మై ఫార్చూన్, చెన్నై

మై ఫార్చూన్, చెన్నై అనేది చెన్నై నగరంలోని విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్ భారతదేశంలోని చెన్నై నగరంలో గల క్యాథడ్రిల్ రహదారిలో ఈ హోటల్ ఉంది. గతంలో దీన్ని హోటల్ చోలా షెరటాన్ గా పిలిచేవారు. ఐటీసీ యొక్క బ్రాండ్ అయిన “మై ఫార్చూన్” పేరుతో ఏర్పాటైన మై ఫార్చూన్- చెన్నై అనేది తొలి హోటల్ కావడం విశేషం. పర్యావరణ నిర్వహణ పద్దతుల వల్ల మై ఫార్చూన్, చెన్నై హోటల్ ఐఎస్ఓ14001– సర్టిఫైడ్ హోటల్ గా గుర్తింపు పొందింది. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ లైసెన్స్ పొందిన హోటళ్లలో ఇదీ ఒకటి.

My Fortune, Chennai
Formerly Chola Sheraton
హోటల్ చైన్ITC Welcomgroup Hotels, Palaces and Resorts
సాధారణ సమాచారం
ప్రదేశంIndia
చిరునామా10, Cathedral Road, Chennai, Tamil Nadu 600 086, India
ప్రారంభం18 October 1975
యాజమాన్యంITC Welcomgroup Hotels, Palaces and Resorts
ఎత్తు39.75 మీ. (130.4 అ.)[1]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య10
ఇతర విషయములు
గదుల సంఖ్య90
జాలగూడు
Fortunehotels.in

చరిత్ర

మార్చు

చోలా షెరిటాన్ హోటల్ (తమిళ్: சோழா ஷெரட்டன்) పేరుతో అక్టోబరు, 18, 1975లో ఇక్కడ మొదట హోటల్ ప్రారంభించబడింది. దీనితోనే ఐ.టి.సి. లిమిటెడ్ సంస్థ హోటల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.[2] అక్టోబర్ 15, 2011లో ఈ హోటల్ ను ఆధునీకరించి ఫార్చూన్ పార్క్ హోటల్స్ లిమిటెడ్ కింద "మై ఫార్చూన్, చెన్నై" పేరుతో పునర్ ముద్ర వేశారు.[3]


ది హోటల్

మార్చు

హోటల్ ప్రారంభినంచినప్పటి నుంచి ఇప్పటి వరకు అధునాతన సేవలతో అందరి ఆదరాభిమానాలు పొందుతోంది. 10 అంతస్థులు గల ఈ హోటల్ లో మొత్తం 90 విశాలమైన గదులున్నాయి. వీటిలో 48 ఫార్చూన్ క్లబ్ ప్రత్యేక గదలు(ఒక్కొక్కటి 650 చదరపు అడుగుల వైశాల్యంతో) ఉన్నాయి. మరో 26 ఫార్చూన్ క్లబ్ గదులు (ఒక్కొక్కటి 440 చదరపు అడుగుల వైశాల్యంతో) ఉన్నాయి. ఇంకో 16 ప్రామాణిక గదులు(ఒక్కొక్కటి 220 చదరపు అడుగుల వైశాల్యం)తో ఉన్నాయి. బంకమట్టితో తయారు చేసిన ఓవెన్లు, ఉత్తర భారత దేశానికి చెందిన ప్రత్యేకమైన రెస్టారెంట్, మై కేఫ్, 24 గంటల పాటు అందుబాటులో ఉండే మల్టీ క్యుషైన్ రెస్టారెంట్, మై డెలీ, స్నాక్స్ సహా ఆహారం, బ్రేవరేజెస్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ హోటల్ సొంతం. ఈ హోటల్లో దురంత్ యొక్క బార్ కూడా ఉంది. మద్రాస్ సంస్థానంలోని మొదటి మద్యం వ్యాపారి-1863 దురంత్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ బార్ లో అత్యున్నత, నాణ్యత కలిగిన స్పిరిట్స్ లభిస్తాయి. అంతాకాదు. ఈ బార్ లో స్వాంత్వన పొందడానకి ఎంతో అనువైన వాతావారణం ఉంటుంది.[4]

ఈ హోటల్లో మూడు సమావేశ మందిరాలు—మండపం, 200 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉండే 1,880 చదరపు అడుగుల వైశాల్యం గల బాంకెట్ హాల్ ఉన్నాయి. అదేవిధంగా 60 మందికి సరిపోయే 1,400 చదరపు అడుగులు గల సగరి ఉంది. 480 చదరపు అడుగుల వైశాల్యం గల మండపం బోర్డు గదిలో 18 మంది కూర్చోవచ్చు. ఇక్కడ వ్యాపార సెంటర్ బోర్డు 238 చదరపు అడుగుల విస్తీర్ణంతో గల గదిలో 8 మంది సమావేశం కావడానికి అనువుగా ఉంటుంది. 156 చదరపు అడుగుల వైశాల్యం గల బిజినెస్ సెంటర్ ఆఫీస్ లో 4 గురు సమావేశం కావచ్చు. అదేవిధంగా పూల్ వైపున మరో 50 మందికి సదుపాయాలు ఏర్పాటు చేసే

వీలుంది. ఈ విధంగా హోటల్లో వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన వైశాల్యాల్లో గదులు అందుబాటులో ఉన్నాయి.[5] ఒక్క మాటలో చెప్పాలంటే మై ఫార్చూన్ చెన్నై హోటల్ అనేది యాత్రికులకు ఎన్నో విధాల సదుపాయాలు అందించే హోటల్ గా చెప్పుకోవచ్చు. సమావేశాలు, విందులు, క్రీడా-వినోద సదుపాయాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్, మసాజ్ సెంటర్ వంటి ఎన్నోవిధాలసౌకర్యాలు, మానసిక ప్రశాంతతను కలిగించే వాతావరణం ఈ హోటల్ సొంతం. 24 గంటల పాటు నడిచే మల్టీ క్యుసైన్ మై కేఫ్ రెస్టారెంట్ లో బఫెట్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటి సదుపాయాలుంటాయి.

లొకేషన్

మార్చు

మై ఫార్చూన్ చెన్నై హోటల్ అనేది చెన్నైలోని యు.ఎస్.కన్సోలేట్ కు కేవలం 0.5 కి.మీ. దూరంలో ఉంటుంది. అంతేకాదు టి.నగర్, మెరినా బీజ్, అన్నాసాలై ప్రాంతాలనుంచి అతి కొద్దిదూరం ప్రయాణిస్తే హోటల్ కు చేరుకోవచ్చు. టి.నగర్(వ్యాపార సముదాయం) నుంచి సుమారు 4 కి.మీ., అన్నాసాలై/ మౌంట్ రోడ్ నుంచి సుమారు 7 కి.మీ., మెరినా బీజ్ నుంచి సుమారు 3 కి.మీ. దూరంలో ఈ హోటల్ ఉంటుంది. అదేవిధంగా కపిలేశ్వర్ ఆలయానికి 4 కి.మీ., యు.ఎస్. కన్సోలేట్ నుంచి సుమారు 1 కి.మీ.దూరంలోనే ఇది ఉంటుంది. అంతేకాదు. అన్నా అంతర్జాతీయ విమానాశ్రయం /దేశీయ విమానాశ్రయం నుంచి 15 కి.మీ(సుమారు), చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 8 కి.మీ.,(సుమారు), ఎగ్ మోర్ రైల్వే స్టేషన్ నుంచి 7 కి.మీ.(సుమారు) దూరంలో ఈ హోటల్ ఉంటుంది.

సూచనలు

మార్చు
  1. "Chola Sheraton". Emporis.com. Retrieved 20 Nov 2011.
  2. "About us". ITC Hotels. nd. Archived from the original on 8 జనవరి 2011. Retrieved 4 Dec 2011.
  3. Ravikumar, R. (20 October 2011). "WelcomeHotel Sheraton Chola in Chennai gets Fortune tag". The Hindu Business Line. Chennai: The Hindu. Retrieved 20 Nov 2011.
  4. "My Fortune Chennai". cleartrip.com.
  5. "My Fortune, Chennai—Factsheet" (PDF). Fortune Hotels. Archived from the original (PDF) on 13 జనవరి 2012. Retrieved 20 Nov 2011.

బయటి లింకులు

మార్చు