ముమ్మినేని సుధీర్ కుమార్
ముమ్మినేని సుధీర్ కుమార్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది.[1][2]
ముమ్మినేని సుధీర్‌కుమార్ | |||
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2022 మార్చి 24 - 13 నవంబర్ 2023 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1969 చర్ల, చర్ల మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ మరట్వాడ విశ్వవిద్యాలయం, ఔరంగాబాద్, మహారాష్ట్ర |
జననం, విద్యాభాస్యం
మార్చుఎం. సుధీర్ కుమార్ తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, చర్ల మండలం, చర్లలో నాగేశ్వరరావు, భరతలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన చర్లలో ఇంటర్ వరకు, ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీలో డిగ్రీ, నాందేడ్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ మరట్వాడ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1994లో హైకోర్టు న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నాడు.
వృత్తి జీవితం
మార్చుఎం. సుధీర్ కుమార్ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక సీనియర్ న్యాయవాది ఎంఆర్‌కే దరి వద్ద జూనియర్‌గా చేరి వృత్తిలో మెళుకువలు నేర్చుకొని సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టి అనంతరం అన్ని కోర్టుల్లోనూ న్యాయవాదిగా కేసులను వాదించాడు. ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా 2022 ఫిబ్రవరి 3న సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.[2][3] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[4] ఎం. సుధీర్ కుమార్ 2022 మార్చి 24న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసి[5] 2023 నవంబర్ 13న మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యాడు.[6][7]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (2 February 2022). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
- ↑ 2.0 2.1 TV9 Telugu (2 February 2022). "తెలంగాణా హైకోర్టుకు 12 మంది కొత్త జడ్జీల నియామకానికి సుప్రీం కోర్టు ఆమోదం." Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (3 February 2022). "హైకోర్టుకు 12 మంది కొత్త న్యాయమూర్తులు". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
- ↑ Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.
- ↑ V6 Velugu (24 March 2022). "హైకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం" (in ఇంగ్లీష్). Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (14 November 2023). "తెలంగాణకు చెందిన ఇద్దరు సహా ఐదుగురు హైకోర్టు జడ్జిల బదిలీ". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Namasthe Telangana (14 November 2023). "ఇద్దరు తెలంగాణ హైకోర్టు జడ్జీల బదిలీ". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.