీరి కవితలు అటు వంటివే. కనుకనే వాటిని ఉత్తమ కవితలంటాను. - సంజీవదేవ్
 • ఈయన కవిత్వంలో స్పష్టాస్పష్టత ఉంటుంది. పారదర్శకత్వం ఉండదు. పదౌచిత్యం ఉంటుంది. పదాడంబరం ఉండదు. భావ గాంభీర్యం ఉంటుంది. భాషా క్లిష్టత ఉండదు. పురోగమన శీలత ఉంటుంది. సిధాంత వలయం ఉండదు. అనుభవం వైయక్తికమే. దృకపధం విశ్వజనీనం. ఇది ఈయన తొలి కవితా సంకలనమేకాని తొలినాటి కవితల సంకలనం కాదు. - చేకూరి రామారావు
 • ఇలాంటి కవిత్వం చెప్పటానికి మనిషి తాత్వికుడై వుండాలి. చుట్టూరావున్న మనుషుల్ని ప్రేమించగలిగిన వాడై వుండాలి. ముకుందరామారావు గారు ఆ కోవకు చెందిన వారు. - దీవి సుబ్బారావు
 • తెలుగు సాహిత్య వాతావరణానికి ముకుంద రామారావు గారు ఒక గొప్ప ఉపకారం చేశారు. నోబెల్‌ బహుమానపు మహద్ద్వారం తెరిచి, ఆ బహుమానం పొందిన కవిత్వంలో ఏం జరిగిందో కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చూపించారు. 1901 నుంచీ 2011 వరకూ నోబెల్‌ బహుమానం అందుకున్న కవుల జీవితకథలు సంగ్రహంగా చెప్పి, వాళ్ళ కవిత్వంలో మచ్చుతునకలు కొన్ని అనువాదం చేసి అందించారు. -వేల్చేరు నారాయణరావు

అదేగాలి కవిత్వ సంపుటి ఆవిష్కరణ చిత్రమాలికసవరించు

బయటి లింకులుసవరించు

 • కదిలించే కలాలు - కొండ్ర్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నేటినిజం దినపత్రిక 2014 ఆగస్టు 14 సంచిక