పాల్వంచ

తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం లోని పట్టణం

పాల్వంచ, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పాల్వంచ మండలానికి చెందిన పట్టణం[1] 1987లో 3వ గ్రేడ్ పాల్వంచ పురపాలకసంఘంగా ఏర్పాటుచేయబడి, 2001లో అప్ గ్రేడ్ చేయబడింది.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం అవిభక్త ఖమ్మం జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది.[3]

పాల్వంచ, డమ్మాపేట కూడలి దృశ్యం.

గ్రామ భౌగోళికం

మార్చు
 
అంబేద్కర్ సర్కిల్

ఖమ్మంకు దాదాపు 90 కి మీ ల దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం, పాల్వంచ. కొత్తగూడెం - భద్రాచలం రహదారిపై, కొత్తగూడెంకు 12 కి మీ ల దూరంలో, భద్రాచలానికి 28 కి మీ ల దూరంలో ఉన్న పాల్వంచ, కొత్తగూడెం శాసనసభ నియోజక వర్గం పరిధిలోకి, ఖమ్మంలోక్‌సభ నియోజక వర్గ పరిధి లోకి వస్తుంది

గణాంకాలు

మార్చు
 
పాల్వంచ వద్ద ప్రముఖ ఆలయం పెద్దమ్మ గుడి

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,13,872 - పురుషులు 57,353 - స్త్రీలు 56,519;పిన్ కోడ్: 507 115. ఎస్.టి.డి. కోడ్ = 08744.

గ్రామ చరిత్ర

మార్చు

పాల్వంచ ఒకప్పుడు సంస్థానంగా వెలుగొందినది. పాల్వంచ సంస్థానం గురించిన చరిత్రను శ్రీ కొత్తపల్లి వెంకటరామలక్ష్మీనారాయణ పాల్వంచ సంస్థాన చరిత్ర పేరుతో రాసారు. ఈయన పాల్వంచ సంస్థానంలో విద్యాధికారిగా పనిచేసారు, దానితో పాటు ఆంధ్రవాజ్మయ సేవాసమితి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

పట్టణానికి రవాణా సౌకర్యాలు

మార్చు
  • ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు. దగ్గరలో 12 కి.మీ. దూరంలో, భద్రాచలం రోడ్ రైలుస్టేషను (కొత్తగూడెం) ఉంది. సికింద్రాబాద్ నుండి మణుగూరు వెళ్ళు రైలు బండి పాల్వంచ పట్టణం ప్రక్కగా వెళుచున్నది.
  • ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ముఖ్య పట్టణాల నుండి, ప్రభుత్వ రవాణా శాఖల (ఆర్.టి.సి) వారి బస్సు సౌకర్యం నేరుగా ఉంది.

పట్టణంలోని విద్యా సౌకర్యాలు

మార్చు
  • కె.టి.పి.యస్. ఉన్నత పాఠశాల.
  • జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల
  • కస్తుర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాల.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల.
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల[4]
  • ఇవి కాక మరికొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి.

పట్టణంలోని మౌలిక వసతులు

మార్చు

విద్యుత్ కళా భారతి ఆటస్థలo

మార్చు

లోగడ ఖమ్మం జిల్లాలో కెల్లా అతి పెద్దదైన ఈ ఆటస్థలం చరిత్ర పాల్వంచ క్రికెట్‌ క్లబ్బుతో ముడిపడి ఉంది. ప్రస్తుత కళాభారతి 1964లో ఉనికి లోకి వచ్చింది. ఈ ప్రదేశం ఎవరికి చెందినదో తెలియరాలేదు కానీ, క్రికెట్‌ క్లబ్బుకు అందాక, క్లబ్బు 1971లో పెవిలియను నిర్మించి ఈ ప్రాంతంలో క్రికెట్‌ ఆట అభివృద్ధికి దోహదం చేసింది.కళా భారతి అతి పెద్ద మైదానం. ఇది రాష్ట్రంలో అత్యుత్తమంగా పరిగణించబడుతుంది. పాల్వంచ క్రికెట్ క్లబ్ యొక్క చరిత్రతో కళా భారతి యొక్క చరిత్ర సరిగ్గా లేకపోవటంతో, ఇది పాల్వంచలో కాకుండా ఖమ్మం జిల్లా మొత్తంలో క్రికెట్లో మార్గదర్శకంగా పేరుపొందింది. ప్రస్తుత కళా భారతి 1964 లో కొంతకాలం ఉనికిలోకి వచ్చింది. భూమికి సంబంధించి విషయం ఏమిటంటే, కొన్ని రికార్డులు అది KTPS యొక్క ఆస్తి అని చెబుతున్నాయి, కొన్ని ఇతర రికార్డులు రాధాకృష్ణ టెంపుల్ కు చెందినవి అని రికార్డులు ఉన్నాయి.అయితే, ఈ ప్రాంతాన్ని పాల్వంచ క్రికెట్ క్లబ్ యొక్క చేతికి సమర్ధవంతంగా ఇచ్చుటకు ఆమోదించాయి.ఇది వినోదం కోసం పాల్వంచ పౌరులకు అందించారు. పాల్వంచ క్రికెట్ క్లబ్, కళా భారతి గ్రౌండ్స్ లో దాని ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. పెవిలియన్ 1971 లో నిర్మించబడింది,సిల్వన్ పరిసరాలలో క్రికెట్ చాలా కాలం పాటు జరిగింది.

వైద్య సౌకర్యం

మార్చు

నవభారత్ వారి ఆధ్వర్యంలో ఎల్.వి.ప్రసాదు కంటి ఆసుపత్రి ఉంది.

పట్టణానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

మార్చు

పట్టణానికి దగ్గరలో ప్రవహించే కిన్నెరసాని నది నుండి నీరు అందుబాటులో ఉంది..

పాల్వంచలో పరిశ్రమలు

మార్చు

ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది.

  • నల్ల బంగారమని పిలవబడే బొగ్గు ఇక్కడి కొత్తగూడెం, మణుగూరు లలోని సింగరేణిగనులలో పుష్కలంగా దొరుకుతుంది.
  • టియస్ జెనకో వారి కొత్తగూడెం (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం (KTPS)
  • స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
  • నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌ మొదలైనవి.

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • శివాలయం: 1820లో నిర్మించబడ్డ ఈ ఆలయం, ఇస్లామిక్‌, గోతిక్‌ నిర్మాణ రీతుల్లో ఉంటుంది.
  • శ్రీ రుక్మిణీ రాధాకృష్ణ దేవాలయం: KTPS-A కాలనీలో ఉంది. కళ్యాణ మండపం కూడా కలిగి ఉంది.
  • శ్రీ రామాలయ భజన మందిరం:శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీనివాసకాలనీ - పాల్వంచ బస్సుస్టాండుకి 2 కి.మీ.దూరంలోని శ్రీనివాసకాలనీలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారు వెలసినారు. అక్కడి ప్రజలు గుడి అభివృద్ధి చేసారు.
  • శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం, నవనగర్‌ : నవభారత్ సంస్థచే, నవనగర్‌లో, నవభారత్‌ కొండపై నిర్మించబడిన ఈ ఆలయం, ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది.
  • శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం : 1951లో పాలపిట్ట చెట్టు క్రింద వెలసిన ఈ అమ్మవారి ఆలయంలో, ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెలరోజులపాటు ప్రతిదినం, ఉదయం, సాయంత్రం, ప్రత్యేకపూజలు నిర్వహించడం ఆనవాయితీగా వచ్చుచున్నది. ఈ వేడుకలను పురస్కరించుకుని, ఆలయాన్ని రంగులతో అందంగా తీర్చిదిద్దెదరు.[5]
  • పెద్దమ్మ తల్లి ఆలయం:పాల్వంచ బస్టాండు నుంచి 4 కి.మీ. ల దూరంలో ఉన్న ఈ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. హైవే (ప్రధాన రహదారి) పై ప్రయాణించే ప్రతి ఒక్కరూ కనీసం మనస్సులో అమ్మవారిని ఒక్కసారి రోడ్దు పై నుంచే ధ్యానించు కొనుట ఆనవాయితీ. ప్రతి ఆదివారం వందల సంఖ్యలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఐతే భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ క్రొత్త వాహనాలకు పూజ చేయించటం చాల మంచిదని ప్రజల నమ్మకం. ప్రతి శుభ కార్యానికి ముందు అమ్మవారిని దర్శించుకొనుట శుభప్రదంగా భావిస్తారు. జంతు (కోడి, మేక) బలి ద్వారా అమ్మవారిని శాంతింపచేస్తే, అమ్మవారి కృపకు పాత్రులమవుతామని ఇక్కడి ప్రజల విశ్వాసం

చూడదగ్గ ప్రదేశాలు

మార్చు
  • ఎన్నో పరిశ్రమలకు పాల్వంచ కేంద్ర స్థానం. ఇక్కడి పరిసరాల్లో లభించే సహజ వనరుల కారణంగా పట్టణం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. నల్ల బంగారమని పిలవబడే బొగ్గు ఇక్కడి కొత్తగూడెం, మణుగూరు లలోని సింగరేణిగనులలో పుష్కలంగా దొరుకుతుంది. పట్టణానికి దగ్గరలో ప్రవహించే కిన్నెరసాని నది నుండి నీరు దొరుకుతుంది. వీటిపై ఆధారపడ్డ పరిశ్రమలెన్నో పాల్వంచలో నెలకొన్నాయి. వాటిలో కొన్ని:
  • TS Genco వారి కొత్తగూడెం తాప (థెర్మల్‌) విద్యుత్‌ కేంద్రం:- Kothagudem Thermal Power Station (KTPS)
  • స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌ (SIIL). ఈ కంపెనీ ఎన్.ఎం.డి.సి.లో విలీనం చేయబడింది.
  • నవభారత్‌ ఫెర్రో అల్లాయిస్‌ లిమిటెడ్‌.
  • కిన్నెరసాని నది: పాల్వంచకు కేవలం 12 కి మీ ల దూరంలో ప్రవహించే నది కిన్నెరసాని. గోదావరికి ఉపనదియైన కిన్నెరసానిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. ప్రకృతి రమణీయత మధ్య అలరారే ఈ అనకట్ట ప్రదేశం పరిసర ప్రాంతాలలోని విహార యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటుంది. సింగరేణి సంస్థ ఇక్కడ యాత్రికుల సౌకర్యార్ధం వసతి గృహాలను నిర్మించింది. ఈ ఆనకట్ట ద్వారా, పరిశ్రమలకు నీటి అవసరాలు తీరడమే కాక చుట్టుపక్కల రైతులకు సాగునీటి వసతి కూడా లభ్యమైంది. దీనికి 21కిమీలో కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది.[6]

పట్టణ విశేషాలు

మార్చు

ఎంతో కాలంగా ఇక్కడి ప్రజలలో ఒక నమ్మకం ఉంది. అదేమనగా: “పాల్వంచ లో బ్రతక నేర్చిన వ్యక్తి ఎక్కడైనా బ్రతక గలడు".

మండలంలోని పట్టణాలు

మార్చు
  • పాల్వంచ:పాల్వంచ అనునది పాత పాల్వంచ, కొత్త పాల్వంచ అను ఊర్ల కలయిక. ఈ పట్టణ జనాభా సుమారు 1,40,000 ఉంటుంది. పాల్వంచ పట్టణమునకు 10 కిలోమీటర్ల దూరంలో కిన్నెరసాని నదిపై డ్యాం కలదు ఇక్కడ చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ నది చుట్టూ అభయారణ్యం ఉంది. ఇక్కడ రకరకాల అడవి జంతువులను చూసేవీలుంది. పాల్వంచ పట్టణం కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దీని ప్రస్తుత శాసనసభ్యుడువనమా వెంకటేశ్వర రావు

పోడు పట్టాల పంపిణీ

మార్చు

పాల్వంచలోని సుగుణ ఫంక్షన్‌ హాల్లో 2023, జూన్ 30న ఉదయం 11:35 గంటలకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కలిసి గిరిజన రైతులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు.[7][8]

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. ఆంధ్రజ్యోతి, ఖమ్మం (17 April 2021). "పాల్వంచ కథ.. అంతులేని వ్యధ.. 21ఏళ్లుగా మునిసిపల్‌ ఎన్ని'కళ'కు దూరం". www.andhrajyothy.com. Archived from the original on 3 May 2021. Retrieved 3 May 2021.
  3. "భద్రాద్రి కొత్తగూడెం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived from the original on 2022-01-06. Retrieved 2022-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. (Govt. Degree College)https://www.facebook.com/pages/Government-Degree-College-Paloncha/207473402796820
  5. ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం/కొత్తగూడెం; 2017,జులై-23; 2వపేజీ.
  6. నమస్తే తెలంగాణ, జిందగీ వార్తలు (27 July 2018). "పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని". మధుకర్ వైద్యుల. Archived from the original on 15 జూన్ 2019. Retrieved 15 June 2019.
  7. Kommuru, Jyothi (2023-06-30). "Harish Rao: పాల్వంచలో గిరిజన రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌ రావు". www.hmtvlive.com. Archived from the original on 2023-07-10. Retrieved 2023-07-10.
  8. "నేడు పోడు పట్టాల పంపిణీ సర్వం సిద్ధం". EENADU. 2023-06-30. Archived from the original on 2023-06-30. Retrieved 2023-07-10.

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పాల్వంచ&oldid=4054386" నుండి వెలికితీశారు