మొగలిరేకులు జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు డైలీ ధారావాహిక. బిందునాయుడు రచన, మంజులానాయుడు దర్శకత్వంలో 2008, ఫిబ్రవరి 18 నుండి 2013, మే 24 వరకు ప్రసారమయింది.[2] ఐదు సంవత్సరాలపాటు ప్రసారమైన ఈ ధారావాహికలో సాగర్, షీలా, ఇంద్రనీల్, మేధా ప్రధాన పాత్రల్లో నటించారు.[3][4][5][6] ఇది చక్రవాకం తరువాత జెమినీ టీవీలో ఎక్కువకాలం ప్రసారమై అత్యంత ప్రజాదరణ పొందిన ధారావాహికగా నిలిచింది.[7][8] ప్రేక్షకుల కోరిక మేరకు 2016, మే 6 నుండి మధ్యాహ్నం గం. 1:30 ని.లకు జెమిని టివిలో పునఃప్రసారం చేస్తున్నారు.

మొగలిరేకులు
మొగలిరేకులు సీరియల్ టైటిల్
సృష్టి కర్తశ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్
రచయితయద్దనపూడి సులోచనారాణి (మూలకథ)
మంజులానాయుడు, బిందునాయుడు (కథ)
బిందునాయుడు (కథనం, మాటలు)
దర్శకత్వంమంజులానాయుడు
తారాగణంసాగర్
షీలా సింగ్
లిఖితా కామినీ
కరుణ
రవివర్మ
ముక్తర్
శృతి
Theme music composerబంటి[1]
Opening themeమొగలిరేకులు
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల2 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య1,368
ప్రొడక్షన్
Producersసుధాకర్ పల్లమాల
శశాంక్ పల్లమాల
ఎడిటర్రామ్
కెమేరా సెట్‌అప్బాబా, రవి చేపూరి
నడుస్తున్న సమయం15-20 నిముషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
వాస్తవ విడుదల18 ఫిబ్రవరి 2008 –
24 మే 2013
కాలక్రమం
Preceded byచక్రవాకం
Followed byశ్రావణ సమీరాలు

వేర్వేరు సందర్భాల్లో జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న ఐదుగురు అనాథల కథ ఇది. ఈ ధారావాహిక పగ నేపథ్యంలో సాగుతుంది. సీజన్ 1లో ఐదుగురు అనాథలలో పెద్దవాడైన ధర్మా తనకంటే చిన్నవాళ్ళు అయిన సత్య, దయా, శాంతి, కీర్తనల బాగోగులు చూసుకుంటూ తన తల్లిదండ్రుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంటాడు. ఈ కథలో చాలా మలుపులు, సామాజిక బాధ్యతలపై స్పందనలు ఉన్నాయి. సీజన్ 2లో వారి పిల్లలు మహీధర్ నాయుడు/మున్నా, దేవి, దుర్గా, పల్లవి, ఈశ్వర్, సింధుల నేపథ్యంలో కథ సాగుతుంది.

సారాంశం

మార్చు

ధర్మా, సత్య, దయా అనే ముగ్గురు యువకులతో, వారి చిన్న చెల్లెలు శాంతితో ఈ ధారావాహిక కథ ప్రారంభమవుతుంది. వారి తల్లిదండ్రులు, అమ్మమ్మను వారి సవతి అమ్మమ్మ, మేనమామలు హత్య చేస్తారు. పొరుగింటి పాప కీర్తనతో కలిసి హైదరాబాదుకు బయలుదేరాలని నిర్ణయించుకుంటారు. కాని ముగ్గురు అన్నలు, కీర్తన హైదరాబాదుకు చేరుకుంటారు, వారి సోదరి శాంతి సోదరుల నుండి విడిపోయి మామయ్య, సవతి అమ్మమ్మతో కలిసి జీవిస్తుంది.

కథానాయకుడు ఎసిపి ఆర్కె నాయుడు (తరువాత డిజిపి, ముంబై) కఠినమైన, డైనమిక్, బాధ్యతాయుతమైన ఐపిఎస్ అధికారి, శాంతిని మామ, బామ్మల బారి నుండి కాపాడిన తరువాత ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆర్కె, సెల్వా మధ్య శత్రుత్వాన్ని తెచ్చే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే సెల్వా స్వామిని ధర్మా కలుస్తాడు.

ఎన్నో అపార్థాల తరువాత ధర్మా, శాంతి సోదరుడని తెలుసుకున్న ఆర్కె, ధర్మా నిజాయితీగల మనిషి అని స్నేహితుడు సెల్వాకు అతని కార్యకలాపాలలో సహాయం చేస్తున్నాడని నిర్ధారణకు వస్తాడు. శాంతి తల్లిదండ్రుల మరణానికి కారణమైన వారిని పట్టుకుంటానని ఆర్.కె., ధర్మాకు వాగ్దానం చేస్తాడు. ధర్మా, కీర్తన, సెల్వాల మధ్య ముక్కోణపు ప్రేమకథ గందరగోళంగ ఉంటుంది. (ధర్మాని కాపాడినందుకు సెల్వను వివాహం చేసుకోవాలని కీర్తనను సెల్వా తల్లి బ్లాక్ మెయిల్ చేస్తుంది) ఫలితంగా ధర్మా, ఆర్కె, సెల్వాలకు తీవ్రమైన శత్రుత్వం ఏర్పడుతుంది. వారిని చంపడానికి బాంబు పేలుడు ప్రణాళికలు జరుగుతాయి. ఫలితంగా దయా, ఆర్కె, శాంతిలు చనిపోతారు. వారి కుమారుడు మహీధర్ నాయుడి మిగులుతాడు.

అటు తరువాత ధారావాహిక రెండవ తరానికి చేరుకుంటుంది. ఇందులో ఆర్కె నాయుడు కుమారుడు మున్నా (మహీధర్ నాయుడు) ను కథానాయుకుడిగా ఉంటాడు. బాంబు పేలుడు కారణంగా అనాథగా ఉన్న మహీధర్ నాయుడు, డాన్ సికందర్ భాయ్ చేత నేరపూరిత వాతావరణంలో పెరుగుతాడు. మున్నా సెల్వా మేనకోడలు అయిన దేవితో ప్రేమలో పడతాడు. దేవి, సెల్వా భార్య మీనాక్షిని పోలి ఉన్నందున తనతో అనుబంధం ఏర్పడిందని సెల్వా అనుకుంటాడు. అందువల్ల అతను తన పెద్ద కుమారుడు ఈశ్వర్‌కు దేవితో వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కొన్ని ఘర్షణల కారణంగా మున్నా, ఈశ్వర్ లు గొడవ పడుతారు. మున్నా, దేవి స్నేహితులు అవుతారు, పెళ్ళికి ముందు రోజు మున్నా పట్ల ఆమెకున్న నిజమైన భావాలను వెల్లడిస్తుంది. ఈశ్వర్, అతని అమ్మమ్మలను ఇబ్బంది పెడుతున్న కారణంగా ఈశ్వర్‌తో ఆమె వివాహం నిలిపివేయబడుతుంది. మున్నా, దేవి వివాహం చేసుకుంటారు. మున్నా తన నేర జీవితంలో భాగంగా డిజిపి ఆర్కెపై దాడి చేయడానికి కుట్ర పన్ని, అతని మంచి స్వభావం కారణంగా దాడి చేయకపోగా, ఆర్కె తన తండ్రి అని తెలుసుకుంటాడు. మున్నా తన తండ్రికి ఎదురుపడలేక తన గుర్తింపును దాచిపెట్టి, తన పేరును 'మహేంద్ర' గా మార్చుకుని, గ్రామీణ ప్రజలకు సేవ చేయడానికి ఏహెచ్ఎస్ అనే ఆరోగ్య సేవను ప్రారంభిస్తాడు. బాంబు పేలుడు నుండి ఆర్కె రక్షించబడి తిరిగి వస్తాడు. అతను దూరంగా ఉన్నప్పుడు, తన భర్త మున్నా తిరిగి వచ్చే వరకు తనకు రక్షణ అవసరమని చెప్పి తన గుర్తింపును దాచిపెట్టి ఆర్కె కుటుంబంతో కలిసి ఉండటానికి దేవి వెళ్తుంది. ఇంతలో, సెల్వా స్వామి ద్వారా మున్నా (మహీధర్) తన కుమారుడే అని అని ఆర్కే తెలుసుకుంటాడు. తల్లిదండ్రుల శత్రుత్వం గురించి తెలుసినా పల్లవి, దుర్గా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆర్కే కుటుంబం దేవిని తమ కోడలిగా అంగీకరిస్తుంది, దేవి గర్భం దాల్చుతుంది. సెల్వా కుమారుడు ధర్మా, సత్య కుమార్తెతో వివాహం చేసుకోవడం ద్వారా ఆర్కె & సెల్వా యొక్క రెండు కుటుంబాలు ఒకటి కావడంతో కథ ముగుస్తుంది. ధర్మా సజీవంగా ఉందని వారు తెలుసుకుంటారు.

నటీనటులు

మార్చు
పాత్ర నటులు
ఆర్.కె. నాయుడు సాగర్
మున్నా/మహీధర్ నాయుడు సాగర్
శాంతి షీలా
ధర్మ ఇంద్రనీల్
సెల్వ స్వామి సెల్వ రాజ్ & రవివర్మ
శంకర్ మధుసూధన్ రావు
దేవి లిఖితా కామినీ & కరుణ భూషణ్
గౌతమి శృతి
సికిందర్ భాయ్ ముక్తర్
ఈశ్వర్ పవన్ సాయి
దుర్గ రవికృష్ణ
అలీ హరికృష్ణ
సింధు శిరీష & మేధ
పల్లవి సోనియా
కీర్తన మేధ
సత్యవర్ధన్ రాజేష్
దయాసాగర్ పవిత్రనాథ్
శివ విజయ్ భార్గవ్
మహాలక్ష్మి వై. విజయ
అంజలి అంజలి
శంకర్ మధుసూధన్
మునియమ్మ నాగమణి
మహిధర్ హర్ష
మైమ్ మధు[9]

ఇతర వివరాలు

మార్చు
 1. ముళ్లు, పాముల మధ్య వికసించే పూల గురించి నర్మగర్భంగా... గందరగోళం, అయోమయంలో బతికే మనుషుల మధ్య ప్రేమ వికసించే తీరును ఈ ధారావాహికలో చూపబడింది.
 2. ఈ ధారావాహిక నడుస్తున్నంతకాలం రాష్ట్ర ప్రభుత్వ టీవి నంది అవార్డులతో పాటు అనేక సాంస్కృతిక సంస్ధల నుంచి అవార్డులు అందుకుంటూనే ప్రేక్షకాదరణతో మొదటి స్ధానాన్ని ఆక్రమించింది.
 3. ఇందులోని దేవి, సింధు పాత్రలకు పాత తారలను మార్చి కొత్త తారలను తీసుకున్నారు. లిఖిత కామిని స్థానంలో కరుణ, సెల్వస్వామి పాత్రలోకి సెల్వరాజ్ బదులు రవివర్మ, కీర్తన పాత్రలో మేధకు బదులు మరో నటి వచ్చారు.[10]
 4. ఈ ధారావాహికలో ఆర్‌కె నాయుడు పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. వివిధ పరిస్థితుల వల్ల, కారణాల వల్ల తప్పుడు పనులు చేసేవారిని ఈ పాత్ర ప్రేమతో మంచి మనుషులుగా మార్చేస్తుంటుంది. చిన్నతంలో తప్పిపోయిన అతని కుమారుడి పాత్రను కూడా ఒకే నటుడు పోషించాడు.

మూలాలు

మార్చు
 1. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (2 August 2016). "డాక్టర్‌ బంటి సంగీత జీవిత రజతోత్సవం 5న". lit.andhrajyothy.com. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
 2. Murthy, Neeraja (16 April 2010). "All in the family". The Hindu. ISSN 0971-751X. Retrieved 10 October 2019.
 3. Admin (14 December 2019). "Mogali Rekulu Serial". TeluguZ.com-US. Archived from the original on 10 October 2019. Retrieved 10 October 2019.
 4. "Tollywood TV star Sagar's big film debut". Deccan Chronicle. 11 September 2016. Retrieved 10 October 2019.
 5. "Telugu Tv Actress Likitha Kamini". nettv4u. Archived from the original on 10 October 2019. Retrieved 10 October 2019.
 6. "Telugu Movie Actress Sheela Singh". nettv4u. Retrieved 10 October 2019.
 7. "Are You Crazy On Mogalirekulu Serial?". nettv4u. Archived from the original on 10 October 2019. Retrieved 10 October 2019.
 8. "Are You Crazy On Mogalirekulu Serial?". nettv4u. Archived from the original on 10 October 2019. Retrieved 10 October 2019.
 9. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (6 October 2016). "వరంగల్ అబ్బాయి పెళ్లికి హాజరు కానున్న సినీ ప్రముఖులు". andhrajyothy.com. Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.
 10. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (9 February 2014). "టీవీక్షణం: ప్లాస్టిక్ సర్జరీలు ఆపండి!". Archived from the original on 21 June 2020. Retrieved 21 June 2020.

ఇతర లంకెలు

మార్చు