ప్రధాన మెనూను తెరువు

ముస్లింల పవిత్ర స్థలాలు ఇస్లామీయ సంప్రదాయాలలో ఎన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి. మస్జిద్-అల్-హరామ్ (కాబా) ఇందులో పరమపవిత్రం. మస్జిద్-ఎ-నబవి (మదీనా), మస్జిద్-ఎ-అఖ్సా (జెరూసలేం), మరియు బైతుల్-ముఖద్దస్ పవిత్రస్థలాలు.

మస్జిద్-అల్-హరామ్, మక్కాసవరించు

 
కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ముస్లిం సమూహం.

మస్జిద్-అల్-హరామ్ (المسجد الحرام "పవిత్రమైన మసీదు"), మక్కానగరంలోని ఒక పెద్ద మస్జిద్ మరియు ఇస్లామీయ ప్రపంచంలోని అతిపెద్ద మస్జిద్. ఈ మస్జిద్ కాబా గృహం చుట్టూ ఉంది. ముస్లింలందరూ ఈ కాబా వైపు తిరిగి నమాజు చేస్తారు. ముస్లింలకు పరమపవిత్రం, దీన్నే హరమ్ షరీఫ్ అని కూడా అంటారు.

ఈ మస్జిద్ యొక్క వైశాల్యం 3,56,800 చదరపు మీటర్లు, మరియు 8,20,000 మంది నమాజీ (నమాజ్ చేయువారు) లకు నమాజు చేసే వసతి గలదు. హజ్ సమయంలో వసతి కొరతవల్ల వీధులలోనూ నమాజులు ఆచరిస్తారు. హజ్ కొరకు ప్రతి సంవత్సరం కనీసం 25 లక్షలమంది హజ్ యాత్రికులు వస్తారు.

మస్జిద్-ఎ-నబవి, మదీనాసవరించు


మస్జిద్-ఎ-నబవి (ప్రవక్తగారి మసీదు) (అరబ్బీ: المسجد النبوي ) మదీనా నగరంలో గలదు. దీనిని రెండవ అతిపవిత్ర స్థలంగా పరిగణిస్తారు.

ఇది మహమ్మద్ యొక్క నివాసము. మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళిన తరువాత ఇచటే స్థిరనివాసము ఏర్పరచుకొన్నారు. తరువాత ఇచటే మస్జిద్ నిర్మింపబడింది. ఈనిర్మాణంలో స్వయంగా ప్రవక్త పాల్గొన్నారు. ఈ మస్జిద్ ను సామాజికకేంద్రంగాను, న్యాయస్థానంగాను, ధార్మికపాఠశాలగాను ఉపయోగించారు. ఇచటే ఖురాన్ను గూడా బోధించేవారు. ఈ నిర్మాణ విధానాన్నే ప్రపంచవ్యాప్తంగా మస్జిద్ ల నిర్మాణాలకొరకు ఉపయోగిస్తున్నారు.

ఈ మస్జిద్ ను ప్రవక్తకాలంలోనే నిర్మించారు. తరువాత వివిధ ఖలీఫాల కాలాలలో దీనిని విస్తరించారు. 1839 సం.లో ఈ మస్జిద్ యొక్క గుంబద్ లేక గుంబజ్ (గుమ్మటం) ను పచ్చని రంగుతో పూతపూశారు. ఈ గుంబద్ నే ప్రేమాభక్తితో సబ్జ్ గుంబద్ అని గుంబద్-ఎ-ఖజ్రా అని వ్యవహరిస్తారు.

మస్జిద్ ఎ అల్ అఖ్సా, జెరూసలేంసవరించు

అల్-అఖ్సా మస్జిద్ అనునది పురాతన ఇస్లామీయ మస్జిద్ ల సమూహము. ఈ సమూహములో ప్రార్థనలకొరకు ఉపయోగించు మస్జిద్ 'మస్జిద్-అల్-అఖ్సా, గలదు. అల్-అఖ్సా అనే పదం ఖురాన్ లో ఉదహరించబడ్డది.

అల్-అఖ్సా మస్జిద్ ను ప్రథమ ఖిబ్లాగా వ్యవహరించేవారు. దైవాజ్ఞ తరువాత కాబాను ఖిబ్లాగా మార్చుకొన్నారు. మహమ్మదు ప్రవక్త ఇస్రా మరియు మేరాజ్కు ఇచ్చటినుండే పయనమయ్యారు.

అబూ అల్-దర్దా ఉల్లేఖనం ప్రకారం: మహమ్మద్ ప్రవక్త ప్రవచించారు, 'ఒక్కసారి మస్జిద్-అల్-హరామ్ లో నమాజు చేస్తే 1,00,000 నమాజుల పుణ్యం, మస్జిద్-ఎ-నబవిలో నమాజు చేస్తే 1,000 నమాజుల పుణ్యం మరియు మస్జిదె అఖ్సాలో నమాజు చదివితే 500 నమాజులపుణ్యం దక్కుతుంది.' --సహీ బుఖారి -2:21:288.

బైతుల్ ముఖద్దస్సవరించు

బైతుల్-ముఖద్దస్, బైత్-అల్-ముఖద్దస్ (అరబ్బీ: مسجد قبة الصخرة, మస్జిద్ ఖుబ్బత్ అస్-సఖరా (టర్కీ : కుబ్బెతుస్-సహ్రా) ఇస్లాం లోని ఒక పుణ్యక్షేత్రం. ఇది జెరూసలేం లోని మస్జిద్ ల సమూహాలలో ముఖ్యమైన మస్జిద్. దీని నిర్మాణం 691 లో పూర్తయింది. ఇది ఇస్లాం లోని ప్రపంచంలోనే అత్యంత పురాతన కట్టడం.[1] దీనినే ఇంగ్లీషువారు 'డూమ్ ఆఫ్ రాక్' అని వ్యవహరిస్తారు.

మూలాలుసవరించు

  1. Rizwi Faizer (1998). "The Shape of the Holy: Early Islamic Jerusalem". Rizwi's Bibliography for Medieval Islam. మూలం నుండి 2002-02-10 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)

ఇవీ చూడండిసవరించు