ముహమ్మద్ కులీ కుతుబ్ షా

ముహమ్మద్ కులీ కుతుబ్ షా (సా.శ. 1565 - 1612 జనవరి 11), కుతుబ్ షాహీ వంశపు ఐదవ సుల్తాన్. ఇతను హైదరాబాదు నగరాన్ని స్థాపించాడు. చార్మినార్ను కట్టించాడు. హైదరాబాదు నగరాన్ని, ఇరాన్కు చెందిన ఇస్‌ఫహాన్ నగరంలా తీర్చిదిద్దాడు. ఇతను కులీ కుతుబ్ షాగా ఎక్కువగా పేర్కొనబడతాడు, హైదరాబాదు నిర్మాతాగా పేర్కొనబడతాడు.[1]

మహమ్మద్ కులీ కుతుబ్ షా
హైదరాబాదులో కుతుబ్ షా సమాధి.

సాహిత్య పోషణ

మార్చు

ముహమ్మద్ కులీ కుతుబ్ షా, అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష, తెలుగు భాష లలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ, తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దీవాన్ (కవితా సంపుటి) గల మొదటి సుల్తాన్. ఇతని దీవాన్ పేరు "కుల్లియాత్ ఎ కుతుబ్ షాహి". ఇతను తెలుగు రచనలూ కవితలూ చేశాడు. దురదృష్ట వశాత్తు, ఇతడి తెలుగు పద్యాలేవీ ఇపుడు అందుబాటులో లేవు.

భాగమతి

మార్చు

మహమద్ కులీ కుతుబ్‌షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఆ తరువాత ఆవిడ పేరు మీదనే భాగ్ నగర్ అని పేరు పెడతాడు. పెళ్ళయిన తరువాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించి, హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాదుగా (అనగా హైదర్ యొక్కనగరం) రూపాంతరం చెందింది.

అంతకు ముందువారు
ఇబ్రహీం కులీ కుతుబ్ షా
కుతుబ్ షాహీ వంశము
1518–1687
తరువాత వారు
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 October 2016). "భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు". Archived from the original on 19 June 2020. Retrieved 19 June 2020.
  • Luther, Narendra. Prince, Poet, Lover, Builder: Muhammad Quli Qutb Shah, The Founder of Hyderabad

బయటి లింకులు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

History of medieval India secrets of Golconda

ఇతర పఠనాలు

మార్చు