మొక్కపాటి సుబ్బారాయుడు

మొక్కపాటి సుబ్బారాయుడు, (1879 - 1918) పరిపాలనా దక్షుడు, పండితుడు. ప్రఖ్యాత హాస్యరచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి ఈయన సహోదరుడు.ఇతను 1879 సంవత్సరం సెప్టెంబరు 8 తేదీన జన్మించాడు. ఈయన ముత్తాత షట్ఛాస్త్రవేత్త, శ్రౌతి అయి పెద్దాపురం రాజా వత్సవాయి విద్వత్తిమ్మ జగపతి మహారాజు వద్ద మొగలితుర్రు సంస్థానంలో అఖండ రాజ గౌరవాలు పొందాడు. తాత సదాశివశాస్త్రి నాలుగు శాస్త్రాలలో పండితుడు. తండ్రి తపశ్శాలి అనీ, అన్నప్రదాత అని కీర్తిపొందాడు. విద్యాధికుడు, పిఠాపురం సంస్థానంలో దివానుగా ఉండి పలువురికి ఉపకారాలు చేశాడు. ఆ కాలంలో పీఠికాపురాధీశుల సమస్త ధర్మకార్యాలకు ఇతని ప్రోత్సాహమే ప్రధానమైన కారణము.

మొక్కపాటి సుబ్బారాయుడు
మొక్కపాటి సుబ్బారాయుడు
జననం
మొక్కపాటి సుబ్బారాయుడు

(1879-09-08)1879 సెప్టెంబరు 8
మరణం1918 డిసెంబరు 12(1918-12-12) (వయసు 39)
వృత్తిదీవాన్, పిఠాపుర సంస్థానము
ఉద్యోగంరావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
బంధువులుమొక్కపాటి నరసింహశాస్త్రి

న్యుయింగ్టన్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన మొక్కపాటి సుబ్బారాయుడు పిఠాపురం రాజా రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు బహదూర్‌కు బాల్యంలో సత్ప్రవర్తన, ఆంగ్ల, ఆంధ్ర భాషలను బోధించాడు. సుబ్బారాయుడు మహారాజుకు కార్యదర్శిగా నియమితులయ్యాడు. 1906లో వారసత్వ వివాదాలలో రాజా విజయం సాధించిన తరువాత 1907లో పట్టాభిషిక్తుడై సుబ్బరాయుడు దివాన్‌గా నియమించాడు. ఇతడు మహామంత్రి తిమ్మరుసు మాదిరిగా పిఠాపురం సంస్థానానికి వైభవాన్ని, రాజు సూర్యారావుకు ఘనకీర్తిని సముపార్జీంచి పెట్టాడు. కోర్టు కమీషనరు వద్ద నుండి లభించిన లక్షలాది రూపాయలను సుబ్బారాయుడు, ప్రజాసంక్షేమం, సంఘసంస్కరణలు, అనాథ శరణాలయాలు, విద్యావ్యాప్తి, అన్నదానం, సాహిత్య పోషణ కోసం రాజు చేత ఒప్పించి ఖర్చు చేయించాడు. మొక్కపాటి పాలనాకాలంలో ఉఛ్ఛదశకు చేరిన సంస్థానం ఇతని నిష్క్రమణ తరువాత పతన దిశగా పరుగులు తీసింది.హరిజనోద్దరణ, మధ్య నిషేధం, మహిళా వికాసం, హరిజన హాస్టల్, ఉచిత విద్యలు వంటి అనేక సంస్కరణలను దేశంలోని అనేక ప్రాంతాలకంటే చాలా కాలం ముందే పిఠాపురం సంస్థానంలో అమలుచేసిన ఘనత ఇతనిదే.

ఇతను 1918 సంవత్సరం డిసెంబరు 12 తేదీన పరమపదించాడు.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు