మెహిదీ హసన్ మిరాజ్

మెహిదీ హసన్ మిరాజ్ (జననం: 1997 అక్టోబరు 25) బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. బంగ్లాదేశ్ జాతీయ జట్టు కోసం టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్ (వన్‌డేలు) ఆడతాడు. [2] [3] బౌలింగ్ -ఆల్ రౌండరు, కుడిచేతి వాటం బ్యాటరు, కుడిచేతి ఆఫ్ బ్రేక్ బౌలరు. 2018 నవంబరులో, వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా, అతను ఒక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బౌలర్లలో అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు సాధించాడు. 2021 ఫిబ్రవరిలో, అతను వెస్టిండీస్‌పై టెస్టుల్లో తన తొలి సెంచరీ సాధించాడు. [4] అదే సిరీస్‌లో, అతను బంగ్లాదేశ్ తరపున, మ్యాచ్‌ల పరంగా, టెస్టు క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన అత్యంత వేగవంతమైన బౌలరయ్యాడు. అతను తన 24వ మ్యాచ్‌లో అది సాధించాడు. [5] 2021 మే నాటికి, అతను ఐసిసి ర్యాంకింగ్స్‌లో నం. 2 వన్‌డే బౌలరు. ఆ స్థానాన్ని ఆక్రమించిన మూడవ బంగ్లాదేశ్ బౌలరు. [6]

మెహిదీ హసన్ మిరాజ్
2018 లో మెహిదీ హసన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మెహిదీ హసన్ మిరాజ్
పుట్టిన తేదీ (1997-10-25) 1997 అక్టోబరు 25 (వయసు 26)
ఖుల్నా, బంగ్లాదేశ్
ఎత్తు1.65 m (5 ft 5 in)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 80)2016 అక్టోబరు 20 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2023 జూన్ 14 - Afghanistan తో
తొలి వన్‌డే (క్యాప్ 123)2017 మార్చి 25 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 6 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.53
తొలి T20I (క్యాప్ 57)2017 ఏప్రిల్ 6 - శ్రీలంక తో
చివరి T20I2023 మార్చి 29 - ఐర్లాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.53
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014–2016Kalabagan
2015–presentఖుల్నా డివిజను
2016–2018/19Rajshahi Kings
2019/20Khulna Tigers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 39 82 20 45
చేసిన పరుగులు 1,114 1,044 244 1,677
బ్యాటింగు సగటు 20.91 23.92 12.44 25.85
100లు/50లు 1/3 2/2 0/0 1/9
అత్యుత్తమ స్కోరు 103 112* 38* 103
వేసిన బంతులు 6,924 3,777 216 10,966
వికెట్లు 150 89 12 184
బౌలింగు సగటు 33.84 33.35 80.01 29.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 8 0 0 14
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 0 4
అత్యుత్తమ బౌలింగు 7/58 4/25 2/31 7/24
క్యాచ్‌లు/స్టంపింగులు 21/– 33/– 8/– 34/–
మూలం: ESPNcricinfo, 13 March 2023

తొలినాళ్ళ జీవితం మార్చు

మిరాజ్ ఖుల్నాలో జన్మించాడు.[7] ఖుల్నా నగరంలోని ఖలీష్‌పూర్‌లో పెరిగాడు.[8] 8 సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు [9] కాశీపూర్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొంది, అక్కడ నుండి అండర్-14 జాతీయ క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. [9]

2019 మార్చి 15న, బంగ్లాదేశ్ టెస్టు టీమ్‌లోని పలువురు సభ్యులతో పాటు, మిరాజ్ న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లోని అల్ నూర్ మసీదులోకి ప్రవేశించిన కొద్ది క్షణాల్లో ఉగ్రవాద దాడి ప్రారంభమైంది. జట్టులోని సభ్యులందరూ "లోతుగా ప్రభావితమయ్యారు". [10] న్యూజిలాండ్‌లో జరిగిన ఆ ఉగ్రదాడి "షాక్" ను అధిగమించడానికి మిరాజ్ 2019 మార్చి 21న రబేయా అఖ్తర్ ప్రీతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. [11] [12] [13]

2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ మార్చు

2015 డిసెంబరులో, మిరాజ్ 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. [14] అండర్-19, అండర్-17, ఇతర దేశవాళీ టోర్నమెంట్‌లలో అతని పదవీకాలంలో ఎక్కువ భాగం ఓపెనర్‌గా ఆడినప్పటికీ, మిరాజ్ ప్రధానంగా టోర్నమెంట్‌లో దిగువ-మధ్య వరుసలో బ్యాటింగు, బౌలింగ్ ఆల్-రౌండర్‌గా ఆడాడు. మిరాజ్ తన జట్టును సెమీ-ఫైనల్‌లోకి తీసుకెళ్లగలిగాడు కానీ వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది. మూడో ప్లేస్‌లో బంగ్లాదేశ్‌ మూడు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. [15] ఆల్ రౌండ్ ప్రదర్శనతో మిరాజ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. [16] అతను ఆడిన మొత్తం 6 మ్యాచ్‌లలో 242 పరుగులు చేసి,[17] 12 వికెట్లు తీశాడు.[18]

అంతర్జాతీయ కెరీర్ మార్చు

టెస్టు క్రికెట్ మార్చు

2016 అక్టోబరు 20న, మిరాజ్ ఇంగ్లండ్‌పై టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు. అతను ఆఫ్ బ్రేక్ బౌలర్ అయినప్పటికీ, అతను తన తొలి టెస్టు ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ దాడిని ప్రారంభించాడు. [19] అదే టెస్టు మ్యాచ్‌లో మరో అరంగేట్ర ఆటగాడు బెన్ డకెట్ అతని మొదటి టెస్టు వికెట్. అదే మ్యాచ్‌లో, అతను టెస్టులో రంగప్రవేశంలోనే ఐదు వికెట్లు తీసిన ఏడవ, అతి పిన్న వయస్కుడైన బంగ్లాదేశ్ ఆటగాడిగా కూడా నిలిచాడు. [20] తన 2వ టెస్టు మ్యాచ్‌లో, అతను తన మొదటి రెండు టెస్టుల్లో మూడు సార్లు ఐదు వికెట్లు తీసి, టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశీ బౌలర్‌గా, మొత్తంగా 9వ ఆటగాడిగా నిలిచాడు. తొలి టెస్టు సిరీస్ లోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్న మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. [21] [22] [23] ఇంగ్లండ్‌తో అతని సంచలనాత్మక తొలి సిరీస్‌కు గాను, బంగ్లాదేశ్ ప్రధాని అతనికి కొత్త ఇల్లు బహుమతిగా ఇచ్చారు. [24]


2018 జూలైలో, సబీనా పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు క్రికెట్‌లో మిరాజ్ విదేశాల్లో తన తొలి ఐదు వికెట్ల పతకాన్ని అందుకున్నాడు. [25]

2018 నవంబరులో, వెస్టిండీస్‌తో జరిగిన రెండవ టెస్టులో 12–117 తో మిరాజ్, టెస్టుల్లో బంగ్లాదేశ్ బౌలర్ ద్వారా అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలు సాధించాడు.[26]

2021 ఫిబ్రవరి 4న, వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో, మిరాజ్ టెస్టు క్రికెట్‌లో తన తొలి సెంచరీ సాధించాడు. అతను 103 పరుగులు చేసి రహ్కీమ్ కార్న్‌వాల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. [27]

2022లో అన్ని ఫార్మాట్లలో బంగ్లాదేశ్ తరపున మిరాజ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు [28] [29] 2022 డిసెంబరులో అతను, 2022 సంవత్సరానికి విస్డెన్ పురుషుల వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో ఎంపికయ్యాడు [30] [31]

ట్వంటీ20 ఇంటర్నేషనల్ మార్చు

2017 ఏప్రిల్‌లో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో మిరాజ్‌ని చేర్చారు. [32] అతను 2017 ఏప్రిల్ 6 న శ్రీలంకపై బంగ్లాదేశ్ తరపున T20I రంగప్రవేశం చేసాడు [33]

2018 ఏప్రిల్‌లో, 2018 సీజన్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (BCB) ద్వారా సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన పది మంది క్రికెటర్లలో మిరాజ్ ఒకడు. [34]

మూలాలు మార్చు

  1. "Mahedi Hasan profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.
  2. "Mehedi Hasan". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.
  3. "Mehedi Hasan". CricketArchive. Archived from the original on 1 May 2019. Retrieved 9 July 2015.
  4. "Miraz ton guides Bangladesh to 430, WI 75/2 at stumps". Dhaka Tribune. 4 February 2021. Retrieved 6 December 2022.
  5. Isam, Mohammad (13 February 2021). "Mehidy Hasan Miraz becomes fastest Bangladesh bowler to 100 Test wickets". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.
  6. "Men's ODI Bowling Rankings". International Cricket Council. Retrieved 6 December 2022.
  7. "Mehidy Hasan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz. Retrieved 6 December 2022.
  8. "PM orders building of house for Miraz". Daily Sun. 3 November 2016. Archived from the original on 6 డిసెంబర్ 2022. Retrieved 6 December 2022. {{cite news}}: Check date values in: |archive-date= (help)
  9. 9.0 9.1 নতুন ক্রিকেট তারকা: কে এই মেহেদী হাসান মিরাজ?. BBC Bangla (in Bengali). 31 October 2019. Retrieved 6 December 2022.
  10. "Cricketers escape NZ mosque shooting". Cricket Australia. 15 March 2019. Retrieved 6 December 2022.
  11. "Bangla cricketer Mehidy Hasan ties the knot after surviving New Zealand terror attacks". Business Standard. Press Trust of India. 4 June 2019. Retrieved 6 December 2022.
  12. মিরাজের প্রেম-বিয়ে...এ যেন সিনেমা!. Prothom Alo (in Bengali). Retrieved 6 December 2022.
  13. "Bangladesh cricketer marries after surviving New Zealand mosque horror". Hindustan Times. 22 March 2019. Retrieved 6 December 2022.
  14. Isam, Mohammad (23 December 2015). "Mehedi Hasan to lead Bangladesh at U19 WC". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.
  15. "Bangladesh ace tense chase to secure third place". ESPNcricinfo. ESPN Inc. 13 February 2016. Retrieved 6 December 2022.
  16. "ICC Under-19 World Cup, Final: India Under-19s v West Indies Under-19s at Dhaka, Feb 14, 2016". ESPNcricinfo. ESPN Inc. 14 February 2016. Retrieved 6 December 2022.
  17. "Most runs". ESPNcricinfo. ESPN Inc. Archived from the original on 8 February 2016. Retrieved 14 February 2016.
  18. "Most wickets". ESPNcricinfo. ESPN Inc. Archived from the original on 11 February 2016. Retrieved 14 February 2016.
  19. "England tour of Bangladesh, 1st Test: Bangladesh v England at Chittagong, Oct 20 ,2016". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.
  20. Seervi, Bharath (20 October 2016). "Mehedi continues a debut trend, Bairstow's record year". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.
  21. Sundararaman, Gaurav (30 October 2016). "England's collapse and Mehedi's record series debut". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.
  22. "Best in first". ESPNcricinfo. ESPN Inc. 30 October 2016. Retrieved 6 December 2022.
  23. "Mehedi Hasan, Shakib script historic Bangladesh win". Cricbuzz. 21 February 2017. Retrieved 6 December 2022.
  24. "A new home for Mehedi". ESPNcricinfo. ESPN Inc. 4 November 2016. Retrieved 6 December 2022.
  25. "Mehidy leads Bangladesh fightback against Windies". Jamaica Observer. 13 July 2018. Archived from the original on 8 January 2022. Retrieved 13 July 2018.
  26. "3rd Test: Mehidy Hasan's record 12 spin Bangladesh to biggest win over West Indies". Cricket Country. 2 December 2018. Retrieved 6 December 2022.
  27. Ahmed, Syed Faiz (4 February 2021). "Miraz ton guides Bangladesh to 430". Dhaka Tribune. Retrieved 6 December 2022.
  28. "২০২২ সালে বাংলাদেশ দলের সর্বোচ্চ উইকেট শিকারি মিরাজ". Sharebazarnews (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-31.
  29. Jubair, Muhammad. "'There is a lot more left for me to achieve'". Prothomalo (in ఇంగ్లీష్). Retrieved 2022-12-31.
  30. Staff Correspondent. "Miraz named in Wisden ODI team of the year". Prothomalo (in ఇంగ్లీష్). Retrieved 2022-12-31.
  31. Gardner, Ben (2022-12-30). "2022 In Review: Wisden's Men's ODI Team Of The Year". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-12-31.
  32. "Uncapped Mohammad Saifuddin in Bangladesh T20I squad". ESPNcricinfo. ESPN Inc. 1 April 2017. Retrieved 6 December 2022.
  33. "Bangladesh tour of Sri Lanka, 2nd T20I: Sri Lanka v Bangladesh at Colombo (RPS), Apr 6, 2017". ESPNcricinfo. ESPN Inc. 6 April 2017. Retrieved 6 December 2022.
  34. Isam, Mohammad (18 April 2018). "BCB cuts contracts list for 2018 to ten". ESPNcricinfo. ESPN Inc. Retrieved 6 December 2022.