మొలుగూరి బిక్షపతి

మొలుగూరి బిక్షపతి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2012లో పరకాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

మొలుగూరి బిక్షపతి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2012 - 2014
నియోజకవర్గం పరకాల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
ఆదర్శ్ నగర్, పరకాల, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి మొలుగూరి చంద్రకళ
నివాసం పరకాల
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

మొలుగూరి బిక్షపతి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి తెరాస అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓడిపోయాడు. ఆయన 2012లో జరిగిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయనకు 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ డికెట్ దక్కలేదు.

ఆయన 2022 అక్టోబర్ 9వ తేదీన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో లో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరాడు.[4]

మూలాలు

మార్చు
  1. Sakshi (12 November 2018). "అంతుపట్టని పరకాల తీర్పు". Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  2. CEO Telangana (2009). "Moluguri Chandrakala" (PDF). Archived from the original (PDF) on 4 June 2022. Retrieved 4 June 2022.
  3. Sakshi (12 December 2018). "'చల్ల'గా చరిత్ర తిరగరాశారు." Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
  4. "In major blow for TRS in Warangal, former MLA to join BJP today". 9 October 2022. Archived from the original on 11 October 2022. Retrieved 11 October 2022.