మెహర్గఢ్

బలూచిస్తాన్ పాకిస్తాన్లో పురావస్తు ప్రదేశం

మెహర్గఢ్ (బలూచి: మెహర్గఢ్; ఉర్దూ: مہرگڑھ;) అనేది నియోలిథికు నివాసిత ప్రాంతంగా (క్రీ.పూ. 7000 నాటిది)గుర్తించబడింది. ఇది పాకిస్తానులోని బలూచిస్తాను కాచి మైదానంలో ఉంది.[1] నియోలిథిక్ నివాసిత ప్రాంతం అయిన మెహర్గఢ్ సింధు నది లోయకు పశ్చిమాన బోలను పాసు సమీపంలో (ప్రస్తుత పాకిస్తాన్ నగరాలైన క్వెట్టా, కలాటు, సిబి మధ్య) ఉంది. 1974 లో ఈ ప్రాంతంలో నిర్వహించబడిన పురాతత్వ పరిశోధనకు ఫ్రెంచి పురావస్తు శాస్త్రవేత్త జీన్-ఫ్రాంకోయిసు జారిగే, కేథరీను జారిగే దర్శకత్వం వహించారు. ఈప్రాంతంలో 1974 - 1986 మధ్య, తరువాత 1997 - 2000 మద్యకాలం వరకు నిరంతరం త్రవ్వకాలు సాగించారు. పురావస్తుశాఖ ఆరు మట్టిదిబ్బలలో సాగించిన పరిశోధనలో సుమారు 32,000 కళాఖండాలు సేకరించబడ్డాయి. 495 ఎకరాల (2.00 కి.మీ 2) వైశాల్యం కలిగిన ఈ ప్రాంతంలోని ఈశాన్య మూలలో ఉన్న మెహర్గఢు మొట్టమొదటి స్థావరంగా-క్రీ.పూ 7000 - 5500 మధ్య నాటి ఒక చిన్న వ్యవసాయ గ్రామంగా స్థాపించబడిందని భావిస్తున్నారు.

Mehrgarh
مہرگڑھ
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Balochistan Pakistan" does not exist.
ఇతర పేర్లుMehrgahr, Merhgarh, Merhgahr
స్థానంDhadar, Balochistan, Pakistan
ప్రాంతంSouth Asia
నిర్దేశాంకాలు29°23′N 67°37′E / 29.383°N 67.617°E / 29.383; 67.617
చరిత్ర
స్థాపన తేదీApproximately 7000 BCE
వదిలేసిన తేదీApproximately 2600 BCE
పీరియడ్‌లుNeolithic
స్థల గమనికలు
తవకాల తేదీలు1974–1986, 1997–2000
పురాతత్వవేత్తలుJean-François Jarrige, Catherine Jarrige
Succeeded by: Indus Valley Civilization
Map of Pakistan showing Mehrgarh in relation to the cities of Quetta, Kalat, and Sibi and the Kachi Plain of Balochistan.

మెహర్గఢ్ ప్రస్తుతం సింధు లోయ నాగరికతకు పూర్వగామిగా చూడబడింది. ప్రారంభ స్థావరం, వ్యవసాయం ప్రారంభం నుండి పరిణతి చెందిన మొత్తం హరప్పా నాగరికత క్రమానికి నిదర్శనగా ఉంది.

చరిత్ర

మార్చు

దక్షిణ ఆసియాలో వ్యవసాయం, పశువుల పెంపకానికి ఆధారాలున్నట్లు నిరూపించబడుతున్న తొలి ప్రదేశాలలో మెహర్గఢ్ ఒకటి.[2][3][note 1]మెహర్గఢును నియరు ఈస్టర్ను నియోలిథికు సంస్కృతి ప్రభావితం చేసింది.[13] పార్పోలా అభిప్రాయం ఆధారంగా " పండించడానికి అనువుగా మార్చబడిన గోధుమ రకాలు, ప్రారంభ దశ వ్యవసాయం, కుండల తయారీ వాడకం, ఇతర పురావస్తు కళాఖండాలు, కొన్ని మొక్కల పెంపకం, మందలుగా జంతువులను పెంచడం. "వంటి పోలికలతో "[14][note 2]ఈ సంస్కృతికి చెందిన ప్రజలు సింధు లోయలోకి వలస వచ్చిన కారణంగా ఇది సింధు లోయ నాగరికతగా మారింది.[15]

" జీను-ఫ్రాంకోయిసు జారిగే " మెహర్గఢు స్వతంత్ర మూలం గురించి వివాదించాడు. జారిగే అభిప్రాయం ఆధారంగా "వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ నియరు-ఈస్టు నుండి దక్షిణ ఆసియా వరకు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబడిందనే ఊహ "[16][note 2] ఆ ప్రాంతాల మధ్య సాంస్కృతిక కొనసాగింపు ఉన్నాయనడానికి తూర్పు మెసొపొటేమియా, పశ్చిమ సింధు లోయ నుండి నియోలిథికు ప్రాంతాల మధ్య సారూప్యతలు సాక్ష్యంగా ఉన్నాయి. " కానీ మెహర్గఢు వాస్తవికత ఆధారంగా మెహర్గఢుకు మునుపటి స్థానిక నేపథ్యం ఉందని ఇది సమీప తూర్పు నవీన శిలా యుగం "బ్యాక్‌వాటర్" ప్రాంతం కాదని జార్రిజు తేల్చిచెప్పారు.[16]

 
మెహర్గఢ్ ప్రాంతం స్థానం

లుకాక్సు, హెంఫిలు వంటి పరిశోధకులు మెహర్గఢు ప్రారంభ స్థానిక అభివృద్ధిని సూచిస్తున్నారు. ఇది సాంస్కృతిక అభివృద్ధిలో కొనసాగింపు కానీ జనాభాలో మార్పుగా భావించబడుతుంది. లుకాక్సు హెంఫిలు అభిప్రాయం ఆధారంగా మెహర్గఢ్ నియోలిథికు(నవీన శిలా యుగం), చాల్కోలిథికు (రాగి యుగం) సంస్కృతుల మధ్య బలమైన కొనసాగింపు ఉన్నప్పటికీ దంతసబంధిత ఆధారాలు చాల్కోలిథికు జనాభా మెహర్గఢ్ నియోలిథికు జనాభా నుండి రాలేదని చూపిస్తుంది.[32] ఇది "మితమైన జన్యు ప్రవాహం స్థాయిలను సూచిస్తుంది. [32]" మెహర్గఢ్ నియోలిథికు నివాసుల ప్రత్యక్ష వారసులు మెహర్గఢ్ దక్షిణ, తూర్పున నివసించినట్లు కనుగొన్నారు. భారతదేశంలో వాయువ్య ప్రాంతాలలో, దక్కను పీఠభూమి పశ్చిమ అంచులలో వారు నివసించిన ఆధారాలు కనుగొనబడాలని వారు వ్రాశారు. మెహర్గఢ్ చాల్కోలిథికుతో పోలిస్తే మెహర్గఢ్‌కు దక్షిణంగా, చల్కోలిథిక్ ఇనాంగావుప్రాంతంతో అధికమైన అనుబంధాన్ని చూపిస్తుంది.[32][note 3]


గాలెగో రొమెరో వంటి ఇతర పరిశోధకులు (2011) భారతదేశంలో లాక్టోసు టాలరెంసు మీద చేసిన పరిశోధన ఆధారంగా వీరు " ఇతరులు గుర్తించిన పశ్చిమ ఐరోపా జన్యుపరంపర (2009) (ప్రధానంగా ఇరాను, మధ్యప్రాచ్యం)కు చెందిన జన్యు ప్రవాహాం ప్రతిబింబిస్తుంది" అని భావిస్తున్నారు. [35] గాలెగో రొమెరో భారతీయులు లాక్టోసు-టాలరెంటు సంబంధించి జన్యు నమూనా ఇది "సాధారణ యూరోపియను మ్యుటేషను లక్షణం." సూచిస్తుందని పేర్కొన్నాడు.[36] రొమేరో అభిప్రాయం ఆధారంగా అత్యంత సాధారణ లాక్టోసు టాలరెన్సు మ్యుటేషను ఆధారంగా వీరు 10,000 సంవత్సరా కాలం క్రితం ప్రజలు మధ్యప్రాచ్యం నుండి అటూఇటూ రెండు-మార్గం వలసలు చేసారని భావిస్తున్నారు. మ్యుటేషను ఐరోపా అంతటా వ్యాపించగా మరొక అన్వేషకుడు మ్యుటేషనును తూర్పు వైపుకుగా ప్రయాణించి భారతదేశానికి తీసుకువచ్చి ఉండాలి - బహుశా వారు పర్షియను గల్ఫు తీరం వెంబడి ప్రయాణించి ఉండాలని భావిస్తున్నారు. ఈ మార్గంలో అదే మ్యుటేషను సంభవించిన ఇతర ప్రాంతాలు కనుగొనబడ్డాయి.[36] "దక్షిణ ఆసియాలో పశువుల పెంపకానికి సంబంధించిన మొట్టమొదటి సాక్ష్యం మెహర్గఢ్‌లోని సింధునదీ లోయ ప్రాంతం నుండి లభించింది. ఇది 7,000 YBP నాటిది" అని గమనించండి.[35][note 4]

మూలాలు

మార్చు
  1. "Stone age man used dentist drill".
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; whc.unesco.org అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Mehrgarh అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. "Archeologists confirm Indian civilization is 2000 years older than previously believed, Jason Overdorf, Globalpost, 28 November 2012".
  5. "Indus Valley 2,000 years older than thought". 2012-11-04. Archived from the original on 2015-09-09. Retrieved 2019-10-11.
  6. "Archeologists confirm Indian civilization is 8000 years old, Jhimli Mukherjee Pandey, Times of India, 29 May 2016".
  7. "History What their lives reveal". 2013-01-04.
  8. "Haryana's Bhirrana oldest Harappan site, Rakhigarhi Asia's largest: ASI". The Times of India. 15 April 2015.
  9. Dikshit 2013, p. 132, 131.
  10. Mani 2008, p. 237.
  11. 11.0 11.1 Dikshit 2013, p. 129.
  12. Dikshit 2013, p. 130.
  13. 13.0 13.1 13.2 Gangal 2014.
  14. Singh 2016, p. 5.
  15. Parpola 2015, p. 17.
  16. 16.0 16.1 Jean-Francois Jarrige Mehrgarh Neolithic Archived 3 మార్చి 2016 at the Wayback Machine, Paper presented in the International Seminar on the "First Farmers in Global Perspective," Lucknow, India, 18–20 January 2006
  17. 17.0 17.1 17.2 17.3 Singh 2016.
  18. Possehl GL (1999) Indus Age: The Beginnings. Philadelphia: Univ. Pennsylvania Press.
  19. 19.0 19.1 Jarrige JF (2008) Mehrgarh Neolithic. Pragdhara 18: 136–154
  20. Costantini L (2008) The first farmers in Western Pakistan: the evidence of the Neolithic agropastoral settlement of Mehrgarh. Pragdhara 18: 167–178
  21. Fuller DQ (2006) Agricultural origins and frontiers in South Asia: a working synthesis. J World Prehistory 20: 1–86
  22. Petrie, CA; Thomas, KD (2012). "The topographic and environmental context of the earliest village sites in western South Asia". Antiquity. 86 (334): 1055–1067. doi:10.1017/s0003598x00048249.
  23. Goring-Morris, AN; Belfer-Cohen, A (2011). "Neolithization processes in the Levant: the outer envelope". Curr Anthropol. 52: S195–S208. doi:10.1086/658860.
  24. Jarrige C (2008) The figurines of the first farmers at Mehrgarh and their offshoots. Pragdhara 18: 155–166
  25. 25.0 25.1 Harris DR (2010) Origins of Agriculture in Western Central Asia: An Environmental-Archaeological Study. Philadelphia: Univ. Pennsylvania Press.
  26. 26.0 26.1 Hiebert FT, Dyson RH (2002) Prehistoric Nishapur and frontier between Central Asia and Iran. Iranica Antiqua XXXVII: 113–149
  27. Kuzmina EE, Mair VH (2008) The Prehistory of the Silk Road. Philadelphia: Univ. Pennsylvania Press
  28. Alizadeh A (2003) Excavations at the prehistoric mound of Chogha Bonut, Khuzestan, Iran. Technical report, University of Chicago, Illinois.
  29. Dolukhanov P (1994) Environment and Ethnicity in the Ancient Middle East. Aldershot: Ashgate.
  30. Quintana-Murci, L; Krausz, C; Zerjal, T; Sayar, SH; Hammer, MF; et al. (2001). "Y-chromosome lineages trace diffusion of people and languages in Southwestern Asia". Am J Hum Genet. 68 (2): 537–542. doi:10.1086/318200. PMC 1235289. PMID 11133362.
  31. Quintana-Murci, L; Chaix, R; Spencer Wells, R; Behar, DM; Sayar, H; et al. (2004). "Where West meets East: the complex mtDNA landscape of the Southwest and Central Asian corridor". Am J Hum Genet. 74 (5): 827–845. doi:10.1086/383236. PMC 1181978. PMID 15077202.
  32. 32.0 32.1 32.2 Coningham & Young 2015, p. 114.
  33. Kivisild 1999, p. 1331.
  34. 34.0 34.1 Kivisild 1999, p. 1333.
  35. 35.0 35.1 35.2 Gallego Romero 2011, p. 9.
  36. 36.0 36.1 Rob Mitchum (2011), Lactose Tolerance in the Indian Dairyland, ScienceLife
  37. Gallego Romero 2011, p. 12.


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు

"https://te.wikipedia.org/w/index.php?title=మెహర్గఢ్&oldid=3889465" నుండి వెలికితీశారు