మేదరి ఇది వెనుక బడిన కులం. మహేంద్ర అని కూడా అంటారు. వెదురుతో తట్టలు, బుట్టలు చేస్తారు. వెదురుతో వేయి లాభాలన్నారు. వెదురు బొంగులు తీసుకొచ్చి వాటిని తట్టలు, గంపలు, నిచ్చెనలు, రేషం తట్టలు, చంద్రింకలు తదితర వస్తువులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ప్లాస్టిక్‌ వస్తువులు విరివిగా అందుబాటులోకి రావడం ఎక్కడ వేసినా ఇబ్బంది లేక పోవడంతో విరివిగా ప్లాస్టిక్‌ల మీదే ప్రజలు మోజు పడుతూ వాటి మీద ఆదరణ చూపుతున్నారు. గతంలో వెదురు తడికలు, వెదురు నిచ్చెనలు విరివిగా వాడేవారు. ప్లాస్టిక్‌ రావడంతో రేషం తట్టలు, మైలబట్టల బుట్టలు, ఇనప నిచ్చెనలు అందుబాటులోకివచ్చి మేదరుల కుల వృత్తి దెబ్బతింది. వీరు keteswara swami, మల్లీశ్వరి దేవి లేదా మల్లేలమ్మ గా పూజిస్తూ, ప్రతి ఏడు బోనాలు సమర్పించి జాతర నిర్వహిస్తారు.

మేదరులు తమకు అవసరమైన వెదురు కోసం అడవి మీద ఆధార పడతారు కాబట్టి , దేశము లోని అన్ని రాష్ట్రములలో SC/ST లుగా ఉన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో మాత్రమే BC లుగా పరిగణించ బడుతున్నారు. మేదరి వారు వెనుకబడి పోవుటకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కారణం. రాష్ట్రప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం అందక క్రమముగ వెనుకబడి పోయారు. దీనికి రాష్ట్రప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించవలసియున్నది. మేదరి వారు కనీసము ఒక మునిసిపల్ వార్డుకు కూడా ప్రాతినిధ్యం వహించకపోవడం మన అగ్ర కులాల రాజకీయాలకు నిదర్శనం.

మేదరి వారు అల్లిన బుట్టలు, తట్టలు, చాటలు, ఇతర అందమైన అలంకార వస్తువులు., చాదర్ ఘాట్ రోడు ప్రక్కన తీసిన చిత్రం

వీరు వెదురు బద్దలతో తట్టలు, బుట్టలు చాటలు దాన్యాన్ని నిలవ చేసే బొట్టలు ఎద్దుల బండికి వేసే మక్కిన వంటివి అల్లు తారు. గతంలో అడవులలో వున్న వెదుర్లను కొట్టి తెచ్చి తట్టలు బుట్టలు అమ్మేవారు. అప్పట్లో బొట్టలు, మక్కెనలు, వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగా వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ కాలంలో అడవులకు వెళ్లే పరిస్థితి లేకున్న రైతుల పొలాల గట్టులందు కావలసినన్ని వెదుర్లు ఉన్నాయి. ఆయినా వీరు ఎక్కువగా లేరు. అక్కడక్కడ వున్న వారు తట్టలు బుట్టలు చేసి సంతలలో అమ్ము తున్నారు. వీరు కనుమరుగైనారు. ప్రస్తుతం వెదురు బద్దలతో చేసిన అనేక వస్తువులు పట్టణాలలో అమ్ముతున్నారు. ఇటు వంటి వస్తువుల తయారి తోనైనా ఈ మేదర వృత్తి వారు కొంతవరకు బతుకు వెళ్లదీస్తున్నారు.

మేదరి వృత్తులపై కవితలు

మార్చు
  • “కృతజ్ఞతలు ఈతసాప “

“ఏ యునివర్సిటీలోనూ చదవలేదు కళావిద్య అంటే అస్సలే ఎరుగదు అయినా అమ్మ ఈతసాపను ఎంత నైపుణ్యంగా అల్లుతుందో! గిజిగాడు గూడును అల్లినట్టు!!

చెట్టు చెట్టుకు దండం బెట్టి మంచి మంచి ఆకుల్ని కోసుకొచ్చి ,మోసుకొచ్చి సూర్యునికోసారి చూపించి, నానబెట్టేది

ఈతసాప అల్లడం చదువుకంటే గొప్పవిద్దే !! ఎన్నో మాటల్ని,మరెన్నో మమతల్ని ఎన్నో నవ్వుల్ని,మరెన్నో కన్నీళ్ళను ఆరాకుల ఈతసాపలో కలిపికుట్టేది

ఎక్కడైనా ఈతచెట్టు కనబడితే మా ఊర్లోని పేదతల్లులంతాగ ప్రతీ ఆకుపై కన్పిస్తారు నిరుపేదల చెమటచుక్కలతో కాపీ రాయబడిన కావ్యం కదా ఈతసాప!

మాకు సాయంత్రమంటే ఆకాశంలోకి సందమామ రావడం కాదు వాకిట్లోకీ ఈతసాప రావడమే! ముండ్లని గుండెల్లో దాచుకొని ఏ బాధలేనట్టుగా నవ్వుతూ కనిపించేది పల్లెటూరి ఆడపడుచులా!

నేలమ్మా! ఈతసాప లేదని పొక్కిలిపొక్కిలై దుఃఖిస్తున్నావా?

మళ్ళీ ఈతసాప బతికినట్టు ఈతసాపతో కాలగర్భంలో కలిసిపోయిన అప్పటి ప్రేమలన్నీ బతికినట్టు తెల్లారుగట్లల్ల కలొచ్చింది కల నిజమైతే ఎంత బాగుండూ..” ...తగుళ్ళ గోపాల్


మూలాలు

మార్చు

/* మూలాలు */ ఎరుకల వారి బుట్టల ఫోటో ఉంచారు....మేదరి బుట్టల ఫోటో పంపమంటారా..... () డా.రామయ్య, తలంగాణ రాష్ట్ర మేదరి సంఘం, రాష్ట్ర కన్వినర్

"https://te.wikipedia.org/w/index.php?title=మేదరి&oldid=3852779" నుండి వెలికితీశారు