ముక్కామల అప్పారావు

డా. ముక్కామల అప్పారావు (Mukkamala Appa Rao) అమెరికాలో వైద్య ప్రముఖులు, ఎన్.ఆర్.ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు.[1]

ముక్కామల అప్పారావు చిత్రపటం.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ముక్కామల అప్పారావు.. జూలై 14, 1945న కృష్ణా జిల్లాలోని బుద్ధవరం గ్రామంలో ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు.. గన్నవరంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్.ఎల్. సీ వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే కష్టపడి పనిచేసే తత్వం ఉండటంతో అదే చదువులో కూడా చూపించారు. ఎస్.ఎల్. సీ.లోనే తరగతినే ప్రథమ స్థానంలో నిలిచారు. చదువులో ఎంతో చురుకుగా ఉండే ముక్కామల అప్పారావు విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో పీయూసీలో చేరారు..పీయూసీలో 50 వేల మంది విద్యార్థుల్లో రాష్ట్రంలోనే ఆనాడు 7 వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత వైద్య విద్యను అభ్యసించేందుకు గుంటూరు మెడికల్ కాలేజీలో చేరి ఎంబీబీస్ పూర్తి చేశారు. నలుగురిని కలుపుకుపోవడం... నలుగురికి నచ్చే కార్యక్రమాలు చేయడంలో ఎప్పడూ ముక్కామల అప్పారావు ముందుండే వారు అదే ఆయనను విద్యార్థి దశలోనే నాయకత్వ పదవులు చేపట్టేలా చేసింది.

అమెరికా పయనం

మార్చు

మెడికల్ కోర్స్ పూర్తైన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్ లో ముక్కామల అప్పారావు హౌస్ సర్జన్ గా విధులు నిర్వర్తించారు. తాను ఎంచుకున్న వృత్తిలో నిబద్ధతతో పనిచేస్తూనే.. తనను తాను మరింత సమర్థుడైన వైద్యుడిగా తీర్చిదిద్దుకునేందుకు.. ఇంటర్న్ షిప్ కోసం అమెరికా వైపు అడుగులు వేశారు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని పిట్స్ బర్గ్ సెయింట్ మార్గరిటా హాస్పిటల్ లో ఇంటర్న్ షిప్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇంటర్న్ షిప్ పూర్తయిన తర్వాత అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ కార్మెల్ మెర్సీ హాస్పిటల్ లో రెసిడెంట్ హౌస్ సర్జన్ గా సేవలందించడం ప్రారంభించారు. అదే మిచిగాన్ రాష్ట్రంలోని ఫ్లింట్ హర్లే మెడికల్ సెంటర్ లో రేడియాలజీ విభాగంలో పనిచేశారు. రేడియాలజీతో అత్యున్నత నైపుణ్యం సాధించాలనే తపనతో అడుగులు వేసిన ముక్కామల అమెరికన్ బోర్డ్ ఆఫ్ రేడియాలజీ నుంచి రేడియాలజీ, న్యూ క్లియర్ రేడియాలజీ, పిడియాట్రిక్ రేడియాలజీ సర్టిఫికెట్లు సాధించారు.

అమెరికాకు వచ్చిన ఆనతికాలంలోనే ముక్కామల తన సత్తా చాటారు. అమెరికా మెడియల్ అసోషియన్ లో 1972లోనే సభ్యుడిగా చేరారు. అమెరికా కాలేజ్ ఆఫ్ రేడియాలజీ, మిచిగాన్ రేడియాలజికల్ సోసైటీతో అనేక వైద్య సంఘాలు, సంస్థల్లో సభ్యుడిగా చేరి నలుగురిని కలుపుకుపోవడంతో తాను ఎప్పుడూ ముందుటారనేది నిరూపించారు. ఆ తర్వాత కాలంలో ఎన్నో వైద్య సంస్థలకు అధ్యక్షుడిగా కూడా ముక్కామల సేవలందించారు.

నాయకత్వ లక్షణాలతో పాటు రేడియాలజీలో నైపుణ్యం క్రమంగా ముక్కామల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. రేడియాలజీలో ఆయన చేసిన పరిశోధనలు, ఆయన అనుభవ పూర్వకంగా నేర్చుకున్న పాఠాలను మెడికల్ విద్యార్థులకు అందించేందుకు ముక్కామల ఎంతగానో కృషి చేశారు. అమెరికాతో పాటు భారత్ లోని అనేక వైద్య సదస్సుల్లో తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. రేడియాలజీపై ఎన్నో వ్యాసాలు రాసి పుస్తకాలు ప్రచురించారు. ప్రస్తుతం అమెరికాలోని హర్లే మెడికల్ సెంటర్లోని రేడియాలజీ విభాగం అధిపతిగా ముక్కామల సేవలందిస్తున్నారు.

సమాజం కోసం

మార్చు

ఈ సమాజం నాకు ఏమీ ఇచ్చింది అని కాదు.. ఈ సమాజం కోసం నేనేమి చేశానని ఆలోచించే గల మనస్తత్వం ముక్కామల అప్పారావు తాను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎక్కిన మెట్లను ఎప్పుడూ మరిచిపోలేదు. అందుకే అమెరికాతో పాటు భారత్ లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేక సేవా సంస్థల్లో సభ్యుడిగా చేరి ఆయా సేవాకార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేందుకు తోడ్పడుతున్నారు. అమెరికాలో తెలుగువారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు.. వారికి అండగా నిలబడేందుకు ఎప్పుడూ ముక్కామల తపిస్తూనే ఉంటారు. తెలుగు సంఘాలకు తన ఆర్థిక, హార్దిక సాయమందిస్తూ వాటి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు అటు అమెరికాలో ఇటు భారత్ లో నిర్వహించడంలో తన వంతు సాయం చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికాలో తెలుగు సంఘం తానాలో కీలక పాత్ర పోషించిన తానా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అమెరికాలో తెలుగువారు ఏ కార్యక్రమం చేపట్టిన సంపూర్ణ మద్దతు చేపట్టిన ముక్కామల అప్పారావు ప్రస్తుతం సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కు ఆయన కొండంత అండగా నిలబడుతున్నారు.

ఎన్.ఆర్.ఐ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు

మార్చు

జన్మభూమి రుణం కొంత తీర్చుకోవాలనే తపనతో ముక్కామల గుంటూరు జిల్లాలో ఎన్.ఆర్.ఐ మెడికల్ కాలేజీ, ఎన్.ఆర్.ఐ హాస్పిటల్స్ ను ముక్కామల అప్పారావు నెలకొల్పారు. పేద రోగులకు సైతం అత్యాధునిక వైద్యం అందించాలనే ఆశయంతో పెట్టిన ఎన్.ఆర్.ఐ హాస్పటల్స్ నేడు పేదరోగులకు తక్కువ ఖర్చుతోనే ఎంతో ఖరీదైన వైద్యం అందిస్తోంది. పేదవాడికే చెంతకే వైద్యం అందుబాటులోకి రావాలని ముక్కామల భావిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఎన్.ఆర్.ఐ హాస్పిటల్స్ తరచూ మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేసి పేదవాడికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది.

మహాదాతృత్వం

మార్చు

ఓ సత్కార్యం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని భావిస్తే..అలాంటి కార్యక్రమాలకు భారీ విరాళాలు ఇచ్చేందుకు ఎప్పుడూ ముక్కామల అప్పారావు ముందుంటారు..ఇండో అమెరికన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పౌండేషన్ కోసం 12 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. అంతేగాకుండా సీవో ఆర్డీ యూఎస్ ఎ సంస్థ సభ్యుడిగా 5 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు సేకరించి వైద్య ఆరోగ్య, దార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేలా ప్రోత్సహించారు.

అనాధ ఆడపిల్లలకు అండగా

మార్చు

సాటి మనిషికి ఎలా సాయపడాలని ఆలోచించే ముక్కామల అప్పారావు ఆయన సతీమణి సుమతీ ముక్కామల తమ గురువు చిన్మయనంద బోధనలు వారిలో స్ఫూర్తిని నింపాయి. సేవా పథం వైపు నడిపించాయి.. గుంటూరు జిల్లా కాజాలో ముక్కామల దంపతులు నెలకొల్పిన చిన్మయ విజయ అనాథ ఆడపిల్లల పాలిట వరంలా మారింది. అమ్మ నాన్న లేని అనాథలైన ఆడపిల్లలు, ఎయిడ్స్ బారిన పడి తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు, సునామీ దెబ్బకు అనాథలుగా మిగిలిన వారిని చిన్మయ విజయ తన పొత్తిళ్లలోకి తీసుకుంటుంది..నేడు గుంటూరు జిల్లా కాజాలోని చిన్మయ విజయ దాదాపు 200 మంది అనాథ ఆడపిల్లలు అమ్మ, నాన్న లేని లోటును మరిచిపోయేలా చేసింది. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా ఇఫ్పుడు చిన్మయ విజయలో విద్యాబోధన జరుగుతోంది. రేపటి పౌరులను సమున్నతంగా తీర్చిదిద్దుతున్నారు.

పురస్కారాలు

మార్చు

తాను సంపాదించిన విజ్జానాన్ని, సంపదను సమాజ సేవకోసం వినియోగిస్తున్న ముక్కామల అనేక తన ప్రస్థానంలో ఎన్నో అవార్డులు పొందారు. అటు అమెరికాతో పాటు ఇటు భారత్ లోని ప్రభుత్వాలు, సంస్థలు ముక్కామల అప్పారావుకు అనేక అవార్డులు..రివార్డులు ఇచ్చాయి. అనేక కీలక పదవులు కట్టబెట్టి గౌరవించాయి.

  • 1985లో తానా డిస్టింగ్విష్డ్ కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్
  • భారత ప్రభుత్వంచే మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్ 1991
  • తానా-డిస్టింగ్విష్డ్ కమ్యునిటీ సర్వీస్ అవార్డ్ -1985
  • భారతప్రభుత్వం చే మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్-1991
  • గుంటూరు మెడికల్ కాలేజీ అలుమ్నీ అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డ్-1992
  • మిచిగాన్ స్టేట్ మెడికల్ సొసైటీ-డిస్టింగ్విష్డ్ లీడర్ షిప్ అవార్డ్-1993
  • రోటరీ పౌండేషన్ ఇంటర్నేషనల్ అవార్డ్-1994
  • జెనిసీ కౌంటీ మెడికల్ సొసైటీ ప్రెసిడెన్షియల్ సిటేషన్-లైఫ్ టైమ్ కమ్యునిటీ సర్వీస్-2008
  • క్లెమెంట్ ఆల్ఫ్రెడ్ హ్యుమానిటేరియన్ అవార్డ్-2007
  • అమెరికన్ మెడికల్ అసోసియేషన్ చే డాక్టర్ నాథన్ డేవిస్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ మెడిసిన్-2009
  • హర్లే మెడికల్ సెంటర్ - పినాకిల్ అవార్డ్-2009
  • మిచిగాన్ స్టేట్ డిస్టింగ్విష్డ్ సిటిజన్ అవార్డ్ -2010
  • పాల్ హారిస్ అవార్డ్ అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ లైఫ్ టైమ్ సర్వీస్ అవార్డ్-2005

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1) ప్రెసిడెంట్ చిన్మయ మిషన్ వెస్ట్ (ధార్మిక సంస్థ) -1989-2012
  • 2) ట్రస్టీ అండ్ సెక్రటరీ భారతీయ టెంపుల్ ఆఫ్ ఫ్లింట్-1982-1983
  • 3) ట్రస్టీ చిన్మయ సేవా సమితి-1992-1996
  • 4) ఫౌండర్ మెంబర్ అండ్ ట్రెజరర్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)
  • 5) కోఆర్డినేటర్-2 వచిన్మయ ఇంటర్నేషనల్ క్యాంప్, 8 చిన్మయ ఫ్యామిలీ స్పిరిచ్యువల్ క్యాంప్స్
  • 6) సెక్రటరీ-చిన్మయ సేవా సమితి-1993
  • 7) ప్రెసిడెంట్ -చిన్మయ సేవా సమితి-1994
  • 8) ట్రెజెరర్-సివోఆర్ డీ 2008-2014
  • 9) ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్-2008-ప్రజెంట్
  • 10) ట్రెజెరర్- ఇండో అమెరికన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పౌండేషన్ 2004-2012
  • 11) పౌండింగ్ మెంబర్ ఎన్నారై మెడికల్ కాలేజ్-2001
  • 12) ప్రెసిండెంట్ ఎన్నారై మెడికల్ కాలేజ్-2007-2015
  • 13 పౌండర్ చిన్మయ విజయ్ అనాథాశ్రమం
  • 14) పౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఎన్నారై ఇంజినీరింగ్ కాలేజీ
  • 15) డైరెక్టర్ సిబాల్ డెంటల్ కాలేజీ
  • 16) డైరెక్టర్ -షెరటాన్ హౌటల్స్

మూలాలు

మార్చు
  1. "ఎన్.ఆర్.ఐ.అకాడమీ ఆఫ్ సైన్సెస్ డైరెక్టర్లు". Archived from the original on 2015-07-19. Retrieved 2015-05-27.