ముల్లుగోరింట
ముల్లుగోరింట (సంస్కృతం: वज्रदंती) ఒక రకమైన ఔషధ మొక్క ఇది అకాంథేసి కుటుంబంలోనిది. దీని శాస్త్రీయనామం బార్లేరియా ప్రయోనిటిస్ (Barleria prionitis). ఇది సతత హరితముగా చిన్నచిన్న ముళ్ళు కలిగివుండును. ఇది 2-4 అడుగుల ఎత్తు వరకు పెరుగును. దీని పూవులు గంటాకారముగా తెలుపు, ఎరుపు, పసుపు, నీలము మొదలైన రంగులు కలిగియుండును.
ముల్లుగోరింట | |
---|---|
Barleria pronitis in Hyderabad, India. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | B. prionitis
|
Binomial name | |
Barleria prionitis |
భారతదేశానికి చెందిన ఈ మొక్క ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు.. దీని వేరులను మలాముచేసి పుండ్లకు రాసిన త్వరగా మానును. ఆకుల రసమును తీసి తేనెతో కలిపి వాడిన పళ్ళనుండి వస్తున్న రక్తస్రావము ఆగును. దీని గోరింటాకు గోళ్ల అందాన్ని పెంచడానికి వాడతారు.[1]
మూలాలు
మార్చు- ↑ కురంటక - ముల్లుగోరింట, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 102.