ములకలపల్లి మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం
(ములకలపల్లి మండలం నుండి దారిమార్పు చెందింది)

ములకలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]

ములకలపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, ములకలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, ములకలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, ములకలపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°34′33″N 80°55′29″E / 17.575957°N 80.924835°E / 17.575957; 80.924835
రాష్ట్రం తెలంగాణ
జిల్లా భద్రాద్రి జిల్లా
మండల కేంద్రం ములకలపల్లి (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
గ్రామాలు 11
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 515 km² (198.8 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 34,794
 - పురుషులు 17,302
 - స్త్రీలు 17,492
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.06%
 - పురుషులు 53.04%
 - స్త్రీలు 34.98%
పిన్‌కోడ్ 507115

ఇది సమీప పట్టణమైన పాల్వంచ నుండి 19 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం ములకలపల్లి.

గణాంకాలు మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 34,794 - పురుషులు 17,302 - స్త్రీలు 17,492

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 515 చ.కి.మీ. కాగా, జనాభా 34,794. జనాభాలో పురుషులు 17,302 కాగా, స్త్రీల సంఖ్య 17,492. మండలంలో 9,305 గృహాలున్నాయి.[3]

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. మార్చు

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లోగడ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న ములకలపల్లి మండలాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ, ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అన్నారం
  2. పుసుగూడెం
  3. చాపరాలపల్లి
  4. మాధారం
  5. ములకలపల్లి
  6. కమలాపురం
  7. జగన్నాథపురం
  8. మూకమామిడి
  9. పగళ్లపల్లి
  10. తిమ్మంపేట
  11. రాచన్నగూడెం

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-07.

వెలుపలి లంకెలు మార్చు