మొదటి రుద్రసేన (వాకాటక రాజు)

మొదటి రుద్రసేన (క్రీ.పూ .330 - క్రీ.పూ. 355) వాకాటక రాజవంశం యొక్క ప్రవారపురా-నందివర్ధనా శాఖ యొక్క పాలకుడు. మొదటి రుద్రసేన గురించి చాలా తెలియదు. ఇతను గౌతమిపుత్ర కుమారుడు, రామ్‌టెక్ కొండ సమీపంలో నందివర్ధన (నాగపూర్ నుండి 30 కిలోమీటర్లు) నుండి పాలించాడు.

మొదటి రుద్రసేన
మొదటి వాకాటక రాజు
పరిపాలనసుమారు 330 –  355 సిఈ
పూర్వాధికారిమొదటి ప్రవరసేన
ఉత్తరాధికారిమొదటి పృధ్వీసేన
Houseవాకాటక రాజవంశం
వాకాటక సామ్రాజ్యం
250 సిఈ – 500 సిఈ
వింధ్యాశక్తి (250–270)
మొదటి ప్రవరసేన (270–330)
ప్రవరాపుర–నందివర్థన శాఖ
మొదటి రుద్రసేన (330–355)
మొదటి పృధ్వీసేన (355–380)
రెండవ రుద్రసేన (380–385)
ప్రభావతిగుప్త (రిజెంట్) (385–405)
దివాకరసేన (385–400)
దామోదరసేన (400–440)
నరేంద్రసేన (440–460)
రెండవ పృధ్వీసేన (460–480)
వత్సగుల్మ శాఖ
సర్వసేన (330–355)
వింధ్యసేన (355–400)
రెండవ ప్రవరసేన (400–415)
తెలియదు (415–450)
దేవసేన (450–475)
హరిసేన (475–500)
నందివర్ధన కోట యొక్క శిధిలాలు

అలహాబాదు స్తంభాల శాసనంలో రుద్రసేన గురించి ప్రస్తావన ఉంది మరియును ఆర్యవర్తాలోని ఇతర పాలకులతో ఇది కలసి ఉంది. అనేకమంది పరిశోధకులు, ఎ.ఎస్. అల్తేకర్ వంటి మనిషి మొదటి రుద్రసేనను రుద్రదేవగా అంగీకరించలేదు. అందుకు కారణం మొదటి రుద్రసేన, సముద్రగుప్త ద్వారా తొలగించ బడ్డాడు. ఇదే మొదటి రుద్రసేన తన కుమారుడు అయిన పృథ్వీసేనను గుప్త యువరాణి అయిన ప్రభావతిగుప్తకు ఇచ్చి వివాహం జరిపించి తన కోడలు చేసుకోవటం హర్షించదగిన విషయం కాదని కూడా అభిప్రాయ పడ్డాడు.

రెండోది, మొదటి రుద్రేసన యొక్క శాసనం నర్మదాకు ఉత్తరాన కనుగొనబడలేదు. ఇప్పటివరకు మొదటి రుద్రేసన పాలనలో ఉన్న ఏకైక శిలా శాసనం ఒకటి చంద్రపూర్ జిల్లాలో దోటెక్ వద్ద కనుగొనబడింది. అందువలన ఆర్యవర్తకు చెందిన అలహాబాద్ స్తంభాల శాసనం యొక్క రుద్రదేవ (రుద్రుడు)తో సమానంగా మొదటి రుద్రేసన ఉండలేడు. [1]


వాకాటక రాజవంశం (సుమారుగా 250 - క్రీస్తుశకం 500 సిఈ)

మార్చు

ప్రవరాపుర–నందివర్థన శాఖ

వత్సగుల్మ శాఖ

మూలాలు

మార్చు
  1. "History-Ancient Period, Chapter 3" (PDF). Government of Maharashtra website. Archived from the original (PDF) on 15 జూన్ 2011. Retrieved 13 జూన్ 2017.