మొదటి పానిపట్టు యుద్ధం
మొదటి పానిపట్టు యుద్ధం, 1526 ఏప్రిల్ 21 న[6] దండయాత్రకు వచ్చిన బాబర్‌కు, లోడి రాజవంశానికి చెందిన ఇబ్రహీం లోడి దళాలకూ మధ్య ప్రస్తుత హర్యానా లోని పానిపట్ వద్ద జరిగింది. మొఘల్ సామ్రాజ్యం ప్రారంభానికి, ఢిల్లీ సుల్తానేట్ ముగింపుకూ ఇది గుర్తు. ఈ యుద్ధంలో మొఘలులు ప్రవేశపెట్టిన గన్‌పౌడర్ తుపాకీలు, ఫీల్డ్ ఫిరంగిలతో భారత ఉపఖండంలో జరిగిన తొలి యుద్ధాలలో ఇది ఒకటి.[7]
మొదటి పానిపట్టు యుద్ధం | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
మొగలు సామ్రాజ్య విస్తరణలో భాగము | |||||||||
మొదటి పానిపట్టు యుద్ధం ఇబ్రహీం లోడీ మరణం | |||||||||
| |||||||||
ప్రత్యర్థులు | |||||||||
Timurids Mughal Empire | Delhi Sultanate
| ||||||||
సేనాపతులు, నాయకులు | |||||||||
బాబర్ ముహమ్మద్ ఖ్వాజా హుమాయూన్ మీర్ ఖలీఫా చిన్ తైమూర్ ఖాన్ ఉస్తాద్ అలీ కులీ ముస్తఫా రూమీ అసద్ మాలిక్ హస్త్ రజా అలీ ఖాన్ | ఇబ్రహీం లోడి † ఖవాస్ ఖాన్ అర్ఘుషల్ స్వాతి | ||||||||
బలం | |||||||||
12,000[1] సైనికులు [2][3] 15–20 ఫిరంగులు [1] | 20,000 ఆశ్వికులు[3] 20,000 సైనికేతర ఆశ్వికులు[3] 30,000 కాల్బలం, కత్తులు, విల్లమ్ములతో[3][2] 1,000 ఏనుగులు [4] | ||||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||||
Unknown | 20,000 సైనికులు మరణించారు[5] thousands killed while retreating[5] | ||||||||
పేలుడు ఆయుధాల వినియోగం, ఆశ్వికదళ దాడుల మేళవింపుతో బాబర్, ఢిల్లీ సుల్తానైన ఇబ్రహీం లోడిని ఓడించాడు. ఈ యుద్ధం భారతదేశంలో మొగలుల పాలనకు నాంది పలికింది. యుద్ధ పర్యవసానాలు దేశంలోని రాజకీయ, సామాజిక భూభాగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. 331 సంవత్సరాల (1526-1857) పాటు సాగిన మొగలు సామ్రాజ్య స్థాపనకు దారితీసింది.[8]
నేపథ్యం
మార్చుసమర్కండ్ను రెండవసారి కోల్పోయిన తర్వాత, బాబర్ 1519 లో చీనాబ్ ఒడ్డుకు చేరుకుని, హిందుస్థాన్‌ను జయించటంపై దృష్టి పెట్టాడు.[10] 1524 వరకు, అతని లక్ష్యం పంజాబ్ వరకు మాత్రమే తన పాలనను విస్తరించడం, తన పూర్వీకుడు తైమూర్ వారసత్వాన్ని నెరవేర్చడం.[11] ఆ సమయంలో, ఉత్తర భారతదేశంలోని చాలా భాగం లోడి రాజవంశానికి చెందిన ఇబ్రహీం లోడి పాలనలో ఉంది. అయితే చాలా మంది ఫిరాయించడంతో సామ్రాజ్యం పతనావస్థలో ఉంది. అతను పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడి, ఇబ్రహీం మామ అల్లా-ఉద్-దీన్ నుండి ఆహ్వానాలను అందుకున్నాడు. [12] దేశ సింహాసనానికి తానే సరైన వారసుడిని అనే సందేశంతో అతను ఇబ్రహీం వద్దకు రాయబారిని పంపాడు. అయితే ఆ రాయబారిని లాహోర్‌లో నిర్బంధించి కొన్ని నెలల తర్వాత విడుదల చేశారు.[10]
బాబర్ 1524 లో పంజాబ్‌లోని లాహోర్ ప్రయాణం ప్రారంభించాడు. అయితే ఇబ్రహీం లోడి పంపిన బలగాలు దౌలత్ ఖాన్ లోడిని తరిమికొట్టినట్లు తెలుసుకున్నాడు.[13] బాబర్ లాహోర్ చేరుకున్నాక, లోడి సైన్యం వారితో పోరాడి ఓడిపోయింది.[13] ప్రతిస్పందనగా, బాబర్ లాహోర్‌ను రెండు రోజుల పాటు తగలబెట్టాడు. ఆపై లోడీ మరొక మామయ్య ఆలం ఖాన్‌ను అక్కడ తన ప్రతినిధిగా ఉంచి, దీపల్‌పూర్ వెళ్ళాడు.[13] ఆ వెంటనే ఆలం ఖాన్ పీఠం కోల్పోయి కాబూల్‌కు పారిపోయాడు. ప్రతిస్పందనగా, బాబర్ ఆలం ఖాన్‌కు కొంత సైన్యాన్ని అందించాడు. ఆలం ఖాన్, దౌలత్ ఖాన్ లోడితో చేతులు కలిపి సుమారు 30,000 మంది సైనికులతో కలిసి ఢిల్లీలో ఇబ్రహీం లోడిని ముట్టడించాడు.[14] లోడీ వారిని ఓడించి ఆలం సైన్యాన్ని తరిమికొట్టాడు. పంజాబ్‌ను ఆక్రమించుకోవడం లోడి ఉండగా కుదరదని బాబర్ గ్రహించాడు.[14]
యుద్ధం
మార్చుఇబ్రహీం లోడీ సైన్యం పరిమాణం గురించి విన్న బాబర్, తన సైన్యపు ఎడమ పార్శ్వానికి రక్షణగా కందకాన్ని తవ్వి, దాన్ని చెట్ల కొమ్మలతో కప్పిపెట్టాడు. మధ్యలో 700 ఎద్దుల బండ్లను తాళ్లతో కట్టి ఉంచాడు. ప్రతి రెండు బండ్ల మధ్య, మందుగుండు వెలిగించే సైనికులు దాక్కునేందుకు అడ్డుగా కవచాలను అమర్చాడు. బాబర్ తన సైనికులు తమ తుపాకులు, ఫిరంగులూ పెట్టుకునేందుకు తగినంత స్థలం ఉండేలా చూసుకున్నాడు. బాబర్ ఈ పద్ధతిని "ఒట్టోమన్ పరికరం" అని పేర్కొన్నాడు. ఎందుకంటే అంతకుముందు చల్దిరాన్ యుద్ధంలో ఒట్టోమన్లు దీనిని ఉపయోగించారు. [15]
ఇబ్రహీం, సైన్యంతో సహా అక్కడికి చేరుకున్నాక, బాబర్ సైన్యంపైకి వెళ్ళేందుకు దారి చాలా ఇరుకుగా ఉన్నట్లు గమనించాడు. అందుకు అనుగుణంగా ఇబ్రహీం తన బలగాలను మోహరించాక, బాబర్ చురుగ్గా కదిలి లోడి సైన్యపు పార్శ్వంపై దాడి చేసాడు. [2] ఇబ్రహీం సైనికులు దాన్ని ఎదుర్కోలేక పారిపోయారు.[1] ఇబ్రహీం లోడి కూడా పారిపోయే ప్రయత్నంలో ఉండగా చంపేసి, అతని తలను నరికేసారు. యుద్ధంలో 20,000 మంది లోడి సైనికులు మరణించారు.[2]
యుద్ధంలో ఫిరంగుల ప్రయోజనం
మార్చుబాబర్ తుపాకులు యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి. ఇబ్రహీం వద్ద ఫిరంగులు లేకపోవడంతో పాటు, బాబరు ఫిరంగుల శబ్దానికి ఇబ్రహీం దళం లోని ఏనుగులు భయపడి పారిపోగా ఆ తొక్కిసలాటలో కూడా అతని సైనికులు మరణించారు.[1]
వ్యూహాలు
మార్చుబాబర్ ఉపయోగించిన వ్యూహాలు తుల్గుహ్మా, అరబా అంటారు. తుల్గుహ్మా అంటే మొత్తం సైన్యాన్ని ఎడమ, కుడి, కేంద్రం అనే వివిధ విభాగాలుగా విభజించడం. కుడి ఎడమ విభాగాలను మళ్ళీ ముందు, వెనుక భాగాలుగా విభజించాడు. దీని ద్వారా, శత్రువును అన్ని వైపుల నుండి చుట్టుముట్టడానికి అతని చిన్న సైన్యం సరిపోతుంది. అప్పుడు సెంటర్ ఫార్వర్డ్ డివిజన్‌కు బండ్లు (అరాబా) అందించాడు. వీటిని శత్రువులకు ఎదురుగా వరుసల్లో నిలబెట్టి, వాటిని జంతుచర్మాలతో చేసిన తాళ్ళతో ఒకదానికొకటి కట్టివేయించాడు. వాటి వెనుక ఫిరంగులను ఉంచాడు. ఈ రెండు వ్యూహాలతో బాబర్ ఫిరంగులు ప్రాణాంతకంగా మారాయి. ఎద్దుల బండ్లు అడ్డుగా, కవచంగా ఉంచడంతో ఫిరంగులు దెబ్బతింటాయనే భయం లేకుండా కాల్చవచ్చు. భారీ ఫిరంగులను కొత్త లక్ష్యాలపైకి కూడా సులభంగా ప్రయాణించగలవు.
అనంతర పరిణామాలు
మార్చుఇబ్రహీం లోడి, 20,000 మంది సైనికులతో సహా యుద్ధ మైదానంలో మరణించాడు. పానిపట్టు యుద్ధం తైమూరీడ్లకు సైనికపరంగా నిర్ణయాత్మకమైన విజయాన్ని అందించింది. బాబరుకు కొత్త భూములు సాధించాడు. భారత ఉపఖండం నడిబొడ్డున 300 సంవత్సరాలకు పైగా కొనసాగిన మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసాడు.[16]
ఇవి కూడా చూడండి
మార్చు- హిసార్ ఫిరోజా యుద్ధం
- ఖాన్వా యుద్ధం
- రెండవ పానిపట్టు యుద్ధం
- మూడవ పానిపట్టు యుద్ధం
- ఘఘ్రా యుద్ధం
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 Watts 2011, p. 707.
- ↑ 2.0 2.1 2.2 2.3 Chandra 2009, p. 30.
- ↑ 3.0 3.1 3.2 3.3 జాదూనాథ్ సర్కార్, Military history of India, p. 50.
- ↑ "Battles of Panipat | Summary | Britannica".
- ↑ 5.0 5.1 Jadunath Sarkar, Military history of India, p. 52.
- ↑ Zahir-ud-din Muhammad Babur (2023). بابرنامه (Baburnama) [Original Chagatai Turkic]. The Baburnama Project.
- ↑ Butalia 1998, p. 16.
- ↑ Bates, Crispin (2013-03-26). Mutiny at the Margins: New Perspectives on the Indian Uprising of 1857: Volume I: Anticipations and Experiences in the Locality (in ఇంగ్లీష్). SAGE Publications India. pp. 3–4. ISBN 978-81-321-1336-2.
- ↑ Chandra 2009, pp. 27–31.
- ↑ 10.0 10.1 Mahajan 1980, p. 429.
- ↑ Eraly 2007, pp. 27–29.
- ↑ Chaurasia 2002, pp. 89–90.
- ↑ 13.0 13.1 13.2 Chandra 2009, p. 27.
- ↑ 14.0 14.1 Chandra 2009, p. 28.
- ↑ Chandra 2009, p. 29.
- ↑ Chandra 2009, pp. 30–31.