ప్రధాన మెనూను తెరువు

మునిమడుగుల రాజారావు ప్రసిద్ధ తెలుగు రచయిత.[1]

జీవిత విశేషాలుసవరించు

ఆయన జన్నారం మండలం తంగెళ్లపల్లి గ్రామంలో డిసెంబరు 11 1967లో భూమరాజు, రాజుబాయి దంపతులకు జన్మించారు. ఆదిలాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌లలో విద్యనభ్యసించి బి.ఎస్.సి., బి.యి.డి పూర్తి చేశారు. తండ్రి భూమరాజుకు సాహిత్య పఠనంపై ఆసక్తి ఉండడంతో రాజారావు సైతం 5వ తరగతి నుండే సాహిత్యంపై మక్కువ చూపారు. ప్రస్తుతం నిర్మల్‌ బ్రాంచ్‌ ఎల్‌ఐసిలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 1990 నుండి సాహిత్య రచన ప్రారంభించారు. సామాజిక నేపథ్యం, బడుగు బలహీన వర్గాల అణిచివేత పక్రియలపై స్పందించి తాత్విక రచనలను కొనసాగించారు.

ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని 1992లో ఎల్‌ఐసి ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటిసారి "మా ఊరి మామిడి తోట" భారతీయ తత్వాన్ని తనదైన శైలిలో కవిత్వీకరించడంతో పాటు వెబ్‌సైట్‌ను సైతం రూపొందించారు. ఈ విధంగా తన రచనలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు సైతం పరిచయం చేశారు.[2]

రచనలుసవరించు

 • 2001 - "అనాగరిక గేయం" (కవితా సంపుటి)
 • 2009 - "నేను ఎవరు" (తాత్విక దీర్ఘ కవిత)
 • 2005 - దుఃఖనది కవితా సంపుటి
 • 2011 - హు యామ్‌ ఐ ఆంగ్లానువాదం
 • 2015 - సత్యం వైపు పయనం [3]

పురస్కారాలుసవరించు

 • 2000లో రంజని కుందుర్తి,
 • 2002లో ఎక్స్‌రే పురస్కారం,
 • 2003లో మోదు గురుమూర్తి స్మారక పురస్కారం,
 • 2004లో తెలుగు అసోసియేషన్‌ గుర్తింపు,
 • 2005లో శ్రీ పార్థివ ఉగాది పురస్కారం,
 • 2005అంబేద్కర్‌ ఫెలోషిప్‌ అవార్డు,
 • 2006లో జాతీయ స్థాయి ఎక్స్‌రే అవార్డు,
 • 2007లో కళాదయ పురస్కారం,
 • 2010లో తెలుగు భాషకు కృషి చేస్తున్నందుకు అప్పటి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లతో సత్కారం

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు