తెలుగు స్థానికీకరణ

మార్చు

తేదీనెలలు తెలుగులో, తెలుగు శైలి ప్రకారం నుండి లేక నాటికి అని తేది తరువాత వచ్చేటట్లు మార్చాను. df పరామితి, alt పరామితి post పరామితి, పరీక్షించాను. వాడుకలో దోషాలు కనబడితే ఇంకా సవరణలు చేయాలి.--అర్జున (చర్చ) 23:10, 23 ఆగస్టు 2020 (UTC)Reply

వికీశైలి ప్రకారం తేదీ

మార్చు

ప్రస్తుతం తేది, నెల, సంవత్సరంగా పనిచేస్తున్నది. df =US తో నెల, తేదీ, సంవత్సరం చేయవచ్చు, కాని, తెవికీ శైలికి తగిన అంతర్జాతీయ ప్రామాణిక తేదీ తీరుకు ( సంవత్సరం, నెల, తేదీ) కొరకు సవరణలు చేయాలి.--అర్జున (చర్చ) 07:16, 11 ఫిబ్రవరి 2021 (UTC)Reply

మూసకు తెలుగులో క్లుప్తవివరణ ఎడిటర్ లో కనిపించేలా చేయడం

మార్చు

ఈ సందేశానికి మూలం ఈ కూర్పు

అర్జున గారూ, ఈ దిద్దుబాటు ద్వారా నేను చేర్చిన "మూస వివరణ" (టెంప్లేట్ డిస్క్రిప్షన్) ను మీరు ఈ మార్పుతో వెనక్కి తిప్పారు. దానికి మీరిచ్చిన కారణం ఆ వివరణను డాక్ ఉపపేజీలోకి మార్చానని చెప్పారు. డాక్ ఉపపేజీ లోకి మార్చడం, మూస వివరణను చేర్చడం ఒకటి కాదని మీకు తెలిసే ఉంటుంది. అయినప్పటికీ ఓసారి మళ్ళీ చెబుతాను:

మూస వివరణ (టెంప్లేట్ డిస్క్రిప్షన్) అనేది ఆ మూస గురించిన అతి ముఖ్యమైన సమాచారాన్ని క్లుప్తంగా తెలియజేస్తుంది. ఆ మూసను వాడదలచిన వాడుకరికి, ఆ సందర్భంలో ఆ మూస వాడదగినదేనా కాదా అనేది, అ మూస పేజీకో, ఆ డాక్ పేజీకో వెళ్ళకుండానే దీనిద్వారా తెలుస్తుంది.

ఇక్కడ మీరు చేసిన పని వలన ఈ మూస ఎందుకు, ఎప్పుడు వాడాలో, వాడేటపుడే తెలుసుకునే అవకాశం పోయి, వాడుకరి డాక్ పేజీకి వెళ్తే తప్ప ఆ సంగతి తెలియని పరిస్థితి ఏర్పడింది. అందుచేత మీరు చేసిన ఆ దిద్దుబాటును రద్దు చేసి తిరిగి పూర్వపు స్థాయికి తీసుకువెళ్ళాలని కోరుతున్నాను.__చదువరి (చర్చరచనలు) 01:57, 7 మార్చి 2021 (UTC)Reply

చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. నేను ఈ విషయం పరిశోధించాను. నిర్వహణ సౌలభ్యం కోసం ఆంగ్ల వికీలో మూస పేజీలకు తెలుగు వికీ మూస పేజీలు అనువాదం తప్పించి ఒకేలా వుంచుతాము. అందుకని మీరు చేసిన మార్పుని రద్దుచేసి, ఆ వివరం doc ఉపపేజీ వాడుక విభాగంలో చేర్చాను. మీ స్పందన తరువాత, మీరు ఎడిటర్ లో వెతుకుపెట్టెలో త్వరితంగా కనబడే వివరం కోసం మీరు మార్పు చేశారని గ్రహించి, మీ మార్పు వివరాన్ని doc ఉపపేజీలో TemplateData విభాగంలో ఆంగ్ల పాఠ్యానికి బదులుగా చేర్చాను. అయితే బగ్ T52372 వలన అది వెంటనే విజువల్ ఎడిటర్, క్లాసిక్ ఎడిటర్ లో తాజా వివరం కనిపించడం లేదు. దానికి పరిష్కారం మూస పేజీని ఏ మార్పులు చేయకుండా ఒక సారి భద్రపరచడం అని బగ్ లో నివేదించారు. అది చేయగానే తెలుగు వివరణలు కనబడ్డాయి. కావున మీరు ఇతర మూసలలో ఇప్పటికే చేసిన సవరణలు, ఈ మూసలో నేను చేసినట్లుగా సరిదిద్దండి.--అర్జున (చర్చ) 22:55, 8 మార్చి 2021 (UTC)Reply
అర్జున గారూ, మూస వివరణను పెట్టాల్సిన చోట పెట్టినందుకు ధన్యవాదాలు. ఇతర మూసలలో చేసిన సవరణలను మార్చక్కర్లేదులెండి. వాటి అక్కడ ఉంచేయొచ్చు. __చదువరి (చర్చరచనలు) 04:20, 9 మార్చి 2021 (UTC)Reply
చదువరి గారు, అవసరమైన సవరణలు కొన్ని చేసినందులకు ధన్యవాదాలు. మిగతావి నేను సవరించాను. మూసలో చేసిన సవరణలు అలానే వుంచితే ఇతరులు కూడా ఇతరమూసలకు అలా చేసే అవకాశం వుంది, అంతేకాక వికీపీడియా మూసల సమగ్రతకొరకు, నిర్వహణ సౌలభ్యానికి మూసలో తెలుగుకోసం మీరు అదనంగా చేసిన మార్పులను తొలగించాను. మీరు సహృదయంతో అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 22:52, 9 మార్చి 2021 (UTC)Reply
ఇతర మూసలకు కూడా అలా చెయ్యవచ్చండి, తప్పేమీ లేదు. మీ అవగాహన కోసం, టెంప్లేట్‌డేటాను మూసలో పెట్టవచ్చని చెప్పే ఈ ఈ ఇంగ్లీషు వికీపీడియా ట్యుటోరియల్ చూడండి. __చదువరి (చర్చరచనలు) 23:25, 9 మార్చి 2021 (UTC)Reply
పై వ్యాఖ్యను అర్జున గారి దృష్టికి తెచ్చేందుకు.__చదువరి (చర్చరచనలు) 23:31, 9 మార్చి 2021 (UTC)Reply

చదువరిగారు, లింకు తెలిపినందులకు ధన్యవాదాలు, తప్పు అని కాదు, తొలిగా ఒకటి గా వున్న సమాచారం రెండు చోట్ల వుండడం నిర్వహణ సమస్యలకు దారితీస్తుంది కావున ఆంగ్ల వికీలో doc ఉపపేజీలో TemplateData సమాచారం వుంచే పద్దతే మెరుగు దానిని తెవికీలో పాటించడం మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 23:37, 9 మార్చి 2021 (UTC)Reply

@Arjunaraoc గారూ, నాకైతే నిర్వహణ సమస్యలొస్తాయని అనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ, ఇక ఈ చర్చను కొనసాగించనవసరం లేదని భావిస్తూ, నా తరపు నుండి దీన్ని ముగిస్తున్నాను. నమస్కారం. __ చదువరి (చర్చరచనలు) 23:42, 9 మార్చి 2021 (UTC)Reply
Return to "As of" page.