కె బాలచందర్ తమిళ చిత్రం తెలుగులో తీయబడింది.కె.చటర్జీ నిర్మాత.సంగీత దర్శకుడిగా |చక్రవర్తి తొలి చిత్రం."ఈ సంజె లో కెంజాయలో" ,"జిలిబిలి పలుకుల చెల్లెళ్ళు","నాగులేటి వాగులోన","పోవనివ్వం పోనివ్వం " వంటి జనరంజకమైన పాటలున్నాయి.

మూగ ప్రేమ
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గుత్తా రామినీడు
తారాగణం శోభన్ బాబు ,
వాణిశ్రీ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ నసీమ్ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

వాసుదేవరావు అనే అతని ఇంట్లో కమల అనే అమాయకురాలు పనిమనిషిగా చేరుతుంది. వాసుదేవరావు తమ్ముడైన మురళిని చూసి ముచ్చటపడి, అతన్ని మనసులోనే ప్రేమిస్తుంది. మురళి, రాధ అనే అమ్మాయిని చూసి, ఆమె ఎవరని తెలుసుకోకుండా ప్రేమిస్తాడు. ఆమె కమల స్నేహితురాలు. ఆ విషయం తెలుసుకుని, కమల లోలోన బాధపడుతుంది. వాసుదేవరావు తన తమ్ముడికి కమలను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కాని, కమల బలవంతం మీద, రాధకు ఇచ్చి వివాహం చేస్తాడు. కమల రాసిన ఒక నవల చదివిన రాధ, ఆ కథ కమల కథేనని తెలుసుకుని, ఆమె చేసిన త్యాగాన్ని అర్థం చేసుకుని, తాను కావాలని కాలు పోగొట్టుకుంటుంది. కమల తనను ప్రేమించిన విషయం మురళి తెలుసుకుంటాడు. కమలకు ఇంకొక వరుడితో వివాహం నిశ్చయమవుతుంది. కాని కథ మరోలా సమాప్తమవుతుంది.

నటీనటులు

మార్చు
 • వాణిశ్రీ
 • విజయలలిత
 • జి.వరలక్ష్మి
 • సూర్యకాంతం
 • శోభన్ బాబు
 • రమణారెడ్డి
 • చలం
 • ప్రభాకరరెడ్డి

సాంకేతికవర్గం

మార్చు
 • దర్శకత్వం: గుత్తా రామినీడు
 • మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ
 • సంగీతం: చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: జి.కె.రాము
 • కళ: రాజేంద్రకుమార్
 • కూర్పు: అంకిరెడ్డి
 • నిర్మాత: ఎన్.ఎన్.భట్

పాటలు

మార్చు
వరుస సంఖ్య పాట రచన సంగీతం పాడిన వారు
1 నాగులేటి వాగులోన కడవ ముంచబోతుంటే ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
2 జిలిబిలి పలుకుల చెళ్లెల్లు చిలిపి తనాల తమ్ముళ్లు ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
3 మొయిలు చూసి మురిసి పోయి నటనమాడు నెమలి ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
4 ఈ సంజెలో కెంజాయలో చిరిగాలుల ఆచార్య ఆత్రేయ చక్రవర్తి పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం
5 వెయ్ వెయ్ చేతిలోన చేయ్ వేయ్ ఆచార్య ఆత్రేయ చక్రవర్తి
"https://te.wikipedia.org/w/index.php?title=మూగ_ప్రేమ&oldid=3609724" నుండి వెలికితీశారు