ముఫాసిర్-ఉల్-హక్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

ముఫాసిర్-ఉల్-హక్ (1944, ఆగస్టు 16 - 1983, జూలై 27) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1965లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఎడమచేతి ఓపెనింగ్ బౌలర్ గా రాణించాడు.

ముఫాసిర్-ఉల్-హక్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1944-08-16)1944 ఆగస్టు 16
కర్నాల్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ1983 జూలై 27(1983-07-27) (వయసు 38)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 51)1965 ఫిబ్రవరి 12 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 50
చేసిన పరుగులు 8 286
బ్యాటింగు సగటు 7.15
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 8* 35
వేసిన బంతులు 222 6,378
వికెట్లు 3 105
బౌలింగు సగటు 28.00 26.78
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/50 4/16
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 21/–
మూలం: ESPNCricinfo, 15 June 2017

ముఫాసిర్-ఉల్-హక్ 194, ఆగస్టు 16న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[1]

క్రికెట్ రంగం

మార్చు

ముఫాసిర్ 1960-61 నుండి 1975-76 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1964-65లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు.

క్రైస్ట్‌చర్చ్‌లోని లాంకాస్టర్ పార్క్‌లో తన ఏకైక టెస్ట్ ఆడాడు. అందులో రాస్ మోర్గాన్ (రెండుసార్లు), బెవాన్ కాంగ్‌డన్‌ల వికెట్లను తీసుకున్నాడు.[2] 1961-62లో కరాచీ గ్రీన్స్‌తో కరాచీ వైట్స్‌కు వ్యతిరేకంగా తన రెండవ మ్యాచ్‌లో 16 పరుగులకు 4 వికెట్లు తీయడం అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ బౌలింగ్ గణాంకాలుగా నమోదయింది.[3]

తన చివరి మ్యాచ్ ఆడిన కొద్ది వారాలకే 1975-76లో పాకిస్తాన్‌లో ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌కు అంపైర్ అయ్యాడు.

ముఫాసిర్-ఉల్-హక్ 1983, జూలై 27న పాకిస్తాన్ లోని కరాచీలో మరణించాడు.[1]

మూలాలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు