ఖలీఫా ఖిలాఫత్ (ఖలీఫాల సామ్రాజ్యం) రాజ్యాధినేత, ఈ బిరుదు ఇస్లామీయ సామ్రాజ్యం షరియా చేనడుపబడు ఉమ్మహ్ యొక్క నాయకునికి ఇవ్వబడింది. ఇది అరబ్బీ పదం. About this sound خليفة Khalīfah    అర్థం "వారసుడు" లేదా "ప్రతినిధి". మహమ్మదు ప్రవక్త (570-632) తరువాత రాజకీయవారసులుగా ఖలీఫాలు "ఖలీఫత్ రసూల్ అల్లాహ్"గా పరిగణింపబడ్డారు.

వ్యాసముల క్రమము

Allah1.png

ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ఖలీఫాలకు అమీర్ అల్ మూమినీన్ (أمير المؤمنين) "విశ్వాసుల నాయకుడు", ఇమామ్ అల్-ఉమ్మహ్, ఇమామ్ అల్-మూమినీన్ (إمام المؤمنين), లేదా అతి సాధారణంగా ముస్లింల నాయకుడు అని పిలుస్తారు. మొదటి నలుగురు ఖలీఫాలైన అబూబక్ర్, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ల తరువాత, ఈ బిరుదును ఉమయ్యద్ లు, అబ్బాసీయులు, ఉస్మానీయులు స్పెయిన్ ఉత్తర ఆఫ్రికా, ఈజిప్టును పరిపాలించే కాలంలో ఉపయోగించారు. ముఖ్యమైన చారిత్రక ముస్లిం గవర్నర్లైన సుల్తానులు లేదా అమీరులు ఖలీఫాలకు విధేయులుగా వుండేవారు. రాను రాను ఈ ఖలీఫాల ప్రాముఖ్యత తగ్గుతూ వచ్చింది. ఈ బిరుదు ఆఖరుగా ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన టర్కీకు వుండినది. కానీ 1924 సం.లో ఆంగ్లేయుల కుతంత్రానికి బలై తుడిచివేయబడింది. చాలామంది ముస్లింలు ఈ ఖలీఫా విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆందోళనలు చేశారు.[1] భారతదేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం జరగిన ఖిలాఫత్ ఉద్యమం ఈకోవకుచెందినదే.

ముహమ్మద్ ప్రవక్త వారసత్వంసవరించు

ముహమ్మద్ ప్రవక్త జీవితకాలంలో ముస్లిం ప్రపంచాన్నంతటికీ వీరే నాయకుడిగా ఉన్నారు. వీరి తరువాత నలుగురు రాషిదూన్ ఖలీఫాలు ఖలీఫాలయ్యారు. వారు వరుసగా అబూబక్ర్, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, అలీ ఇబ్న్ అబీ తాలిబ్. ఈ ఖలీఫాలందరూ ప్రజలచేత ఎన్నుకోబడ్డవారే. సున్నీ ముస్లిం ల ప్రకారం అబూబక్ర్ ముస్లిం సముదాయాలచే ఎన్నుకోబడ్డాడు. ఇదే సరైన ప్రజాతంత్ర తరహా. ఖలీఫా ఎన్నికలచేగానీ సమాజపు ఏకగ్రీవతచే గానీ ఎన్నుకోబడవలెను.

వారసుడి లక్షణాలుసవరించు

ఖలీఫాల వారసుడిగా ఎన్నుకోబడే వ్యక్తికి ఈ లక్షణాలుండవలెను.

 • ఖురాన్ ప్రాతిపదికాన తన ఖలీఫా కర్తవ్యాన్ని నిర్వర్తించవలెను.
 • ఇస్లామీయ ధార్మిక పాలన గావింపవలెను.
 • తన రాజ్యం షరియాకు అనుగుణంగా వుండవలెను.
 • తాను రాజకీయ కర్తవ్యాలను గుర్తించి న్యాయసూత్రాలను మాత్రం ఉలేమాల కర్తవ్యాలలో వుంచవలెను.

అల్-ఘజాలి ప్రకారం ప్రభుత్వాధినేతకు కావలసిన లక్షణాలుసవరించు

అల్-ఘజాలి "నసీహత్ అల్-ములూక్" లేదా "రాజులకు హితబోధలు" సెల్జూఘ్ ఖలీఫా కొరకు వ్రాశాడు. ఇతని ప్రకారం దశ హితబోధలు రాజుకు తనరాజ్యపరిపాలన కొరకు కనీసం వుండవలసిన సూత్రాలని సూచించాడు.

 1. తన భుజస్కంధాలపై ఉంచబడిన బాధ్యతల ప్రాముఖ్యాన్ని, అపాయాన్ని, రాజు గ్రహించవలెను. అధికారం ఒక వరం, ఈ అధికారాన్ని ధర్మబధ్ధంగా చెలాయిస్తే ఇటు రాజుకూ అటు ప్రజకూ అనంత సుఖఃసంతోషాలు కలుగును, లేనిచో ఇటు రాజూ అటు ప్రజలూ దుఖః పాతానికి లోనౌతారు.
 2. రాజు ఎల్లప్పుడూ ధార్మిక పండితులకు సంప్రదించడానికి తహతహలాడాలి, వీరి సలహాలు తీసుకొని రాజ్యాన్ని సుబిక్షంగా పాలించాలి.
 3. పరస్త్రీవ్యామోహాన్ని తానూ త్యజించాలి తన అధికారవర్గం త్యజించాలి. అన్యాయాన్ని తానూ తన అధికారగణం సహించకూడదు. రాజు తన స్వంత జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అలాగే తన అధికారగణ జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అన్యాయాలుంటే శిక్షించాలి.
 4. రాజు నిగర్విగాను, కోపతాపాలకు దూరంగానూ, పగ ద్వేషాలకు అతీతంగానూ ఉండాలి. కోపము జ్ఞానుల శత్రువుగా గుర్తించాలి. తనపాలనలో శాంతి, క్షమా, దయా కారుణ్యాలపట్ల తనూ తలొగ్గాలి ఇతరులనూ తలొగ్గేలా చేయాలి. క్షమాగుణాలను అలవర్చుకొనేలాచేయాలి.
 5. ప్రతివిషయ సన్నివేశంలో రాజు తనకు తాను ప్రజగా భావించి ప్రజలకు అధికారులుగా భావించి కార్యక్రమాలు చేయాలి. తనకొరకు ఏమికోరుకుంటాడో ఇతరులకూ అవే అందజేయాలి. ఇలా చేస్తేనే తన అధికారాలను సద్వినియోగం చేస్తున్నట్లు.
 6. రాజు న్యాయస్థానంలో ఫిర్యాదు దారుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించవలెను. ఫిర్యాది యొక్క సాధక బాధకాలను తెలుసుకోవడం రాజు యొక్క విద్యుక్తధర్మం. అన్యాయానికి తావు లేకుండా చూడవలసిన బాధ్యతకూడా రాజుదే.
 7. రాజు అలంకారాలకు మోజులకు వ్యామోహాలకు బానిస కారాదు. అసలు వీటి జోలికే పోరాదు. హుందాగావుంటూ రాజ్యానికి మకుటంలా ఉండాలి గాని, అహంకారానికి పోయి రాజ్యానికి చీడ తేకూడదు.
 8. రాజు మృదువుగా మెలగడం అలవర్చుకోవాలి, క్రూరంగాను, అసభ్యంగాను, హింసించువాడు గాను ఉండకూడదు.
 9. రాజును ప్రజలందరూ మెచ్చుకొనేలా రాజు మసలుకోవాలి. ప్రజలను గదమాయించి తనను పొగిడేలా చేసుకొనే రాజు అత్యల్పుడు. ప్రజలలో తనపట్లగల భావాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తన తప్పులున్నయెడల వాటిని తెలుసుకొని దిద్దుకుంటూ ప్రజలనోటిలో నాలుకలా మెలగాలి.
 10. అల్లాహ్ ను సంతుష్టుడిని చేసేందుకు ప్రతికార్యం సలపాలి. ఓ ప్రజ దగ్గర మెప్పు కోసం అల్లాహ్ ను వ్యతిరేకిగా చేసుకోరాదు. ఒకరిని అసంతుష్టుడిని చేసి అల్లాహ్ ను సంతుష్టుడిని చేయడం ఉత్తమం. ఒకరిని సంతుష్టుడిని చేసి అల్లాహ్ ను అసంతుష్టుడు చేయడం జరగరాదు.

ముస్లిం ప్రపంచానికి ఒకే ఖలీఫా సూత్రంసవరించు

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా సెలవిచ్చారు :

"మీలో ఒకరి నాయకత్వాన గల ఐకమత్యాన్ని, ఛిద్రం చేయాలని, మీలో అనైక్యత కల్గించాలని ఎవరైనా భావించి కుట్రపన్నినచో వారిని అంతమొందించండి." [2]

"ఇస్రాయీలుల సంతతి ప్రవక్తలచే పాలించబడింది; ఎపుడైనా ఒక ప్రవక్త మరణించినపుడు ఇంకో ప్రవక్త అవతరింపబడేవారు; కానీ నా తరువాత ఎవ్వరూ ప్రవక్తలు రారు. నా తరువాత ఖలీఫా లు వుంటారు, ఒకేసారి (ప్రపంచంలోని పలు ప్రాంతాలలో) కొందరు ఖలీఫాలు వుంటారు; వారు ప్రశ్నించారు: మేమేమి చేయవలెనని ఆదేశిస్తారు? మహమ్మదు ప్రవక్త జవాబిచ్చారు: వారిని (ఖలీఫాలను) సహకరించండి, వారిలో మొదటివారిని, వారిలో మొదటివారిని, వారికివ్వవలసిన బాకీలను ఇవ్వండి; వారికి (ఖలీఫాలకు) అల్లాహ్, మీకప్పగించబడిన పనులను ఎంతవరకు నెరవేర్చారని ప్రశ్నిస్తాడు."[2]

"ఒక సారి ఇద్దరు ఖలీఫాల మధ్య జగడమొస్తే, తరువాత వాడిని అంతమొందించండి". [2]

అబూబక్ర్ ఈ విధంగా సెలవిచ్చారు: "ఒకేసారి (ఒకే ప్రాంతానికి) రెండు ఖలీఫాలు లేదా అమీర్లు ఉండడం శ్రేయస్కరం కాదు, ఇలా వుంటే పరిపాలనలో అవాంతరాలొస్తాయి, ప్రజల మధ్య అనైక్యత జన్మిస్తుంది, ప్రజలు రెండు సమూహాలుగా విడిపోతారు. సున్నహ్ నీరుగారిపోతుంది, బిద్ అత్ జనియిస్తుంది ఫిత్నా బయలుదేరుతుంది, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం గాదు". [3]

ఉమర్ ఈ విధంగా అన్నాడు: “ఒకే సారి, ఒకే సముదాయానికి రెండు నాయకులు ఉండడం క్షేమకరం కాదు" [3]

ఇబ్నె ఖుల్దూన్ 14వ శతాబ్దపు ముస్లిం పండితుడు, ఆర్థిక శాస్త్రవేత్త, చరిత్రకారుడు ఇలా అన్నాడు: "ఖలీఫా పదవికి ఒకేసారి ఇద్దరిని నియమించడం సాధ్యం కాదు. హదీసుల ననుసరించి ధార్మిక పండితులు ఈ విధంగా ఉద్దేశ్యాలేర్పరచారు; సహీ ముస్లిం ప్రకారం ఒకే సముదాయానికి ఒకేసారి ఇద్దరు అమీర్లు వుండడం సమాజానికి అపాయం".[4]

చరిత్రసవరించు

అబూబక్ర్ మరణశయ్యపైనుండగా, తనవారసుడిగా ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ను ప్రకటించాడు, ముస్లిం సముదాయం అతడి కోరికను శిరసా వహించింది. ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ను ఒక ఎన్నికల సభ ఎన్నిక చేసింది, కానీ ఉస్మాన్ ను కొన్ని వ్యతిరేక శక్తులు హత్య చేశాయి. అలీ ఖలీఫాగా ఎన్నుకోబడిననూ, అందరూ అతన్ని ఖలీఫాగా అంగీకరించలేదు. ఇతను చాలా ఇబ్బందుల పాలయ్యారు. 5 సంవత్సరాలు ఖలీఫాగా అనేక కుట్రలను ఎదుర్కొన్నారు, చివరకు అరాచక శక్తులు ఇతడినీ హత్యచేశాయి. ఈ కాలాన్నే ఫిత్నా కాలమని లేదా అంతర్యుద్ధాలు అంటారు.

ఉమయ్యద్ లుసవరించు

 
ఉమయ్యద్ ఖలీఫాల కాలంలో ఇస్లామీయ సామ్రాజ్య విస్తరణ. 661-750

అబ్బాసీయులుసవరించు

 
అబ్బాసీయ సామ్రాజ్యం విస్తరణా పటము

నీడ ఖలీఫాలుసవరించు

1258లో మంగోలులు హులగు ఖాన్ ఆధ్వర్యంలో బాగ్దాదును ఆక్రమించినపుడు, అబ్బాసీయులలో మిగిలిన వారు ఈజిప్టులో ఖలీఫాగా ప్రకటించుకొన్నారు. వీరినే నీడ ఖలీఫాలని వ్యవహరిస్తారు.

ఉస్మానీయులుసవరించు

 • ఉస్మానియా సామ్రాజ్యం కాలం : 1517 - 1924
 • ఉస్మానియా ఖలీఫాలు లేదా సుల్తానులు లేదా అమీర్లు :
 • ఉస్మానియా సామ్రాజ్య ప్రాంతాలు :
 • ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని : ఇస్తాంబుల్

ఖలీఫా విధాన నిర్మూలనసవరించు

మార్చి 3, 1924, న "టర్కిష్ గ్రాండ్ నేషనల్ అసెంబ్లీ" యందు ముస్తఫా కమాల్ అతాతుర్క్ ఆధ్వర్యమున "ఖిలాఫత్" (ఖలీఫా) అధికారాలన్నీ 'అసెంబ్లీ' కి బదిలీచేస్తూ "ఖిలాఫత్" విధానము రూపుమాపడమైనది. ఖిలాఫత్ విధానము తిరిగి ప్రవేశపెట్టాలని అనేక ఉద్యమాలు జరిగాయి.[1] భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం ఈ కోవకు చెందిందే.

పేర్కొనదగ్గ ఖలీఫాలుసవరించు

సామ్రాజ్యాలుసవరించు

ముఖ్యమైన సామ్రాజ్యాలు:

ఖలీఫా , ఖిలాఫత్ కొరకు వాదనలుసవరించు

ఎందరో ప్రాంతీయ పాలకులు తమకు తాము ఖలీఫాలుగా ప్రకటించుకొన్నారు. చాలా వాటిని ప్రజలంతగా పట్టించుకోలేదు.

ఇవీ చూడండిసవరించు


మూలాలుసవరించు

 1. 1.0 1.1 Jay Tolson, “Caliph Wanted: Why An Old Islamic Institution Resonates With Many Muslims Today,” U.S News & World Report 144.1 (January 14, 2008): 38-40.
 2. 2.0 2.1 2.2 Sahih Muslim, Kitab al-Imarah (Book of Government)
 3. 3.0 3.1 "As-Sirah" of Ibn Ishaq; on the day of Thaqifa
 4. Al-Muqaddimah by ibn Khaldun
 • Crone, Patricia, and Martin Hinds. God's Caliph: Religious Authority in the First Centuries of Islam. Cambridge: Cambridge University Press, 1986. ISBN 0521321859.
 • Donner, Fred. The Early Islamic Conquests. Princeton, New Jersey: Princeton University Press, 1981. ISBN 0691053278.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఖలీఫా&oldid=2873634" నుండి వెలికితీశారు