మైండ్‌ట్రీ
మైండ్ ట్రీ (Mindtree Ltd) సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ & సర్వీసెస్ అందచేసే కంపెనీ. మైండ్ ట్రీ సంస్థను 1999 సంవత్సరంలో మూడు వేర్వేరు దేశాల నుండి వచ్చిన 10 మంది నిపుణులతో కూడిన వైవిధ్యమైన బృందంచే ప్రారంభించబడింది, సంస్థ వ్యవస్థాపకులు అశోక్ సూటా, కృష్ణకుమార్ నటరాజన్, సుబ్రతో బాగ్చి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రశంసలు పొందిన కంపెనీల్లో సంస్థను నిర్మించాలనే తపన, సంస్థ వ్యాపారం చేసే విధానంలో ఉన్నది.[1]
ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉంది. మైండ్ ట్రీ లిమిటెడ్ లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ అనుబంధ సంస్థ (సబ్సిడరీ యూనిట్).[2]
దస్త్రం:Mindtree logo.svg | |
రకం | పబ్లిక్ |
---|---|
వర్తకం చేయబడింది | |
ISIN | INE018I01017 |
పరిశ్రమ | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్ ఔట్ సోర్సింగ్ |
స్థాపించబడింది | 18 ఆగస్టు 1999 |
స్థాపకుడు | అశోక్ సూటా సుబ్రతో బాగ్చి కృష్ణకుమార్ నటరాజన్ పార్థసారథి ఎన్.ఎస్. స్కాట్ స్టేపిల్స్ అంజన్ లాహిరి కళ్యాణ్ కుమార్ బెనర్జీ జానకిరామన్ కమ్రాన్ ఒజైర్ రోస్టో రావణన్ |
ప్రధాన కార్యాలయం | గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్, , భారతదేశం |
పనిచేసే ప్రాంతాలు | ప్రపంచ వ్యాప్తంగా |
ప్రధాన వ్యక్తులు |
|
ఆదాయం | ![]() |
మూస:Up ₹1,953.5 crore (US$240 million) [5] (2022) | |
మూస:Up ₹1,652.9 crore (US$210 million) [5] (2022) | |
మొత్తం ఆస్థులు | ![]() |
మొత్తం ఈక్విటీ | ![]() |
ఉద్యోగుల సంఖ్య | 38,518 (July 2022) |
మాతృసంస్థ | లార్సెన్ & టూబ్రో (61.08%) [7] |
జాలస్థలి | www |
చరిత్రసవరించు
మైండ్ ట్రీ 1999 ఆగస్టు 5న మైండ్ ట్రీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గా స్థాపించబడింది. కేంబ్రిడ్జ్ టెక్నాలజీ పార్టనర్స్, లుసెంట్ టెక్నాలజీస్, విప్రో నుండి వచ్చిన 10 మంది పరిశ్రమ నిపుణులు ప్రారంభించారు. 2000 సంవత్సరం జనవరిలో, ప్రమోటర్లు, వాల్డెన్ సాఫ్ట్ వేర్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్ (వాల్డెన్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహించబడుతున్న) అమాల్గేటెడ్ హోల్డింగ్స్ లిమిటెడ్, వైతర్నా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ప్రమోట్ చేయబడ్డ ప్రమోటర్ కంపెనీ అయిన ఎల్ ఎస్ ఓ (LSO) ఇన్వెస్ట్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మొదటి రౌండ్ ఫండింగ్ లో కంపెనీ ఈక్విటీ షేర్లకు సబ్ స్క్రిప్షన్ ద్వారా రూ. 169 మిలియన్ల పెట్టుబడి చేయబడింది. 2001 సంవత్సరంలో (ఆగస్టు) గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్ లిమిటెడ్, వాల్డెన్ సాఫ్ట్ వేర్ ఇన్వెస్ట్ మెంట్స్ లిమిటెడ్, క్యాపిటల్ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ LP ద్వారా రెండవ రౌండ్ ఫండింగ్ లో పెట్టుబడి పెట్టింది, అదే సంవత్సరం 2001 డిసెంబరులో కంపెనీ వోల్వో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఐటి అవుట్ సోర్సింగ్ భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. మైండ్ ట్రీ 2003 సంవత్సరంలో పీపుల్ కెపాసిటీ మెచ్యూరిటీ మోడల్ (P-CMM) లెవల్ 5 కంపెనీగా గుర్తింపు అయినది, 2004 సంవత్సరంలో కంపెనీ CMMi లెవల్ 5 కంపెనీగా మదింపు చేయబడింది. భారతదేశంలోనే గాక, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, జపాన్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, జర్మనీ, స్విట్జర్లాండ్, స్వీడన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), నెదర్లాండ్స్, కెనడా, బెల్జియం, ఫ్రాన్స్, ఐర్లాం, డ్ పోలాండ్, చైనాలో కార్యాలయాలను కలిగి ఉంది.[8]
సేవలుసవరించు
మైండ్ ట్రీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. అప్లికేషన్ డెవలప్ మెంట్ అండ్ మెయింటెనెన్స్, డేటా ఎనలిటిక్స్, ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్, టెస్టింగ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ మెంట్, ఐటి స్ట్రాటజీ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ వంటి సేవలు సంస్థ అందచేస్తుంది. రిటైల్, సిపిజి, మాన్యుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్, టెక్నాలజీ అండ్ మీడియా, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ అండ్ హెల్త్ కేర్ అనే నాలుగు ఇండస్ట్రీ విభాగాలుగా చేసుకొని తన వ్యాపార నిర్వహణ చేస్తుంది. కంపెనీ అధిక ఆదాయం (ఇతర సెగ్మెంట్ల కంటే) టెక్నాలజీ, మీడియా సేవల (సెగ్మెంట్) నుంచి ఎక్కువ వస్తుంది. ఈ సంస్థ యునైటెడ్ స్టేట్స్ నుండి అధిక శాతం ఆదాయాన్ని పొందుతున్నది[9].
అవార్డులుసవరించు
24 దేశాలలో 32,000 కంటే ఎక్కువ మంది ప్రతిభావంతులైన, వ్యవస్థాపక నిపుణులచే నడుపబడుతున్న, మైండ్ ట్రీ - ( లార్సెన్ & టూబ్రో గ్రూప్ కంపెనీ) పనిచేయడానికి ఉత్తమ ప్రదేశాలలో స్థిరంగా గుర్తించబడింది. మైండ్ ట్రీ వినియోగదారుల (కస్టమర్) సవాళ్లను పరిష్కరించడానికి నైపుణ్యాలు, ముందుకు చూసే దృక్పథాలను తెస్తుంది.[10]
అవార్డులు
- 2021 సంవత్సరంలో మైండ్ ట్రీ 2021-22 సంవత్సరానికి భారతదేశంలో పనిచేయడానికి® గ్రేట్ ప్లేస్ గా సర్టిఫికేట్ పొందింది
- ఆంబియంబాక్స్ ద్వారా భారతదేశంలో పనిచేయడానికి ఉత్తమ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
- 2020 సంవత్సరంలో ది అసోసియేటెడ్ ఛాంబర్స్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) వారి డైవర్సిటీ అండ్ ఇన్ క్లూజన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అండ్ కాన్ క్లేవ్, 2020లో "బెస్ట్ ఎంప్లాయర్ ఫర్ ఉమెన్" (లార్జ్) కేటగిరీ.
- 2019 సంవత్సరంలో 2019-20లో 'ఎక్సలెన్స్ ఇన్ డైవర్సిటీ & ఇంక్లూజన్' మరియు 'లెర్నింగ్ టెక్నాలజీ'కు బిజినెస్ వరల్డ్ హెచ్ ఆర్ ఎక్సలెన్స్ అవార్డులు
- 2019-20లో 'మోస్ట్ ఇన్నోవేటివ్ నాలెడ్జ్ ఎంటర్ప్రైజ్'గా సీఐఐ మైక్ అవార్డులు
- 2019-20లో కోర్సెరా ద్వారా ఎంటర్ ప్రైజ్ లెర్నింగ్ పార్టనర్ అవార్డు
మూలాలుసవరించు
- ↑ "MindTree - Crunchbase Company Profile & Funding". Crunchbase (in ఇంగ్లీష్). Retrieved 2022-11-15.
- ↑ "About MindTree Ltd (MINT)". Investing.com India (in Indian English). Retrieved 2022-11-15.
- ↑ "Mindtree Leadership". Archived from the original on 19 January 2016. Retrieved 18 January 2016.
- ↑ "mindtree-appoints-cognizant-s-debashis-chatterjee-as-new-ceo". livemint. Archived from the original on 5 August 2019. Retrieved 5 August 2019.
- ↑ 5.0 5.1 5.2 "Mindtree Profit & Loss account, Mindtree Financial Statement & Accounts". www.moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-25.
- ↑ 6.0 6.1 "Mindtree Consolidated Balance Sheet, Mindtree Financial Statement & Accounts". www.moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-25.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;parent
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Mindtree Ltd". Business Standard India. Retrieved 2022-11-15.
- ↑ "MindTree Company Profile: Stock Performance & Earnings | PitchBook". pitchbook.com (in ఇంగ్లీష్). Retrieved 2022-11-15.
- ↑ www.ambitionbox.com. "Mindtree Overview and Company Profile". AmbitionBox (in ఇంగ్లీష్). Retrieved 2022-11-15.