మువ్వావారిపాలెం
మువ్వావారిపాలెం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.
మువ్వావారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°33′10.512″N 79°50′39.876″E / 15.55292000°N 79.84441000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | చీమకుర్తి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్‌కోడ్ | 523 226 |
ఈ గ్రామ యువత మన ఊరి స్నేహితులు పేరిట ఒక బృందంగా ఏర్పడి, ఐదు లక్షల రూపాయలకు పైగా వ్యయంతో దీనిని ఏర్పాటుచేసారు. ఈ క్రమంలో ఒక స్వచ్ఛందసంస్థ సహకారాన్ని తీసికున్నారు. గ్రామస్థులకు 20 లీట్రల శుద్ధిచేసిన త్రాగునీటిని 2/3 రూపాయలకే అందించున్నారు. ఇలా వచ్చిన మొత్తాన్ని, ఈ కేంద్రం నిర్వహణ ఖర్చులకే ఉపయోగించుచున్నారు.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, పి.జమాయేలు, సర్పంచిగా ఎన్నికైనారు.
గడచిన సంక్రాంతి పండుగ రోజున ఎక్కడెక్కడో స్థిరపడిన/ఉద్యోగాలు చేస్తున్న ఈ వూరి యువకులు వూరిలో కలుసుకుని, చర్చించుకుని తమకు జన్మనిచ్చిన గ్రామానికి కొంతయినా ఋణం తీర్చుకోవాలని సంకల్పించి, గ్రామంలోని భూగర్భజలాలలో ఫ్లోరైడు శాతం అధికంగా ఉన్నందువలన, గ్రామస్తులకు శుద్ధజలం అందించాలని నిశ్చయించుకున్నారు. ఈ కేంద్రానికి అవసరమైన స్థలాన్ని గ్రామస్థులైన మువ్వా నరసింహారెడ్డి సోదరులు విరాళంగా ఇచ్చారు. పిబ్రవరి-2013లో శంకుస్థాపన చేసారు. గ్రామస్థులంతా చందాలు వేసుకొని రు.5 లక్షలతో ఒక షెడ్డు నిర్మించారు. దీనికి కావలసిన యంత్రాలను ఈ-హెల్త్ అను సంస్థ అందించింది. ఈ రకంగా గ్రామస్తులందరూ కలిసి, రాజకీయాల కతీతంగా సహకరించి, పని పూర్తి చేసి, 2013, నవంబరు-17 న, శుద్ధజలకేంద్రాన్ని ప్రారంభింపచేసి అందరి ప్రశంసలనందుకున్నారు. తరువాత వీరి దృష్టి మండలకేంద్రానికి వెళ్ళే రహదారిని మరమ్మత్తు చేయించాలని సంకల్పించారు.
ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు